ప్రస్తుత విద్యాసంవత్సరంలొ సిలికానాంధ్ర మనబడిలో 3000 మంది పిల్లలు చక్కగ తెలుగు వ్రాయటం,చదవటం, మాట్లాడటం నేర్చుకున్నారు. మరింతమంది రేపటి తరం పిల్లలకి ప్రణాళికాబద్ధంగ తెలుగు నేర్పించాలని చేసే ప్రయత్నమే సిలికానాంధ్ర మనబడి ప్రభంజనం 2014. సిలికానాంధ్ర మనబడి ప్రభంజనంలో భాగంగా, వచ్చే విద్యాసంవత్సరంలొ 5000 మంది పిల్లలకి తెలుగు నేర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా దేశమంతటా వందలాదిమంది తెలుగు భాషా ప్రేమికులు స్వచ్చందంగా మనబడి ప్రభంజనం ప్రచారంలొ పాల్గొంటున్నారు.
ప్రయోగాలకి పుట్టినిల్లయిన సిలికానాంధ్ర మనబడి ప్రచార చిత్రం ఒకటి రూప కల్పన చేసింది. తెలుగు భాషాభిమానాన్ని పెంచడానికి చరిత్రలో తొలి సారిగా ఆకాశంలొ 15000 అడుగుల ఎత్తులో ఒక ప్రచారచిత్రం చిత్రీకరణ చేయటం జరిగింది. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల ఇందులొ స్వయంగా పాల్గొనడం విశేషం. మనబడి ద్వారా తెలుగు నేర్పించే కార్యక్రమానికి ప్రాచుర్యం కల్పించడానికి ఈ ప్రచార చిత్రం ఉపయోగించబడుతుంది.
ప్రముఖ గీత రచయిత శ్రీ సిరివెన్నెల శాన్ హోసె నగరంలొ ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. ఆ సందర్భంగ సిరివెన్నెల మాట్లాడుతూ 'మనబడిలొ తెలుగు నేర్పె విధానానికి మరేది సాటి రాదు. ఇన్ని వందలమంది ఉపాధ్యాయులు ఇలా అంకితభావంతొ ఇన్ని వేలమంది పిల్లలకి తెలుగు నేర్పడం ఈ భూతలం మీద ఒక్క మనబడిలోనే చూశాను.' అని అన్నారు.
మనబడి కులపతి రాజు చమర్తి మాట్లాడుతూ 'మనబడిలో పిల్లల్ని చేర్పించడానికి అంతర్జాలంలొ పేర్లు నమోదు చేసుకొవచ్చు. సెప్టెంబెర్ 6 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.'అని చెప్పారు.
సిరివెన్నెల ఆవిష్కరించిన సిలికానాంధ్ర మనబడి ప్రభంజన ప్రచార చిత్రం సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, దీన బబు కొండుభట్ల, నల్లమోతు ప్రసాద్, శ్రీరాం కొట్ని, మహమ్మద్ ఇక్బాల్, వెంకట్ కొండ తదితరులు పాల్గొన్నరు.