నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
ఆస్ట్రియాలో వియన్నా నగరం లోని వేండెస్క్ బేంక్ - హైపోథికెన్ బేంక్ బ్రాంచ్ లోకి ఓ కొత్త దొంగ వెళ్ళి, తుపాకి చూపించి ఓ కౌంటర్ లోని కేషియర్ ని డబ్బడిగాడు.
"నా దగ్గర కేష్ క్లోజ్ చేశాను. పక్క కౌంటర్ లో తీసుకో." చెప్పిందా కేషియర్.పక్క కౌంటర్ కి వెళ్ళి ఆ దొంగ మళ్ళీ తుపాకీ చూపించి డబ్బడిగితే ఆ కేషియర్ చెప్పింది.
"నా దగ్గ్ర ఒక్క నోటు కూడా లేదు. అన్నీ నాణాలే. కావాలంటే పట్టుకెళ్ళు." అని ఓ నాణాల మూటని కౌంటర్ మీద వుంచింది. అయితే అది కౌంటర్ రంధ్రం లోంచి తీసుకునేలా కాక పెద్దదిగా వుండడంతో విసుగొచ్చి ఆ దొంగ ఉత్త చేతులతో వెళ్ళిపోయాడు.
కెంటుకికి చెందిన ఇద్దరు దొంగలు ఓ ఏటీయం ని దొంగిలించదలచుకున్నారు. ఆ ప్రయత్నం లో భాగంగా తమ వేన్ కి కట్టిన ఓ ఇనప గొలుసు ఏటీయం కి కట్టి వేన్ని ముందుకి పోనిచ్చారు. ఏటీయం ని వాళ్ళు పెకలించే ఆ ప్రయత్నం లో వారి కారు బంపర్ ఊడి పోయింది. ఆ చప్పుడుకి చాలామంది రావడం తో వారు పారిపోయారు. ఆ ఇనుప గొలుసు చివర చిక్కుకునా వారి వేన్ బంపర్ కి వారివేన్ నెంబర్ ప్లేట్ చిక్కుకుని పోలీసులకి కనిపించింది. దాంతో ఆ దొంగల్ని పోలీసులు ఇట్టే పట్టేసారు