'బొమ్మరిల్లు ప్రేమ' - బన్ను

Bommarillu Prema

బొమ్మరిల్లు ప్రేమంటే ఏమిటనుకుంటున్నారా? కొడుకుకి కాజువల్ T-Shirt, జీన్స్ ఫాంట్ ఇష్టం. నాన్న ఫార్మల్స్ ఎంతో ఖరీదు పెట్టి కొనిస్తుంటాడు. కొడుక్కి నాటుకోడి బిర్యానీ అంటే ఇష్టం కానీ నాన్న కాస్ట్లీ పీజాలు (ఇటాలియన్) లేదా చైనీస్ డిషెస్ తినిపిస్తుంటాడు. నాన్న ఫీలవుతూవుంటాడు "నేను నా కొడుకుని గొప్పగా చూసుకుంటున్నాను" అని. కొడుకు నరకం అనుభవిస్తుంటాడు. పైకి చెప్పుకోలేడు. ఇదండీ బొమ్మరిల్లు ప్రేమంటే!

ఐతే ఇది తండ్రీ, కొడుకుల విషయం లోనే కాదు. భార్యా భర్తల విషయంలోనూ... ముఖ్యంగా బాస్ ఎంప్లాయిస్ మధ్య కూడా ఎక్కువగా వుంటుంది. నాకు తెలిసిన వ్యక్తొకాయన ఒక స్కూల్ నడుపుతూంటాడు. ఆ స్కూల్ ఆర్ధికంగా లాభాలు ఆర్జిస్తున్న తరుణంలో ఆయన వాళ్ళ స్టాఫ్ కి ఫైవ్ స్టార్ హొటల్ లో విందు ఏర్పాటు చేయాలనుకున్నాడట! 'నా స్టాఫంతా బాగా సంతోషిస్తారు' అనుకుంటూ మురిసిపోయాడట! ఈ విషయం తెల్సుకున్న స్టాఫ్ మొత్తం ఆయన దగ్గరకొచ్చి చేతులు పట్టుకుని.. "సార్... మీరు మా 20 మంది స్టాఫ్ కి విందు ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. ప్లేటుకి వారు 1000 చార్జ్ చేస్తారని కూడా తెలిసింది... మీకు కావాల్సింది మా ఆనందమే ఐతే మాకు తలో వెయ్యి రూపాయలు ఇప్పించండి... మీరు పెట్టే విందు భోజనం కన్నా... ఎక్కువ ఆనందిస్తాము" అని చెప్పారట. స్కూల్ ఓనర్ ఫీలింగ్ మీరు ఊహించొచ్చు.

మనం ప్రక్కవారికి ఏదివ్వాలనుకున్నా మనకు నచ్చినట్టు కాకుండా వాళ్ళకు నచ్చినట్లు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి