కాకూలు - ఆకుండి సాయిరాం

బ్లడ్ రిలేషన్
అన్నదమ్ముల నడుమ అపార్థాలు...
తెలుగు వారి మధ్య తగాదాలు!
ఇరుగు పొరుగులకేల ఇన్ని జగడాలు..
కలిసిపోదామనుకుంటే అన్నీ శుభాలు!!


మేత మే ట్రిక్స్
ప్రజా పంపిణీ నాణ్యతలో అక్రమాలు..
పౌర సరఫరా వ్యవస్థలో దోపిడీలు!
జనభ్యున్నతి పథకాలకు లేవు నిధులు..
లంచాల మేతతో అంతా కుదేలు!!

 


మాయా ప్రపంచం
అసలుకి ఎసరు పెట్టే కల్తీలు..
నాణ్యతను నష్టపరిచే నకిలీలు!
బోల్తా కొట్టించే బురిడీలు..
మోసపోయాక మిగిలేదిక దిగులు!!

మరిన్ని వ్యాసాలు