సింగపూర్ లా..! - బన్ను

Singapore Law

ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ లా మార్చేస్తానని చంద్రబాబు నాయుడు గారు, సింగపూర్ ని జిరాక్స్ తీసి తెలంగాణా ని మారుస్తానని KCR గారూ  చెబుతున్నారు. మన నాయకులు ముందుగా మార్చాల్సింది స్టేట్స్ ని కాదు... మనుషుల్ని! ఆ తర్వాత సదుపాయాలు సమకూర్చాలి.

సింగపూర్ లో ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. పెడిస్ట్రియన్ క్రాసింగ్ నుంచే రోడ్ దాటుతారు. మనవాళ్ళు రోడ్ కడ్డంగా పరిగెడుతుంటారు. దానిక్కారణం పెడిస్ట్రియన్ క్రాసింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు సమంగా లేకపోవటం కూడా! ప్రభుత్వం ఆ సదుపాయం కలిపిస్తే బహుశా మనుషులు మారొచ్చు. సింగపూర్ లో మనుషుల్ని చూసుకుని వాహనాలు వెళ్తుంటాయి. మన దగ్గర వాహనాలని చూసుకుని మనుషులెళ్ళాల్సి వస్తుంది.

మనం చెత్త రోడ్ మీద పారేస్తూ వుంటాం. దానిక్కారణం ప్రతీ ఫర్లాంగుకీ చెత్త కుండీలు లేకపోవటమే... అలా అలవాటైపోయింది. అవి ఏర్పాటు చేస్తే బహుశా మనం మారతామేమో... అప్పుడు సిటీ ఎంత నీట్ గా వుంటుందండీ?

రోడ్ ప్రక్క చెట్లకి పువ్వు పూస్తే చాలు... తెంపేస్తుంటారు మనవాళ్ళు. ఇది మన ఊరని గ్రహించి ఉంచితే గ్రీనరీతో అందంగా తయారవుతుంది ప్రదేశం.

'క్యూ' పాటించటం ప్రతిచోటా వుండాలి. దుమ్మీలు, గెంటేసుకోవడాలు మానుకోవాలి. ఆటోలు, టాక్సీలు ఎక్కడబడితే అక్కడ ఆగకుండా వాటిక్కూడా స్టాండ్లు బాగా కల్పించి, అవక్కడే ఆగేలా చేయాలి.

ముందు అవి చేసి తర్వాత రోడ్లు, భవంతుల మీద ధనాన్ని వెచ్చిస్తే ప్రతీ ఊరూ సింగపూర్ కన్నా బాగా తయారవుతుంది. సింగపూర్ వాళ్ళు మంచినీళ్ళ దగ్గర నుంచి అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు. మన కున్నన్ని వనరులు కూడా వాళ్ళకి లేవు. వాళ్ళకున్నదల్లా ఒక్కటే... 'పద్ధతి'!

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి