దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapudongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

నార్త్ లండన్ లోని నేట్ వెస్ట్ బేంకులోకి ప్రవేశించిన దొంగ డేవిడ్ రిచ్ అక్కడున్న కస్టమర్స్ కి, భేంకు ఉద్యోగస్థులకి చేతిలోని రివాల్వర్ ని చూపించి, అందరినీ నేలమీద పడుకోమన్నాడు. హెచ్చరికగా తుపాకిని సీలింగ్ వైపు పేల్చాడు. ఆ గుండు వెళ్ళి పైనా వేలాడే షాండ్లియర్ వైర్ కి తగలడం తో అది తెగి, సీలింగ్ నుంచి అమాంతం అది వచ్చి ఆ దొంగ నెత్తిమీద పడటం తో అతనికి స్పృహ తప్పింది. స్పృహ రాగనే అతను పోలీసు కస్టడిలో ఉన్నాడు.

 


 మెజొర్నా లోని పాల్ళా అనే ఊళ్ళో ని ఓ దొంగ స్వీడన్ నుంచి వచ్చిన ఓ టూరిస్ట్ చేతిలోని హేండ్ బేగ్ ని లాక్కుని పారిపోయాడు. అయితే అయిదు నిముషాల్లో పోలీసులొచ్చి ఆ స్వీడిష్ గర్ల్ ని అరెస్ట్ చేసారు! కారణం ఆమె హేండ్ బేగ్ లోని డ్రగ్స్, హెరాయిన్ ని చూసిన ఆ దొంగ ఆ సంగతి పోలీసులకి రిపోర్ట్ చేసాడు. ఆమె హోటల్ గదిలో ఇంకాస్త డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  .  . 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి