లోకంలో ఎంతోమంది జన్మిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కొందరు మాత్రమే కారణ జన్ములు. వారు లోకంలో శారీరకంగా లేకున్నా అంతా వారిని శాశ్వతంగా స్మరిస్తూనే ఉంటారు. అట్టి మహామహుల్లో ఒకరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయనా అందరిలా జన్మించి స్వశక్తితో అసా ధారణ ప్రఙ్ఞతో పైపైకెదిగి పలువురికి మార్గదర్శకంగా, తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు. కొనితెచ్చుకున్న గౌరవంకాక 'కొలిచి' తెచ్చు కున్నగౌరవం, వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కారరీత్యా ఆయన్ను వరించింది. ఏపనిలోనైనా నిబధ్ధత కలిగి ఉండాలని ఆయనజీవితం మనకు పాఠం చెప్తుంది.
నిచ్చెన ఒకరు వేస్తే ఎక్కడంకాక , నిచ్చెన ఆయన చెంతకే వచ్చి ఎక్కమంది.అలా ఆయన తన విఙ్ఞతతో పదోన్నతిని అందుకున్నారు. శ్రీ సర్వే పల్లి రాధాకృష్ణన్ 1888లో సెప్టెంబర్ 5వతేదీన తిరుత్తణి లో వీరాస్వామ య్య , సీతమ్మ దంపతులకు జన్మించారు. తిరుత్తణిలో ప్రాథ మిక విద్య సాగింది. బాల్యం నుండే అఖండమైన ఆయన తెలివితేటలుచూసి ఉపాధ్యాయులంతా ముగ్ధులయ్యేవారు.ఆతర్వాత కళాశాల విద్య కొన సాగింది, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుండీ ఎం.ఏ పట్టా పొందాడు. విద్యార్ధిగా వున్నపుడే మనస్తత్వశాస్త్రంపై బాగా అధ్యయనం చేసి ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకునేవి. రాధాకృష్ణన్ కు 16 సం.వయసులోనే శివకామే శ్వరితో సంప్రదాయం ప్రకారం వివాహం జరి గింది. వీరికి ఐదుగురు కుమార్తెలు,ఒక కుమారుడు. ఆయనసతీమణి 1956 లో 51 సం.వయస్సులో మరణించారు.
ఆయన 21 సంవత్సరాలవయస్సులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలోఅధ్యాపకునిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను తెల్సు కున్న మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్ గా ఆహ్వానించింది. ఆయన ఉపన్యాసాలు విద్యార్థులనెంతో ఆకట్టుకునే వి.నిశ్చలంగా కద లక మెదలక ఆయన బోధించే అంశాలను ఎంతో శ్రద్ధగా వినేవారు. ఆయన ప్రతిభ గుర్తించిన డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్లు కలకత్తా విశ్వవిద్యాలయఆచార్య పదవి చేపట్టమని కోరారు. వారి ఆహ్వానం మేరకు కలకత్తా వెళ్ళాలని రాధాకృష్ణన్ నిశ్చయించుకున్నారు.ఇక్కడే ఆయన కీర్తిదశదిశలా వ్యాపించేషఘటానజరిగింది.అది చిరస్మరణీఅయమైంది. రైల్వేస్టేషన్ కు వెళ్ళేందుకై గుర్రపు బండిని పిలిపిముకున్నారాయన. తమను వీడివెళుతున్న తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పను విద్యార్థులు ఆయన ఇంటికి వచ్చారు. బండికి కట్టిన గుర్రాలను విడిచి , రైల్వే స్టేషన్ వరకూ తామే బండిని లాక్కొని వెళ్ళారు. విద్యార్ధులకు ఆయనపట్ల వున్న ప్రేమకు,గౌరవానికీ అది నిదర్శనం. విద్యార్ధుల భక్తి శ్రద్ధలను గమనించిన రాధా కృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి. అది ఆనాటి గురుశిష్యుల పరస్పర హృదయాను బంధం. ఆ ప్రేమానుబంధం నేడు అసలు కాన రాదు.
కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన'భారతీయ తత్వశాస్త్రం'అన్న గ్రంథం వ్రాశాడు.ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంస లందుకున్నది."మీరు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ తీసుకుని వుంటే మీకు ఇంకామరింత గొప్ప పేరు వచ్చేది" అనిఒక మిత్రుడు అనగా, బదులుగా, డా. రాధాకృష్ణన్, "నేను ఆక్స్ ఫర్డ్ వెళ్తే, అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తాను. కాని విద్యార్ధిగా మాత్రం వెళ్ళను" అన్నాడు. ఆయనకు అంతదేశభక్తి, స్వదేశీ విద్యాలయాలపట్ల అంత గౌరవం,ఆత్మాభిమానం. అలా అన్న ఆరేళ్ళ తర్వాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం వారి ఆహ్వానంపై, ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు వెళ్ళారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా వంటి విదేశాల్లో ఉపన్యాసములిచ్చి మాతృదేశ కీర్తిని పెంచి వచ్చారు.
1931లో డా.సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలరుగా పనిచేశారు.1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'సభ్యులుగా ఎన్నుకోబడ్డాడు.1936లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవా ధ్యాపకు డుగాపనిచేశారు.1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగష్టు 14--15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్. ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డా.రాధాకృష్ణన్, 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.ఆయనే తొలి ఉప రాష్ట్రపతి.ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్-రెఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫి, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ వంటి చాలా గొప్ప గ్రంథాలు రచించినారు.
1962లో బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి పదవి నుండి విరమించుకున్నాక,తర్వాత రాష్ట్రపతిఐన డా. రాధాకృష్ణన్ అయిదేళ్ళ కాలంలో ఎన్నో దేశాల్లో పర్యటించారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్యపాశ్చాత్వ తత్వశాస్త్రాలపై చేసిన ఉపన్యాసాలు అన్నిదేశాలవారిని ఆశ్చర్య పరిచాయి. రాధాకృష్ణన్ తన మాటల్లో చాలాఛలోక్తులువిసిరేవారు.అయన హాస్యం ఎవ్వర్నీ బాధించేదికాదు.ఆయన ఉపన్యా సాల్లో బాగా ఛలోక్తులు, హాస్యోక్తులు దొర్లేవి. ఒకసారి సర్. మహ మ్మద్ ఉస్మాన్ ,మద్రాసు రాష్ట్రమంత్రి, డా.రాధాకృష్ణన్ ఒకే సభలో మాట్లాడారు. సర్ మహ మ్మద్ ఉస్మాన్ను గురించి మాట్లాడుతూ, "శ్రీ ఉస్మాన్ నాకు చాలా సన్నిహిత మిత్రుడు. ఆయన కాలేజీలో మొదట సీనియర్. ఆ తర్వాత నా క్లాస్మేట్. తర్వాత నా జూనియర్. నేను మద్రాసులో ప్రొఫెసర్గా వున్నప్పుడు ఆయన అదే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. నేను వైస్ ఛాన్సలర్ గా వుండినపుడు ఆయన ఛాన్సలర్ "అంటూ హాస్యంగా ఆయన గూర్చిన సత్యాలు వక్కాణించారు రాధాకృష్ణన్.
ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో రాధాకృష్ణన్నుసత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం వారిని 'భారతరత్న' తో సత్కరించింది. రాధాకృష్ణన్ తన జీవితంలో ఎన్నో ఉన్నత పురస్కారాలు అందుకున్నారు. 1954 లోబ్రిటిష్ రాయల్ గౌరవ సభ్యత్వం ,ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆయన అందుకున్న పురస్కారాల్లో కొన్ని1975లో 'టెంపుల్ టన్' బహుమతి ద్వారా లభించిన 96 వేల డాలర్ల మొత్తాన్ని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతిపై ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. రాధాకృష్ణన్ గారు, డా. కె. యం మున్షీ గారితో కలిసి ఆధనంతో భారతీయ విద్యా భవన్ స్థాపించారు.మహామేధావిగా, గొప్పవ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా, ప్రపంచ దేశాల గౌరవాలను అందుకున్నారు. డా. రాధా కృష్ణన్ .1967 లో రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత చివరిరోజు వరకు మద్రాసులోని తమ భవనంలో, తాత్విక చింతన చేస్తూ 17.4.1975న పరమ పదించారు.
రాధాకృష్ణన్ సౌమ్యుడు,విద్యావేత్త,నిరడంబరు డు,తత్వవేత్త,రాజకీయవేత్త,తెలి వైనవాడు. రాధాకృష్ణన్, మానవజీవితంలో మంచిని పెంచా లనీ, ఉత్తమ సమాజాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లో మమతాను రాగా లను పెంచే దిశగా ప్రపంచం కృషి చేయాలన్నారు. అహింసా విధానం ద్వారా ప్రపంచ దేశాల్లో శాంతిని పెంచవచ్చన్నారు
ఆయన అఖండ ప్రఙ్ఞాపాటావాలకూ, ముందుచూపుకూ ,ఉపాధ్యాయునిగా ఆయన బాధ్యతకూ ఈ సంఘటన నిదర్శనం. ఒకమారు ఆయన రాష్ట్రపతిగా పనిచేసేప్పుడు ఆయన జన్మదినాన ఆయన్ను అభినందించేందుకై వచ్చిన వారితో ఆయన మందస్మిత వదనంతో " నాకు సన్మానాలు, శుభాకాంక్షలు చెప్పే బదులుగా మీరు, నాజన్మదినాన్ని ' ఉపాధ్యాయ దినోత్సవంగా' ప్రకటించి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తే నన్ను సంతోష పెట్టినట్లే, నాకు సన్మానం చేసినట్లుగా భావిస్తాను, ఉపాధ్యాయులకు మేథావులు ఉండాలి , దానికై వారిని ప్రోత్స హించాలనిచెప్పారు .ఎంత ఉన్నత హృదయం! ఎంత విశాల దృక్పధం! ఆవిధంగా1962 సం నుండీఆయన పుట్టిన రోజైన సెప్టెంబరు 5 న.‘గురుపూజోత్సవం ‘ గా ప్రభుత్వం ప్రకటించి,భారతదేశంలో జరుపుకోడం జరుగుతున్నది. పాఠశాలలకు ఉత్తమ సేవలందించిన ఉపాధ్యా యులను ఎంపికచేసి వారికి రాష్ట్రపతి అవార్డులు ఇవ్వడం నేటికీ జరుగు తున్నది. ఆయన పుణ్యమాని ఉపాధ్యాయులూ ఈ సమాజంలో గౌరవ పుర స్కారాలు అందుకునే స్థాయికి వచ్చారు.ఉపాధ్యాయ వర్గం మొత్త రాధాకృష్ణన్ గారికి సర్వదా ధన్యవాదాలు తెలుపవలసిఉంది.

రాధాకృష్ణన్ సౌమ్యుడు,విద్యావేత్త,నిరడంబరు