నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి

ముందుగా గోతెలుగు పాఠకులకు దసరా శుభాకాంక్షలు...

నా మాట......

దేవుడిచ్చిన  వరం  జీవితమయితే, ముందుగా ఆ దేవుని  ప్రతిరూపాలై  నిలిచిన నా తల్లితండ్రులకి, నా లోని విద్యలకి మెరుగులు దిద్దిన గురువులకి, హృద్యాభివందనాలు!!

నాలుగు దశాబ్దాలకు పైగా నా సుదీర్ఘకళాజీవన ప్రస్థానంలో నన్నాదరించిన కళాభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు......

మరుగున  పడుతున్న  ఎన్నో ‘స్వీట్ మెమరీస్’ – గోతెలుగు పత్రిక- ద్వారా  షేర్ చేసుకునే అవకాశం సరదాగుంది..

నా  అంతరంగాన  నిలచిపోయిన,  జ్ఞాపకాలకి తెర తీసి, వాటిల్లో కొన్నింటిని   మీతో పంచుకోగలగడం  ఓ కొత్త అనుభవంగా భావిస్తాను.....

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సంఘటనలు, సందర్భాలు ఉంటాయి....

ముఖ్యంగా, ఓ తనయగా-భార్యగా-తల్లిగా, జీవితాన్ని మరింత దగ్గరగా అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, ప్రశంసిస్తూ, పరితపిస్తూ ముందుకు సాగడం మాత్రం  ప్రతి స్త్రీ తన విధిగా నిర్వహిస్తుంది.

ఓ కళాకారిణిగా,  ఓ రచయిత్రిగా ఇంకొన్ని అనుభవాలు, అనుభూతులు చవి చూసాను కూడా.

ఈ మధ్యనే – స్త్రీ మనస్థితి గురించి, నేను చదివిన ఓ కవిత నా మనస్సులో నిలిచిపోయింది...

.....ఏన్నో ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ సంఘర్షణలకు సమాయత్తమవుతూ పోరాడడం, సర్దుకుపోవడం, ఓడిపోవడం ఆ ఓటమిలోనే గెలిచానన్న తృప్తితో అప్పుడప్పుడు మిణుకుమిణుకుమనే సంతోషాల నక్షత్రాలకోసం ఎదురుచూస్తూ అందరికోసం అన్నీ చేస్తూ, తనకోసం తాను అన్వేషిస్తూ తన బంధాల(రంగుల)లో కలిసిపోవాలనే తాపత్రయంలో వాటినే చుట్టుకుని ఒదిగిపోయి మురిసిపోతూ.....,,,,,

ఓ మగువ - తన గుప్పెడంత గుండెలో, ఆకాశమంత అవగహన, ప్రేమ, త్యాగాలని ఇముడ్చుకుంటుంది కదా అనిపించింది...

వృత్తి, కుటుంబం, బంధాలు, బాంధవ్యాలు ఎన్నో అనుభవాలని ప్రసాదిస్తే,  జీవితాన జరిగే కొన్ని సంఘటనలు సందర్భాలు మనస్సులో మరువలేని చెరగని ముద్రవేస్తాయి...

అదలా ఉంటే, ‘నాట్య భారతీయం’ రూపు దిద్దుకున్న వైనం---

నేను రచించిన ‘రాజీ పడిన బంధం’ నవలకి  చక్కని ముఖచిత్రాన్ని, బొమ్మలని వేసిన మాధవ్ గారు, నాకు చిత్రకారుడుగా  పరిచయమయ్యారు....అందంగా చిత్రించిన బొమ్మలతో, కార్టూన్స్ తో, అప్పుడప్పుడు తన రచనలతో గో- తెలుగు పత్రికని ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్న  కార్టూనిస్ట్, మాధవ్ గారే ‘నాట్య భారతీయం’ కాన్సెప్ట్ కి రూపకల్పన చేసారు.

ఆ కాన్సెప్ట్ గురించి ఆయన నా వద్ద ప్రస్తావించినప్పుడు, హ్యూస్టన్ లోని మా ‘అర్చనా ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ’ముప్పైయవ  యానివర్సరీ సాంస్కృతిక సంబరాలు ఒక వైపు, ‘రంగప్రవేశం’ కార్యక్రమాల ప్రాక్టీసులతో  మరోవైపు నాకు ఊపిరాడకుండా ఉండడంతో,దాని గురించి పెద్దగా ఏమీ అనుకోలేదు. తరువాత కొద్ది కాలానికి,సీరియల్ గా  పబ్లిష్ అవ్వనున్న ‘ఎగిరే పావురమా!’ అనే నా నవలకి బొమ్మలు వేయించడం కోసం మళ్ళీ మాధవ్ గారిని కాంటాక్ట్ చేసాను. ఆ నేపధ్యంలో, కనీసం మరో రెండు సార్లైన మాధవ్ గారు ‘నాట్య భారతీయం’ గురించి మాట్లాడారు...

గో-తెలుగు పత్రిక కోసం ‘నాట్య భారతీయం’  శీర్షిక మొదలుపెట్టాలని కోరారు.  ఆ శీర్షికని ఆసక్తికరంగా మలచవచ్చని  నన్ను  ప్రోత్సహించారు. మా అకాడెమీ కార్యక్రమాలు ముగియడంతో, ఆ విషయమై ఆలోచించాను... జీవితాన్ని రవ్వంతైనా ఆకళింపు చేసుకొని, అంతరంగాన్ని ఒక్కింతైనా పలుకగలిగితే మంచిదే అన్న తలంపు కలిగింది....

దాంతో, గో-తెలుగు ద్వారాఇలా ‘నాట్య భారతీయం’ కి నాంది పలకడమైంది.

నాదైన ప్రపంచంలో,నాతో పాటు జీవితాన్ని పంచుకున్న  నా భర్త, మా పిల్లలు ఉన్నారు......కాక,నా నృత్యం, యోగా... నా చుట్టూ నా శిష్యురాళ్ళు, వాళ్ళ రంగప్రవేశాలు,అప్పుడప్పుడు  సభలు, సదస్సులు, డాన్స్ ప్రోగ్రాములతో  ఒక్కోప్పుడు హడావిడిగానే ఉంటుంది....

గార్డెనింగ్, పెట్స్  నాకెంతో ఆనందానిస్తాయి...

నా అంతరాల్లో మాత్రం,- రాగాలు, స్వరాలు, సరాగాలు, లయగతులు, నర్తనలు, నటనలు, నాట్యాలు  నిత్యం సందడి చేస్తుంటాయి.  అలాగే మనస్సుకి హత్తుకునే విషయాలకి స్పందించి, నా తలపులకి అక్షరరూపం  కలిగిస్తుంటాను  కూడా....

నృత్యం నా జీవన విధానమయింది.  దాంతో సాహిత్యం, భాష, సంస్కృతులు – నా నృత్య శిక్షణలో భాగాలయ్యాయి.  నేను, హ్యూస్టన్ – టెక్సాస్ లో స్థాపించిన “అర్చన డాన్స్ అకాడెమి” కి ముప్పై వసంతాలు నిండాయి...

జీవన ప్రస్థానంలో -  సంతోషాలు-సంబరాలు-నిరాశలు-నిస్పృహలు-జయాలు-అపజయాలు సహజమే ననుకుంటా....... కొంచెం  ఇష్టంగా,  కొంచెం కష్టంగా అయినా,  మొత్తానికి చిరునవ్వుతోనేజీవితాన్ని సాగానివ్వాలని  నా  ప్రయత్నం....

ఈ శీర్షిక లోని ఆర్టికల్స్ చదువుతున్న మీకు, ఆసక్తిగా అనిపించనంత కాలం నేనూ ఆసక్తిగా రాయాలనే అనుకుంటున్నాను....

మీ స్పందన, మీ అభిప్రాయం తప్పక తెలియజేస్తారు కదూ!

ఇట్లు,

‘నాట్యభారతి’ ఉమాభారతి.....

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి