నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
న్యూ కరోలీనాలోని స్టోన్విల్లేకి చెందిన పేట్రిక్ హెన్రీ నేషనల్ బేంక్ లో దొంగతనం చేసిన ఓ దొంగని పోలీసులు పావుగంటలో పట్టుకున్నారు. అతను తను వచ్చిన చిన్న పిల్లల సైకిల్ మీదే పారిపోతూంటే.
స్పెల్లింగ్ తెలుసుకునుండటం ముఖ్యం. నలుగురు దొంగలు షికాగో శివార్లలోని ఓ జంతువుల డాక్టర్ క్లినిక్ తాళం పగలగొట్టి ఆక్సిట్సిన్ అనే మందుని ఎయ్యుకెళ్ళారు. అది జంతువుల్లో కానుపు త్వరగా జరగడానికి, తర్వాత పాలుపడటానికి ఉపయోగిస్తారు.
ఆ నలుగురు టీనేజర్స్ దాన్ని ఆక్సి కొంటిన్ అని పొరబడ్డారు. అది రక్తం లోకి ఎక్కితే డగ్స్ తీసుకున్నప్పుడు కలిగే స్థితి కలుగుతుంది. ఆక్సిటోసిన్ ని వాడిన ఆ నలుగుర్ని తల్లి తండ్రులు అపస్మారక స్థితి లో హాస్పిటల్ లో చేర్పించాక గాని దొంగలని తెలీలేదు.