దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

బ్రిటన్  లోని నేషనల్ గేలరీ లోని కళాఖండాని దొంగిలించడానికి ఇద్దరు దొంగలు సన్నాహలు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి అందులోకి ప్రవేశించే ముందు ఓ హోటల్ బయట కారుని ఆపి భోజనానికి లోపలికి వెళ్ళారు. అయితే ఆ కారు నో పార్కింగ్ జోన్ లో ఆపడం చేత లండన్ పోలీసులు దాన్ని క్రేన్ తో ఎత్తి తీసుకెళ్ళారు. అందులొఓ ఉన్న అనుమానం కలిగించే వస్తువులు చూసి పోలీసులు కారు తలుపు తెరచి చూస్తే వెనుక సీట్లో పేపర్ బేగ్ లోంచి బయటకి వచ్చిన రెండు గ్రేనేడ్స్, తలుపులు పగలగొట్టే సామాగ్రి కనిపించాయి. నేషనల్ గేలరి లోపలి భాగం మేప్, వాళ్ళు దొంగిలించాలనుకున్న గది డూప్లికేట్ తాళం చెవి కూడా వాళ్ళ ప్రయత్నాన్ని చాటి చెప్పింది. తమ కారుని ఫీన్ కట్టి తీసుకువెళ్ళాలని వచ్చిన ఆ ఇద్దరు దొంగలని దొంగతనం చేయాలన్న ప్రయత్నం నేరం మీద అరెస్టు చేసారు పోలీసులు.

.................................................................................................................................

 

అమెరికాలోని కొలంబియా లో ఓ నేరస్థుడు చేతిలో కత్తితో ఓ దుకాణం లోకి దొంగతనం చేయడానికి ప్రవేశించాడు. కానీ అది తుపాకీలమ్మే దుకాణం. ఆ దుకాణం ఆ నేరస్థుడికి తుపాకీ గురిపెట్టి పోలీసులకి ఫోన్ చేసి రప్పించి అరెస్ట్ చేయించాడు.

 

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి