దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!


కన్సాస్ లోని ఓ కన్యూమర్ మెన్స్ స్టోర్ లో ఒకతను తన గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళి తుపాకి చూపించి డబ్బు దోచుకున్నాడు. అక్కడ కౌంటర్ మీద వున్న జాన్సన్స్ బేబీ పౌడర్  కాంటెస్ట్ ఫారాన్ని అతని గర్ల్ ఫ్రెండ్ తీసుకోవడం సేల్స్ మెన్ చూసాడు. ఈ సంగతి అతను పోలీసులకి చెప్పితే వారు ఆ రోజు వచ్చిన కాంటెస్ట్ పేపర్లన్నీ తణిఖీ చేస్తే, ఆ స్టోర్ అడ్రస్, రబ్బరు స్టాంపు గల కాంటెస్ట్ ఫారాల్లో ఆడవాళ్ళు నింపి ద్రాప్ బాక్స్ లో వేసింది. పోలీసులు ఆ అడ్రస్ కు వెళితే దొంగలిద్దరు వెళితే దొంగలిద్దరు దొరికారు. ఆమెని సేల్స్ క్లర్క్ గుర్తుపట్టారు.

 


న్యూయార్క్ రాష్ట్రానికి చెందిన కేర్మెల్ అనే ఊళ్ళోని  డొన్నా బ్రూనో అనే ఆమె అర్ధరాత్రి ఏవో అడుగులచప్పుడు వినిపించాయని పోలీసులకి ఫోన్ చేసింది. వాళ్ళొచ్చి ఆమె ఇళ్ళు వెదికితే, దొంగలు ఎవరూ లేరు కానీ ఆమె భర్తకి సంబంధించిన 10 పౌండ్ల మారిజానా పొట్లాలు కనబడ్డాయి. ఆమె భర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు.

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao