నాగార్జున సాగర్ (పర్యాటకం) - లాస్య రామకృష్ణ

nagarjuna sagar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 165 కిలోమీటర్ల దూరం లో ఉన్న నాగార్జునా సాగర్ భారత దేశం లో ని ప్రముఖ బౌద్ధ కేంద్రాలలో ఒకటి.

ఒకప్పుడు విజయపురిగా ప్రాచుర్యం పొందిన నాగార్జునా సాగర్ కి ప్రస్తుత పేరు ఈ ప్రాంతం లో క్రీ.శ. రెండవ శతాబ్దం వరకు నివసించిన ప్రసిద్ది చెందిన బౌద్ధమత సన్యాసి అలాగే తత్వవేత్త అయిన ఆచార్య నాగార్జున పేరు నుండి వచ్చింది. పురావస్తు పరిశోధనా ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతం యొక్క గొప్పదనం తవ్వకాలలో బయటపడిన ఆధారాల ద్వారా తెలుస్తుంది. క్రీ.శ. మూడవ శతాబ్దం లో ఈ ప్రాంతం దక్షిణ భారత దేశం లో బౌద్ధ బోధనల ప్రచారానికి ముఖ్యమైన కేంద్రంగా వ్యవహరించిందని తెలుస్తోంది.

ఈ డ్యాం ద్వారా తయారయిన సరస్సుఆసియా లో నే మానవనిర్మితమైన సరస్సులలో పెద్దదిగా పేరొందింది. ఈ డ్యాం నుండి 4 కిలో మీటర్ల దూరం లో ఒక వ్యూ పాయింట్ ఉంది . అక్కడి నుండి ఈ ప్రాంతం యొక్క సమగ్ర దృశ్యాలని చూసి ఆనందించవచ్చు.

అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు చే 1955 లో నాగార్జునా సాగర్ ప్రారంభించబడింది. నాగార్జునా సాగర్ యొక్క రిజర్వాయర్ సామర్ధ్యం 11,472 మిల్లియన్ క్యూబిక్ మీటర్లు. ఈ డ్యాం ఎత్తు 490 అడుగులు.  1.6 కిలోమీటర్ల మేరకు ఈ డ్యాం విస్తరించబడింది. ఈ డ్యాం కి 45 అడుగుల ఎత్తు ఇంకా 42 అడుగుల వెడల్పు కలిగిన 26 గేట్లు కలవు.

ఆంధ్ర ప్రదేశ్ లో ని నీటి పారుదల లో నాగార్జునా సాగర్ డ్యాం ముఖ్య పాత్ర పోషిస్తుంది. నల్గొండ, ఖమ్మం, ప్రకాశం, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలకి ఈ డ్యాం ద్వారా సేద్యానికి నీరు అందుతుంది. అంతే కాదు, ఈ బహుళ ప్రయోజక డ్యాం కేవలం సేద్యానికి మాత్రమే కాకుండా హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల లో కూడా తనదైన పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్నే ఈ డ్యాం ని ప్రారంభించినప్పుడు "నాగార్జునా సాగర్ డ్యాం దేశం యొక్క అభివృద్దికి చిహ్నం' అని జవహర్ లాల్ నెహ్రు ప్రస్తావించారు.

జాతీయ ప్రాముఖ్యతే కాకుండా నాగార్జునా సాగర్ డ్యాం ఆధ్యాత్మిక విలువలకి కూడా ప్రముఖమైనది. బౌద్ధ మత నాగరికతకు చెందిన అవశేషాలు క్రీ.పూ. 3 వ శతాబ్దం లో ఈ ప్రాంతం లో జరిగిన తవ్వకాలలో దొరకడం వల్ల ఈ ప్రాంతం  బౌద్ధులకు పవిత్రమైనది. ఇక్కడికి బౌద్ధులు వచ్చి ప్రార్ధనలు జరుపుతారు. నాగార్జునా సాగర్ లేక్ లో ఉన్న ఐలాండ్ మ్యూజియంలో ఈ అవశేషాలను జాగ్రత్తగా భద్రపరిచారు. బౌద్ధ విహారా రూపం లో నిర్మించబడిన ఈ మ్యూజియం లో బౌద్ధుల సంస్కృతీ మరియు కళలు ఉట్టిపడేలా ఉండే అధ్బుతమైన వస్తువుల సేకరణ ఉంది. తవ్వకాలలో బయటపడిన కొన్ని ప్రసిద్ది చెందిన వస్తువులను కూడా ఈ మ్యూజియం లో గమనించవచ్చు. వాటిలో గౌతమ బుద్ధుడికి చెందినటుగా భావించే ఒక చెవి రింగు ఇంకా ఒక దంతం ఆకర్షిస్తాయి. ఇక్కడ కొంత భాగం పాడయిన బుద్ధుడి విగ్రహం ప్రధానంగా ఆకర్షిస్తుంది.

సహజమైన ప్రకృతి సౌందర్యం తో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతం దేశం లో నే ప్రసిద్దమైన పర్యాటక ప్రాంతం గా ప్రసిద్ది చెందింది. హైదరాబాద్ ని సందర్శించే పర్యాటకులు నాగార్జునా సాగర్ ని సందర్శించకపోతే వారి ప్రయాణం అసంపూర్ణం గా మిగిలిపోతుంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నాగార్జునా సాగర్ సరస్సు ఒడ్డున  'విజయ విహార్' అనే పేరుతొ అద్భుతమైన కాటేజ్ ల ని నిర్వహిస్తోంది. ఈ ప్రాంతం లో సందర్శించవలసిన ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్
ఆంధ్రప్రదేశ్ లో ని అద్భుతమైన వాటర్ ఫాల్స్ గా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ప్రసిద్ది చెందింది. నాగార్జునా సాగర్ నుండి కేవలం 11 కిలో మీటర్ల దూరం లో అలాగే హైదరాబాద్ నుండి 160 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కృష్ణా నది కి ఉపనది అయిన చంద్రవంక నది పైన ఉన్నవి. చంద్ర వంక కొండల మీంచి ప్రవహించే ఈ వాటర్ ఫాల్ 70 అడుగుల ఎత్తులో ఉంది. చుట్టూ ఆకుపచ్చని ప్రకృతి  సౌందర్యం తో ఈ వాటర్ ఫాల్ అందాలు పర్యాటకుల మనసులని దోచుకుంటాయి.  ఒకప్పుడు ఈ వాటర్ ఫాల్ అంతగా ప్రాచుర్యం చెందక పోయినా క్రమ క్రమంగా ఈ ప్రాంతం ప్రజాదరణ కి నోచుకుంది. ఇప్పుడు విదేశీ పర్యాటకులని కూడా ఈ ప్రాంతం లో గమనించవచ్చు. ఈ జలపాతాల గల గలలు పర్యాటకులని అమితం గా ఆకట్టుకుంటాయి.

2. నాగార్జున కొండ
చారిత్రక బౌద్ధుల నగరంగా నాగార్జున కొండ ప్రసిద్ది చెందింది. ఇది నాగార్జునా సాగర్ కి సమీపం లో ఉన్న ఒక ద్వీపం. హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరం లో ఆగ్నేయం లో ఉన్న నాగార్జునా కొండ 1960 లో నాగార్జునా సాగర్ నిర్మాణ సమయం లో నీటిలో కలిసిపోయిన ఒక కొండ వల్ల ఏర్పడింది. ఇంతకు పూర్వం శ్రీ పర్వతం గా ప్రసిద్ది చెందిన ఈ కొండ ఆ తరువాత బౌద్ధ మత పండితుడు ఆచార్య నాగార్జున గారి పేరుతొ ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతం లో బౌద్ధుల మ్యూజియం ని గమనించవచ్చు.

3. డ్యాం
ప్రపంచం లో నే అతి పెద్దదైన రాతి ఆనకట్టగా నాగార్జునా డ్యాం రికార్డుని సాధించింది. ఈ డ్యాం ని డిజైన్ చేసిన ఇంజనీర్ ల ప్రతిభ ను పర్యాటకులు మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రపంచం లో నే పెద్దదైన మానవ నిర్మితమైన సరస్సులలో ఈ ప్రాంతం మూడవ స్థానాన్ని పొందింది. ఈ ప్రాంతం చుట్టు పక్కల ప్రాంతాలకి నీటి పారుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao