మీ పలుకు - పాఠకులు

mee paluku

మన ప్రస్తుత పాలకుల వైఫల్యాల కారణంగా, మనదేశంలో/రాష్ట్రంలో గుక్కెడు నీళ్లకై - మైళ్ళకి మైళ్ళు నడిచి దాహార్తిని తీర్చుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్న పల్లె/పట్టణ జనాల పరిస్థితుల్ని మన 'మీడియా' (పత్రికలూ/టి వి) కళ్ళకు కడుతున్న ప్రస్తుత తరుణంలో, మన మిత్రులు శ్రీ శాస్త్రి గారు "అపర భాగీరధుడ"యిన కాటన్ దొర గార్ని గురించి, వారిని స్మరిస్తూ, చక్కని వ్యాసం మనకు అందించడం ముదావహం. కాటన్ దొర అలనాటి బ్రిటిష్ పాలకుల తరుఫున ఉద్యోగరీత్యా మన దేశానికి, అదియునూ, మన రాష్ట్రానికి వచ్చితన ఇంజినీరింగు ప్రతిభా-పాటవాలతో - ఉభయ గోదావరి జిల్లాల నేలను సశ్యశ్యామలం గావించిన తీరు మహాద్భుతం. మరి మన ప్రస్తుత పాలకులకు కొంచెమయిన స్పందన కలిగేనా. సరియయిన సందర్భంలో కాటన్ దొరవారిని గురించి ఈ మంచి వ్యాసాన్ని మనకందించిన మన మంచి మిత్రులు, శ్రీశాస్త్రిగారు, కొనియాడదగినవారనడంలో సందేహంలేదు.
--- మొహమ్మద్ అబ్దుల్ వహాబ్.

గోతెలుగు మంచి అభిరుచి వున్న సాహితీ మూర్తులచే ప్రచురింప బడుతున్నది. ఉత్తమ వ్యాసాలు, నవలలు, కథల సమ్మేళనం. అన్ని రకాల పాఠకులను ఆకట్టుకొనే పత్రిక. శుభం భూయాత్.
--- గుమ్మా రామలింగ స్వామి.

'మనసా కవ్వించకే నన్నిలా' కథ చాలా బాగుంది. నా వీకెండ్ లైఫ్ గుర్తుకు వచ్చింది.
--- తన్మయి

'వరదొచ్చింది' కథ చివరి రెండు లైన్లు చదవగానే నా కళ్ళు చెమర్చాయి.
--- నారాయణ స్వామి

గోతెలుగు పత్రిక సంపాదకులకు నమస్సులు. మీ ఈ వెబ్ పత్రిక చదువుతుంటే షడ్రశోపేతమైన భోజనం చేస్తునట్టుగా ఉంది. కథలు, సీరియల్సు, కార్టూన్లు, సినిమా ముచ్చట్లు, ఆధ్యాత్మిక, పర్యాటక విశేషాల మేళవింపు చాల బాగుంది. ఈ వారం నృసింహ జయంతి సందర్భంగా వేసిన ముఖచిత్రం అదుర్స్. ఇలాగే.. మన తెలుగు పండుగలు, పర్వదినాలని వాటి విశేషాలను కూడా తెలుపగలరు. కథలకు వేస్తున్న చిత్రాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా 'వరదొచ్చింది' కథ యొక్క చిత్రం సూపర్. హాట్సాఫ్ టు ఆర్టిస్ట్ .
--- వెంకట్, బెంగళూరు

కావ్యాలని చదవాలని అనిపించేంత అందంగా, చదివితే టూకీగా బావుంటుందేమో అన్నంత ఆశ గా, చిన్న పుస్తకం, అతి చిన్న ధర కొనేసి చదివితే పోలే అన్నంత ధీమాగా చక్క గా వుంది సమీక్ష. మేఘ సందేశం కోసం ఓ మంచి అవకాశం.
---కృష్ణా రావు
 

 

మీ అభిప్రాయాల్ని "[email protected]" కి పంపితే "మీ పలుకు" లో ప్రచురిస్తాము

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు