నల్లేరు - జయలక్ష్మి జంపని

Nalleru Plant

నల్లేరు వాడకం వలన మన జీవితం నల్లేరుఫై నడక లాగ హాయిగా సాగిపోతుంది. నల్లేరు గురించి పల్లెటూళ్ళలో తెలిసినట్టుగా పట్టణ ప్రజలకు అవగాహన లేదు. ఉళ్లల్లొ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. తీగ జాతిలాగా ఉండి కణుపులు కణుపులుగా పెరుగుతూ ఉంటుంది. ఈ తీగ నాలుగు పలకలుగా, నలుచదరంగా ఉంటుంది.

నల్లేరు శాస్త్రీయ నామం సిస్సస్ క్వాడ్రాంగ్యులా ఎల్. అంటారు. ఆంగ్లములో దీనిని ఎడిబుల్ స్టెమ్మేడ్ వైన్ అంటారు. సంస్కృతములో ఆస్థి సంహార, వజ్రవల్లి అంటారు.

సిద్ధ వైద్యములో నల్లేరు రసం చాలా వ్యాధులకు వాడతారు. విరిగిన ఎముకల అతుకుటకు నల్లేరు రసం అమోఘంగా పని చేస్తుంది . ఎముకలు విరిగినా చిట్లినా నల్లేరు రసం రోజూ పధ్ధతి ప్రకారం ఒక చెంచా, 8 వారాలు తీసుకుంటే ఖచ్చితముగా ఎముకలు అతుకుతాయని శాస్త్రీయముగా ఋజువు అయింది.

నల్లేరు లో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలముగా ఉన్నాయి. నల్లేరు రసం రక్తహీనత  లేకుండా కాపాడుతుంది . ఇందులో కేరోటినాయిడ్లు బాగా ఉన్నాయి. ఇంతే కాకుండా కాన్సర్ కణాల పెరుగుదల నిరోధించే ట్రై టెర్పనాయిడ్లు మరియు ఎస్కోర్బిక్ యాసిడ్లు నల్లెరులో అధికముగా కలవు.

నల్లేరు తీగ లోని లేత కణుపులు కోసి వాటి తొక్కు తీసి పచ్చడి చేస్తారు సొరకాయ, బీరకాయ మాదిరి. దోసలలోకి కూరలలొకి వాదతారు. తొక్కు తీసేటపుడు కొంచెం జాగ్రత్తగా చేతికి నూనే రాసుకుని తీయాలి. లేకుంటే చేతులు దురద పెడతాయి. నల్లేరు లోపలి గుజ్జు అప్పడాల పిండిలో కలిపి వత్తితే బాగా పొంగుతాయి.

నల్లేరు మొక్కలను భూమిలోనే పెంచాలని ఏమీ అనుకోవద్దు. అపార్ట్ మెంట్ లలో కూడా తక్కువ స్థలం ఉన్నా కుండీలో మనీ ప్లాంటు లాగ పెంచవచ్చు. దీని పెరుగుదల కూడా చాలా వేగంగా ఉంటుంది. నల్లేరు కణుపు కోసి కుండి లోని మట్టిలో పెడితే చాలు. బతుకుతుంది, మట్టిలో గుచ్చిన నెలలోనే పెరుగుదల మొదలవుతుంది.

అధిక బరువు తగ్గించుకోవడానికి వాడతారు. గ్రీన్ టీ, సోయా లలో ఉండే సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి లలో ఉండే గుణాలన్నీ నల్లేరు లో ఉన్నాయి. మహిళలలో 40 వయసు తర్వాత వచ్చే మెనోపాజ్ లక్షణాలలో చాలా ముఖ్యం , ఎక్కువగా ఇబ్బంది పడేది ఎముకల బలహీనత వలన. నల్లేరు లో అధికముగా ఉండే కాల్షియం వలన అటువంటి ఇబ్బందులు తగ్గుతాయి . ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం చిన్న దెబ్బలకు ఎముకలు విరగడం వంటివి ఎముకల కాన్సర్ రాకుండా నల్లేరు ఎంతగానో ఉపయోగపడుతుంది.

నల్లేరు లోని పీచు పదార్ధం వలన ఫైల్స్ ప్రాబ్లం రాదు. ఆస్తమా, అరుగుదల సమస్యలకు నల్లేరు దివ్యౌషధం . అంతే కాకుండా యాన్టి బ్యాక్టీరియల్  గుణాలు కలిగిన నల్లేరులో గ్యాస్ట్రిక్ అల్సర్ నిరోధించే హెలికో బ్యాక్టీరియల్  ఫైలోరీ  ఉంది. సిద్ధ వైద్యంలో నల్లేరు విశిష్టత గురించి ఏంతో గొప్పగా ఉంది. ఒక ముఖ్య గమనిక ఏమిటంటే తాటి చెట్టుకు పాకుతున్న నల్లేరు వాడకూడదు. దానిలొని సుగుణాలన్ని  విషపురితమవుతాయి అని పతంజలి ఆయుర్వేదంలో చెప్పబడింది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు