గుండె ఊటలు (నానీలు) - యస్. ఆర్. పృథ్వి

Gunde Ootalu(naaneelu)

కొత్త సంవత్సరం
వచ్చిన రోజే కొత్తది
గడుస్తున్న కొద్దీ
ఉత్తది

అకాల వర్షం
వచ్చిందోయ్
రైతు గుండెల్లో
కన్నీటి కాలువలోయ్

పెరిగే జనాభా
బలం అనుకుంటే ఎలా?
పేదరికానికి
పెద్ద పీట

పాద యాత్రలట
పల్లె బాటలట
భలే హంగులు
రంగు వెలిసాక చూడు...

జీవితంలో
నటిస్తున్నావా
చాలు చాలు
నటనలో జీవించు

ఆవేశం
నెత్తురులో మరిగితే
ఆలోచనలు
చిత్తంలో ఒదిగి పోతాయి

 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి