పుస్తకం: తత్వ శాస్త్రం- చిన్న పరిచయం
రచన: ముప్పాళ్ల రంగనాయకమ్మ
ధర: 70/-
ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌజ్ (0866-2431181)
గత రెండు వారాలుగా ఎడతెరిపిలేకుండా చదువుతున్న పుస్తకం ఇది. అందుకు రెండు కారణాలు. ఒకటి నాకు ఎప్పటినుంచో తెలుసుకోవాలనుకుంటున్న విషయం, రెండు ఆ తెలిపేది రంగనాయకమ్మ గారు కావడం.
చాలా మంది వేర్వేరు ప్రసంగాల్లోనూ, వ్యాస రచనల్లోను, మామూలు పిచ్చాపాటి కబుర్లలోను సడన్ గా తత్వ శాస్త్రవేత్తల్ని కోట్ చేస్తుంటారు. ఆ కొటేషన్ విన్నవారికి అర్థం కాకపోయినా కోట్ చేసిన వారికి తత్వ శాస్త్రంపై పట్టు బాగా ఉందన్న భ్రమ కల్పిస్తుంది. ఉదాహరణకి సినీ దర్శకులు రాం గోపాల్ వర్మ పలు సందర్భాల్లో అయాన్ ర్యాండ్, నిషే, ఇమ్మాన్యువల్ క్యాంట్....ఇలా ఎక్కడెడెక్కడి పేర్లో చెప్పి వాళ్ల కోటేషన్స్ కోట్ చేస్తుంటారు. వర్మ నుంచి విన్న తర్వాతే నిషే "జొరతుస్త్రా" చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను. నావల్ల కాలేదు. అయాన్ ర్యాండ్ నవలలు చూసాను. సగం చదివి ఆపేసాను. అందుకు కారణం వాటిల్లో విషయం లేదని కాదు. నాలో విషయం లేదని.
ఎలాంటి శాస్త్రమైనా మన స్థాయికి దిగి చేయందించినపుడే, అందుకుని పైకెక్కగలుగుతాం. ఎక్కడో వంద మెట్ల అవతల ఉండి చేయి అందించినా అందదు కదా! ఎలాగో అలా ఆ వందమెట్లూ ఎక్కాలంటే . రంగనాయకమ్మగారు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కాని, నాకు మాత్రం అలా చేయందించి ప్రపంచంలోని తత్వశాస్త్రాన్నంతా పరిచయం చేసారు అనిపించింది, ఈ పుస్తకం చదివితే.
232 పేజీల ఈ పుస్తకంలో తత్వశాస్త్రం తీరుతెన్నుల గురించి సరదా శైలిలో చెబుతూ, దాని చుట్టూ అల్లుకున్న సృష్టివాదం, భావవాదం పీటముళ్లని విప్పుతూ, మార్క్స్, హెగెల్, స్టాలిన్, మావో...మొదలైన తత్వవేత్తలు అసలు ఏం చెప్పారు..?! మొదలైన విషయాలన్నీ అరటిపండు వలచినంత తేలిగ్గా చెప్పారు.
ఇకపై ఎవరన్నా ఏ తత్వవేత్తనైనా కోట్ చేసినప్పుడు ఏ మాత్రం బెదరకుండా వారితో కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికైనా, కనీసం విని ఊరుకోకుండా చర్చచేయడానికైనా అవసరమయ్యే జ్ఞానం ఈ పుస్తకం ఇస్తుంది. ఏళ్ల తరబడి ఫిలాసఫీ క్లాసుల్లో కూర్చుని విన్నా పెద్దగా బోధపడని తత్వశాస్త్రాన్ని రంగనాయకమ్మ ఇలా సరళీకృతం చేసారు.
ఇది ఏదో అకడమిక్ ఇంటెరెస్ట్ తో చదివే పుస్తకం అని మాత్రం అనుకోవద్దు. ఇది చదివితే జీవితం మీద, నమ్మకాలమీద, అపోహలమీద ఒక క్లారిటీ వస్తుంది. సరిగ్గా చదివితే అల్టిమేట్ గా ఇది వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడొచ్చు. ఆ వికాసంతో కొందరు రచయితలు కావొచ్చు, కొందరు వక్తలు కావొచ్చు, కొందరు ఏకంగా కొత్త తత్వవేత్తలుగా రూపాంతరం చెందొచ్చు.
"రామాయణ విషవృక్షం" రాసి ఆమె ఎంత పాపం మూటగట్టున్నారని ఈ లోకం అనుకుంటోందో తెలియదు కాని, బరువైన తత్వ శాస్త్రాన్ని తేలిక చేసి ఆ జ్ఞానాన్ని ఎక్కువమందికి చేరేలా చేసి ఎంతో పుణ్యం చేసుకున్నారు.
-సిరాశ్రీ