దీపావళి - సుశీలా రాం

diwali

దీపావళి  హిందువుల  ముఖ్యమైన పడుగ. స్త్రీలు,పురుషులు  పిన్నల నుండీపెద్దల వరకూ, అంతా ఆనందంగా, జరుపుకునే పండుగ. నరకుని శ్రీకృష్ణూడు సమ్హరించిన రోజే నరకచతుర్దశి, మరునాడు దీపావళి,ఇదిరెండురోజులపండుగ. నరక తత్వమునుండీ నరతత్వము నకు పయనిస్తూ దీపాలనువెలిగించి, మనలోని ఙ్ఞానజ్యోతికి నిదర్శనంగా ' తమసోమాజ్యోతిర్గమయా "  అనిపాడుకునే పండుగ. ఆశ్వీయుజమాస చతుర్దశి, అమావాస్యనాడు రెండురోజులూ జరుపుకుంటాం.లోకంటకుడుగా ఉన్న నరకుడు మరణించి నందుకు సంతో షంగా టపాసులు కాల్చి ఆనందించేరోజు.    పూర్వం నరకుడనే రాక్షసుడు భూదేవికుమారుడు, బ్రహ్మ గురించీ ఘోర తపస్సు చేసి తల్లి వలన తప్ప మరణం లేని వరం పొంది, వరగర్వంతో ముల్లోకాలనూ పీడించ సాగాడు.తనస్నేహితుడైన కంసుని సమ్హరించాడనే కోపంతో నరకుడు శ్రీకృష్ణునిపై అకారణ వైరం పూని మధురను ముట్టడించి ప్రజలను అశాంతికి గురిచేయగా,శ్రీకృష్ణుడు ప్రజలనందరినీ ద్వారకకు తరలించి రక్షిస్తాడు.

నరకుని రాజధాని  ప్రాగ్జోతిషపురం .అంటే ముందుజ్యోతి అంటే వెలుగు కల నగరం.అంటే చీకట్లో ఉండే నగరం. అంత రార్ధానికి వస్తే ఆత్మ తత్వాన్ని మరచి ఇంద్రియ భ్రాంతితో దుష్ట ప్రవర్తన గలవారు నివసించే నగరం. పూర్వపు జ్యోతి అనగా ఆత్మజ్యోతిని మరచిన వారి నగరం . అలాంటి నగరానికి అధిపతి నరకుడు.యధా రాజా తధాప్రజా. నరకుడు క్రూరుడై వేలమంది స్త్రీలను పట్టితెచ్చి చెర బడ తాడు.16,00 మంది గోపికలు . ముల్లోకాల ప్రజలు, దేవతలు సైతం వాని బాధ పడలేక శ్రీకృష్ణుని ప్రార్ధించగా , వారికి అభయ మిస్తా డాయన.,  నరకుడు అనేక పర్యాయాలు శ్రీకృష్ణుని పై యుధ్ధానికి రాగా ,కృష్ణుడు పారి పోతాడు , మనకు ఆశ్చర్యం కలుగు తుంది. `భగ వంతుడు పారి పోటమేంటాని, కానీ అంత రార్ధం చూస్తే నరకునికి కోపం తెప్పించి అతడిని శక్తిహీనుని గావించి చివరకు భూదేవి అవతార మైన సత్యభామ చేతనే కంస సమ్హారం చేయిస్తాడు మాయామానుష  వేషధారి ఐన కృష్ణుడు. నరకుని మర ణంతర్వాత ప్రజలంతా నిర్భ యులై దీపాలను వెలిగించుకుని బాణాసంచాకాల్చుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చుకున్నారు.

అంతేకాక  శ్రీరామచంద్రుడు వనవాసందీక్షలోఉండగా అయోధ్యవాసులంతా శోకంలోమునిగి నగరంలో దీపాలుసైతం వెలిగించుకోలేదుట! రావణవధానంతరం శ్రీరాముడు అయొధ్యలో తిరిగి ప్రవేసించగానే తమ ఆనందాన్ని తెలుపుతూ దీపాలు వెలిగించారనీ, అందువల్ల అప్పటి నుండీ ఇలా దీపలను వెలిగించడం ఆచారంగావచ్చిందనీ కూడచెప్తారు.శ్రీమహావిష్ణువు  వామనావతారంలో బలిచక్రవర్తిని మూడ డుగుల దానం అడిగి పాతాళలోకానికి అణచివేసినతర్వాత  , బలి సత్ప్రవర్తనకు సంతసించి ఆతడికి అనేకవరాలు సైతం ఇస్తాడు. ఆవర ప్రభావంతో బలిచక్రవర్తి సంవత్సరానికోమారు భూలోకానివస్తాడనీ ,అతడిని ఆహ్వానించను దీపాలు వెలిగించడం కేరళప్రజల విశ్వాసం. బలిచక్రవర్తి రాకను ప్రతిఏడాదీ ఆశ్వీయుజ అమావస్యనాడు కేరళప్రజలు దీపాలతో స్వాగతిస్తారు.కొన్నిప్రాంతాలలో ప్రజలు దీపావళిరోజున అవకాశం ఉన్నంత మేరకు బంగారు వెండి నాణాలతోను, రూపాయలు, కరెన్సీనోట్లతోనూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆశ్వీయుజ  కార్తీక మాసాలలో  చీకటి చలి ప్రారంభమయ్యే సంధికాలం కావటాన క్రిమికీటకాల బాధ పోగొట్టుకోను మందుగుండుసామాను పేల్చడంవల్ల అఘా టుకు అవి నశిస్తాయి.  దీపాలు వెలిగించడం. జయోత్సవ చిహ్నం

ముందుగా పూజాగృహంలో దేవునిముందు దీపంవెలిగించి దానినుంచీ మిగిలినదీపాలను వెలిగించడం విధాయకం.ఈజ్యోతి బాహ్యచీకటి ని తొలగిస్తుంది, ఆంతరంగిక చీకటిని తొలగించుకోను  ఙ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేసుకోవాలి.ఈసత్యాన్ని ఉపనిషత్తు ' తమసోమాజ్యోతిర్గమ య '  అనిచెప్తుంది.దానికై హృదయమనే ప్రమిదలో ప్రేమ అనేనూనెపోసి ,మనస్సు అనేవత్తిని , వైరాగ్యమనే నిప్పుతో వెలిగించుకోవాలి , ఆజ్ఞానజ్యోతికి రెండు సుగుణాలున్నాయి. చీకటిని దూరం చేయడం,ఊర్ధ్వగతీ చలనం కలిగి ఉండటం.  దానివెలుగు పైవైపుకే ఉంటుంది. కనుక దీపావళిరోజున ఆంతరంగిక తమస్సును తరిమేసే ఙ్ఞానజ్యోతులు వెలిగించుకుని మనలోని అసహనం, అశాంతి, ఈర్ష్య  అసూయ లను అహంకారం, కోపంవంటి చీకట్లను తరిమేసి ఙ్ఞానమనే వెలుగును నింపుకునే ప్రయత్నం చేద్దాం. 

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి