వరాహ జయంతి - హైమా శ్రీనివాస

varaha jayanti

హిందువులు దశ జయంతులను దశావతారాల స్మరణగా జరుపుకుంటారు.  అవి-మత్స్య జయంతి ,కూర్మ జయంతి ,వరాహ జయంతి ,,నృసింహ జయంతి,వామన జయంతి ,పరశురామ జయంతి,శ్రీరామ జయంతి ,బల రామ జయంతి ,శ్రీకృష్ణ జయంతి ,బౌద్ధ జయంతి ,కల్కి జయంతి ,ఆయా తిధుల ప్రకారం ఈ జయంతులుం జరుపుకుంటాము.సనకసనందనాదు లు విష్ణు దర్శనార్ధమై వైకుంఠమున కు  రాగా వారిని లోనికి పోనీక  అడ్డగించి వారి కి ఆగ్రహం కలిగించి, శాప వశులైన  విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు, భూమిపై కామ క్రోధా ధి అరిషడ్వర్గాలకు వశులై మొదటిజన్మలో హిరణ్యాక్ష , హిరణ్య కశ్యపులుగా జన్మిస్తారు. హిరణ్యా క్షుడు ఆగ్రహంతో  విష్ణునామం జపిం చే వారినంతా కడగండ్లపాలు జేస్తూ, ఒకనాడు భూమినే జలధిలో వేస్తాడు. అపుడు భూమాత ప్రార్ధనమేరకు విష్ణువు ,భూ సంర క్షణా ర్ధం  హిరణ్యాక్షుని సమ్హరించను వరాహ రూపుడై వచ్చి , భూగోళాన్ని ఎత్తి కాపాడి, ఆధూర్తుని సమ్ హరిస్తాడు.అలా వరాహరూపం తో ఉద్భవిం చిన రోజే వరాహ జయంతిగా జరుపుకుంటాం. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఇది మూడవ అవతారం. తిరుమలలో ని వరాహ స్వామిని ముందు గా దర్శించాకే బాలాజీని దర్శించడం ఆనవాయితీ. ఐతే  ఈ వరాహావతార ఉద్భవానికి ఒక సంఘటన ఉంది.బ్రహ్మ, పృధ్వి జలధిలో మునుగి పోవుట గూర్చిచింతిస్తూ, దానిని ఉద్ధరించే మార్గం గురించీ ఆలోచిస్తుండగా ఆసృష్టికర్త  నాసికనుండీ  బొటన వ్రేలు పరిమాణంలో ఉన్న   ఒక వరాహ శిశువు వెలువడిదిట!. క్షణాల్లోఅది పర్వతమంత పెరిగి  ఘుర్జించసాగిందిట!  విధాత ఆ ఘుర్జింపు విని ,ఆరూపుడు భగవాన్ విష్ణు  వే   అని ఎరింగి వానిని స్తుతించగా, ఆవరాహ స్వరూపుడు  ప్రసన్నుడై, వెళ్ళిహిరణ్యాక్షుని సమ్హరించి, పృధ్విని కాపాడి ఆ పైన అక్కడ సంచరించిన ప్రదేశమే  నేటి తిరుమలకొండఅంటారు. భక్తులు  వరాహ స్వామిని మూడు  రూపాలలో కొలుస్తారు ,ఆది వరాహ స్వామి గా ,ప్రళయవరాహ స్వామి గా ,యజ్ఞ వరాహస్వామి గా ,వీనిలో  తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వరూపం . అలా పృధ్వీ, దానిపై నున్న మానవసమ్రక్షణార్ధం విష్ణు మూర్తి వరాహ రూపు డైన రోజే ఈ వరాహ జయంతిగా మనం జరుపుకుంటున్నాం. కోరిన కోర్కెలు తీర్చే వరాహ రూపుని ధ్యానించి పూజించిన వారికంతా ఆస్వామి దీవెనలు, రక్షణ తప్పక లభిస్తాయని దువులనమ్మిక. ఈరోజున స్వామిని అర్చించి , కీర్తించి,తమకోరికలు విన్నవించుకుంటారు. అనేక వరాహ ఆలయాల్లో జనం భక్రిశ్రధ్ధలతో స్వామిని దర్శిస్తారు.  సింహాచలము.. విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రము.ఇది శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ,ఈదేవుని ప్రజలు  సింహాద్రి అప్పన్న గా పిలుస్తారు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఈరోజున స్వామిని అర్చించి , కీర్తించి,తమకోరికలు విన్నవించు కుంటారు. అనేక వరాహ ఆలయాల్లో జనం భక్రిశ్రధ్ధలతో స్వామిని దర్శిస్తారు. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది,మిగిలిన సమయం లో  ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు వస్తుంది. ప్రకాశం జిల్లా కందుకూరు తాలుకా లోని సింగరాయకొండ గ్రామం లోనారద మహర్షిచే  ప్రతిష్ఠించినట్లుగా వరహ నరసింహమూర్తి దేవాలయం మహామహిమాన్వితమీనది.  మాలకొండలోని మాల్యాద్రి నిలయం నుంచి సింగరాయ కొండలోని వరహ లక్ష్మినర సింహస్వామి వారి దేవాలయానికి సొరంగ మార్గం ద్వారా దారిఉందని అంటారు.

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao