గుండె ఊటలు (నానీలు) - యస్.ఆర్. పృథ్వి

Gunde Ootalu(naaneelu)

ధిపత్యం కోసం
ఇరుగు పొరుగు పోరు
నెత్తురు
పారుతున్న సెలయేరు

పచ్చదనం
పరిమళించాలిగాని
కాలుష్యానికి
కాణాచి అయితే ఎలా?

నలుపూ తెలుపూ అని
పేచీలెందుకు
అందరి రక్తం
ఎరుపే ఐనప్పుడు

రాజకీయమైనా
వ్యాపారమైనా
ఎవరిగోల వాళ్ళది
లబ్ధే అవధి

రోజు రోజుకీ
కొత్త పథకాలు
హైటెక్కులు
సంస్కృతిలో తైతక్కలు

ఆనందం
జీవనది అయితే
మనసు మట్టిలో
తృప్తి మొలకలు

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి