గుండె ఊటలు (నానీలు) - యస్.ఆర్. పృథ్వి

Gunde Ootalu(naaneelu)

కాసులు ప్రవాహం
పారి పోతాయ్
కామం కర్పూరం
కరిగి పోతుంది

వెండి తెర వగలు
బుల్లి తెర పొగలు
కుర్రకారుకి
బుర్రనిండా సెగలు

రాయిని ఉలి తాకితే
శిల్పం వచ్చింది
శిలలోంచా?
ఉలిలోంచా?

కామం
బుసలు కొడితే
మంట కలుస్తాయి
వావి వరుసలు

జావకార్చే పథకాలు
జాతి ఎదపై గునపాలు
ఎక్కడ?
గుక్కెడు జావ!

రంగులు అందమే
హృదయానికి వేస్తే
మనిషి తనం మీద
మాయ పొర

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం