"పూజా ఫలం " అంటే పూజ చేస్తే దక్కే ఫలం. 'పూజా ఫలాలు' అంటే పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టవలసిన ఫలాలు. అవి రెండే రెండు. 1) అరటిపండు , 2) కొబ్బరికాయ.
వేరే ఏ ఫలమయినా ఎంగిలి 'గింజ' ద్వారా మొలిసిన వృక్షం కావచ్చు. ఉదాహరణకి మామిడి టెంక నుంచి మామిడి చెట్టు వస్తుంది. అది ఎవరో తిని విసిరేసిన టెంకతో మొలిసిన చెట్టు కావచ్చు. అలాగే సపోటా లేదా జామకాయ ఏదన్నా తీసుకోండి... అవి గింజల ద్వారా మొలకెత్తుతాయి.
అరటి చెట్టు, కొబ్బరి చెట్టు అలా కాదు! అందుకే పూజకి 'ఎంగిలి' లేని ఫలాలు ఆ రెండూ!! అరటి పండు, కొబ్బరికాయ మాత్రమే పూజఫలాలు !