ఏడు అంకె - బన్ను

seven number

అంకెల్లో '7' వ సంఖ్యకు ఒక ప్రత్యేక స్థానం వుంది. నాకెందుకో 7 అంటే చాలా ఇష్టం. నా లక్కీ నెంబర్ '2' అని చాలా మంది చెప్పినా, నాకు 7 అంటేనే ఇష్టం. వారానికి 7 రోజులని ఎందుకు నిర్ణయించారో తెలీదు గానీ... మనం నివసిస్తున్న భూమిలో 7 సముద్రాలు, 7 ఖండాలు వుండటం గమనార్హం!

పెళ్ళి చేసేప్పుడు 7 అడుగులు నడిపిస్తారు. సప్త ఋషులు, ఏడు కొండలు (తిరుపతి) ఇలా చూస్తే హిందూ ధర్మంలో కూడా 7 కు ఒక ప్రత్యేక స్థానం వున్నట్లనిపిస్తుంది. ప్రకృతి పారవశ్యం చెందినప్పుడు వచ్చే ఇంద్ర ధనుస్సులో కూడా సప్తవర్ణాలు (7రంగులు) వుండటం గమనించే వుంటారు.

హిందీలో 'సత్తే పే సత్తా' అంటారే తప్ప 'అట్టే పే అట్టా' అనరు. 7 అంకెలో ఏదో తెలియని ఆకర్షణ నాకు కనబడుతూ వుంటుంది. మరి... మీకు?

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి