వరలక్ష్మీ వ్రతం - సుశీలారాం

varalaksmi vratam

 భారతీయ సంస్కృతిలో అదీనీ ,తెలుగువారికి అతిముఖ్యమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ప్రతి ముత్తైదువా తప్పక ఆచరించే వ్రతం ఇది. ప్రతి తెలుగు సం.రపు తెలుగు మాసమైన శ్రావణమాసపు శుక్లపక్షంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం జరుగుతున్నది.ఈ రోజు ఏకారణంవల్లనైనా నోచుకోలేనివారు మూడవ శుక్ర వారం నాడు  ఈ వ్రతం ఆచరింస్తారు. ఈ జయనామ సం. లో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8వ తేదీన జరుపుకుంటున్నాం. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి అర్ధాంగలక్ష్మి . వరలక్ష్మిని వరాలు ప్రసాదించే దేవతగా భక్తితో పూజిస్తారుమహిళలు.ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల్లో ముత్తైదువలు ఎక్కువగా ఆచరిస్తారు.  ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరించడం  అష్టలక్ష్మీదేవతలను పూజించడంతో  సమమనే నమ్మకంఉంది.ముఖ్యంగా సువాసినులు సంపూర్ణ ముత్తైదువుగా, మృత్యు సమయంవరకూ  ఉండాలని, అంటే సువాసినీ మరణం కలగటంకోసం  పూజిస్తారు. వరలక్ష్మీదేవి అనుగ్రహంవల్ల  అష్టఐశ్వర్యాలు -సంపద, భూమి, సంతానం, ధాన్యం, ప్రేమ,కీర్తి, శాంతి, సంతోషం ,శక్తి వంటివి లభిస్తా యని విశ్వాసం.

నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే  
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే


అని అమ్మను స్తుతిస్తాం. మహామాయాస్వరూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహా లక్ష్మీ దేవి అష్టైశ్వర్య ప్రదాయిని,జగన్మంగళ దాయిని. అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం పూజిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచి నవారికీ ఈమె  కొంగుబంగారం.పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు, స్కాంద పురాణంద్వారా  తెలుస్తు న్నది. లోకంలో స్త్రీలంతా సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని చెప్పమని పార్వతీదేవి ఆది దేవుని కోర గా, శివుడు , గౌరీదేవికి  వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని బోధించాడని చెప్తారు.  శివు డు  ఆమెకు చారుమతీదేవి కధను ఇలా  చెప్పాడం టా రు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ,దైవంపట్ల భక్తిప్రపత్తులనూ, తొటివారిపట్ల సమభావాన్నీ,స్నేహశీలతనూ చూపే చారు మతి ఉత్తమ ఇల్లా లుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారు మతి , అమ్మవార్నిత్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్క రించి, శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు  వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన  వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవి అభయ మిస్తుం ది. ఆదేవి ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమ  సమస్త సిరి సంపదల్ని అందుకుందని, ఈశ్వరుడు, గౌరికి విశద పరచాడని పురాణ గాధ. అపుడు పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెప్తారు.

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర ఉవాచ. శ్రీహరికి ఇష్టమై నదీ, విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం పేర  శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి విశేష ఫలితాలు పొందవచ్చని విశ్వాసం తో ఈవ్రతాన్ని ఆచరించడం జరుగుతున్నది..సర్వశుభముల కోసం, సకలాభీష్టసిధ్ధికోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని అత్యంత భక్తితోఆచరిస్తారు. సకల శుభంకరమైన, సన్మంగళ దాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదా నంద కరమైనదని మనవిశ్వాసం  ఫూ జా  సామగ్రీ అంతా శక్తికొలదీ సమకూర్చుకుని , కళశం ఉంచి , ముందుగా పసుపుగణపతిని పూజించి నివేదనచేసి ఆపైన , దేవిని అష్టో త్తరం తో పూజసల్పి  ,  కొబ్బరికాయ , లభ్యతానుసారంపూలతో దేవినిపూజించి  , కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి , వ్రత కధను ప ఠించి, మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూ త్రాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేస్తాం.

ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి.
ఓం రమాయై నమ ద్వితియ గ్రంథిం పూజయామి.
ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి.


ఇలా మంత్రం పఠిస్తూ తోరాలను పూజించి , మూడుముళ్ళువేసుకుని ధరిస్తాం ముత్తైదువులకు తోరాన్నిస్తాం.. నైవేద్యానికి శక్త్యానుసారం  పిండివంటలూ, పండ్లూ  అమ్మవారికి నివేదనచేస్తాం. సుమంగళు లకు వాయనం ఇస్తారు.

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao