నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
కేలిఫోర్నియాలోని అనాహెం అనే ఊళ్ళోని ఓ బేంక్ లోకి ఓ దొంగ వచ్చి తుపాకి చూపించి డబ్బు దొంగలించి పారిపోయాడు. కాని కస్టమర్ లలోని ఒకరు ఆ దొంగని క్లార్క్ గా గుర్తుపట్టి అతని ఇంటి అడ్రసు పోలీసులకి చెప్పింది. పోలీసులు ఆ చిరునామాకి వెళ్ళి క్లార్క్ ను ప్రశ్నిస్తే అతను తన తప్పును ఒప్పుకున్నాడు.
క్లార్క్ తల్లే పోలీసులకి తన కొడుకుని పట్టించింది.! తను మిన్నకుంటే, తననీ పోలీసులు అవమానించవచ్చని భయపడడంతో ఆమె కొడుకు చిరునామాని ఇచ్చింది.
పిట్స్ బర్గ్ లోని బేంకుకి ఓ దొంగ వెళ్ళి డబ్బివ్వు లేదా చంపేస్తా అనే చీటీని కేషితర్ కిచ్చి డబ్బు దొంగతనం కేసు విచారణలో కోర్టుకి రమ్మని, పోలీసులనించి వచ్చిన సమన్స్ వున్నాయి. ఆ దొంగని పోలీసులు తక్షణం వెదికి పట్టుకుని సెర్చ్ చేస్తే, బేంకు నించి అతను దొంగలించిన డబ్బు అతని దగ్గర దొరికింది.
నే రాసిన చీటీ వెనకాల ఏం వుందో చూసుకోలేదు. అన్నాడా దొంగ తన తప్పిదానికి సిగ్గుపడుతూ...