పోర్ట్ లేండ్ లోని ఓ సూపర్ బజార్ లోకి 39 ఏళ్ళ క్రెయిన్ హర్దర్ సన్ అనే దొంగ ప్రవేశించి, తుపాకీ తో బెదిరించి కాష్ బాక్స్ లోని సొమ్ముతో పరారయ్యాడు. అయితే పోలీసులు అతన్ని చిటికెలో అరెస్ట్ చేశారు.. సూపర్ బజార్ బయట అతని పెంపుడు కుక్క కట్టి వుంది. పెంపుడు కుక్కలని అనుమతించరు. కాబట్టి బయట వాటిని కట్టడానికి కస్టమర్స్ కి సౌకర్యాన్ని అమర్చిందా స్టోర్స్ ఆ పెంపుడు కుక్క మెడకున్న టేగ్ మీద ఈ కుక్క మాదే. దొరికితే నా నెంబర్ కి ఫోన్ చేయండి అన్న అక్షరాలు, దొంగ పేరు, ఫోన్ నెంబరు వున్నాయి.
.........................................................................................................................................
అమెరికాలోని ఓర్లింగ్టన్ లోని ఓ బేంకు లోకి ఓ దొంగ ఉదయం ఎనిమిదిం ముప్పావుకి చేతిలో పిస్తోలుతో పరిగెత్తుకెళ్ళాడు. సరిగ్గా అదే సమయం లో లోపలనుంచి పరిగెత్తుకొస్తున్న మరో వ్యక్తిని డీ కొట్టాడు. ఇద్దరూ కింద పడ్డారు. ఇద్దరి చేతుల్లోని పిస్తోళ్ళు జారిపోగానే బేంక్ స్టాఫ్ ఆ ఇద్దరినీ కదలకుండా పట్టుకుని పోలీసులకి ఫోన్ చేసారు. లోపల పిస్తోలు చూపించి దొంగతనం ముగించుకుని బయటకి పారిపోతున్న ఓ దొంగని దొంగతనం కోసం లోపలికి వెళ్తున్న ఇంకో దొంగ డీ కొట్టడం జరిగింది.