టంగుటూరి ప్రకాశం పంతులు గారు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు ,దేశభక్తుడు, మేధావి,ప్రజాసేవకుడు, ధీరుడు, కార్యదక్షుడు 1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎంపికయ్యారు.. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగాచొక్కాగుండీలుతీసి గుండెచూపి’ కాల్చ’ మని నిబ్బరంగానిల్చి తెల్లదొరలను హడలెత్తించి’ఆంధ్రకేసరి ‘అని పేరు పొందినమహానుభావుడు టంగుటూరి ప్రకాశం.
ప్రకాశం గారు 1872 ఆగష్టు 23 ననేటి ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెం గ్రామంలో సుబ్బమ్మ, వెంకట నరసింహం దంపతు లకు జన్మించాడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరు లో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణాలుగా పనిచేసేవారు. ప్రకాశం గారి11వయేట తండ్రి మరణించడంతో, పిల్లలతో తల్లి ఒంగోలు చేరి,పిలల్లపోషణార్ధం భోజనశాల నడిపసాగింది. పొట్టకూటికోసం పూటకూళ్ళ వృత్తి చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. చిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు.
వల్లూరులో ప్రకాశంగారి ప్రాథమిక విద్య సాగింది.అల్లరిచిల్లరి స్నేహాలు,నాటకాలలో వేషాలు వేయటంతో చదువుకుంటుపడింది. మిషను స్కూల్ ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావునాయుడు సాయంతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చేరాడు. ఆయన ప్రకాశాన్ని తనతోపాటు రాజమండ్రికి తీసుకెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ. లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయ శాస్త్రం చదివించాడు. ప్రకాశంగారికి 1890 లో తనఅక్క కూతురైన హనుమాయమ్మతో వివాహమవుతుంది. కొంతకాలం ఒంగోలు లో న్యాయవాద వృత్తి చేసి, 1894 లో మళ్ళీ రాజమండ్రి వెళ్ళి,వృత్తిలోబాగా పేరూ,పుష్కలంగాడబ్బూ సంపదించారు. ప్రకాశం తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.
అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు ఐనందున పైస్థాయి కోర్టులలో వాదించను అర్హత లేకపోయింది. బారిస్టర్లకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశాన్ని కూడా బారిస్టరు కమ్మని ప్రోత్సహించాడు. అతడిమాటతో ప్రకాశం 1904 లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మాగాంధీ లాగానే మధ్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇస్తాడు.దీక్షగా చదివి బారిస్టరై,అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక అయ్యేలా ప్రచారంలో పాల్గొంటాడు. ఈ సమయంలో ప్రకాశంకు జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.
1907లో, లండనులో ప్రశంసా పత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులోప్రసిద్ధి చెందిన బారిష్ట ర్లందరూ ఆంగ్లేయులు లేదా తమిళులుఉండేవారు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ప్రకాశంగారే ప్రప్రధములు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి, 1921 అక్టోబరు లో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు. 1921 లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలి పెట్టే నాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసిన మహా మహుడు.
లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో ఒకేకాలలంలోవిడుదలయ్యే'స్వరాజ్య' పత్రికకు సంపాదకునిగాపని చేశాడు. కొద్దికాలంలోనే, ఈ దినపత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు. 1921 డిసెంబర్లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, 1922లో సహాయనిరాకరణోద్యమం సంద ర్భంగా గుంటూరులో 30,000 మంది స్వఛ్ఛందసేవకులతో ఒక ప్రదర్శనను. నిర్వహించాడు .1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్భాయ్ పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా , జి.డి.బిర్లావంటి జాతీయ నాయకులతో ప్రకాశం పనిచేశారు. 1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చి నపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంత పార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు.
సైమన్ కమీషను,భారత దేశాన్నిసందర్శించవచ్చినప్పుడు కాంగ్రెసు పార్టీ 'సైమన్ గోబాక్' అన్ననినాదముతో ఆ కమీషన్ను బహిష్క రించటానికి నిర్ణయించింది. కమీషన్ వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసనప్రదర్శనలు జరిగాయి. ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హై కోర్టు సమీపంలో మూక విపరీతంగా పెరిగిపోయింది. వాళ్లను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థ సారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చు తా మని పోలీసులు హెచ్చరించారు. దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం,తనచొక్కాచించి ధైర్యంగారొమ్ము చూపించి, కాల్చమని సవాలుచేశాడు. పరిస్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు ప్రకాశాన్ని అతడి అనుచరులనూనుమతించారు.ఈ సంఘటన తర్వాత ప్రజలు ఈయనను "ఆంధ్ర కేసరి" అన్న బిరుదు తో గౌరవించారు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. 1945 లో జైలు నుండి విడుదలైన తర్వాత, ప్రజలకు చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు.1946లో కాంగ్రెసు పార్టీ తిరిగిమద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచినపుడు,1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనా పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11నెలలు మాత్రమే పాలించింది..
1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమం తీవ్రతర మైంది. ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియ మితు డయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష,తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయస్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం,విజయవాడ వద్ద కృష్ణానది పై బారేజి నిర్మాణం[దీన్నే నేడు ప్రకాశం బ్యారేజ్ గా పిలుస్తున్నాం.] వీటిలో ప్రముఖమైనవి.
1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించినాడు. ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రి లోచేర్పించబడ్డాడు.అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు.
స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం పంతులు పేరుశాశ్వతంగా నేటికీ ఆంధ్ర దేశములో వెలుగొందుతూ ఉంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరునుప్రకాశం జిల్లాగా మార్చారు.
ఫ్రస్తుత ప్రత్యేక ఆంధరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడుగారు ఏస్థాయిలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారో వేసిచూద్దాం.