నవ్వుల జల్లు - జయదేవ్

ధూర్జటి : ఈ మేకకు తల వున్న చోట తోక, తోక యుండు చోట తల వున్నదేమి?
పెద్దన: బహుశా ఇది తెనాలి రామలింగడి మేక అయిఉండవచ్చు!!

శుభరాముడు: "ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు"  అని వేమన గారన్నారే?
అభిరాముడు: ఆయన రోజుల్లో రెండూ శుభ్రంగా వుండేవిలే!!

సోమన్న: కరిమకరులు భయంకరంగా యుద్ధం చేశాయని రాశారే పోతన గారు, ఎలా?
భీమన్న: దివ్య దృష్టితో  డిస్కవరీ ఛానెల్ చూసుంటారు!!

శ్రీమతి: "మది దున్నుకు బ్రతక వచ్చు మహిలో సుమతీ" అని శతక కారుడు రాశాడే?
భానుమతి: "మహిలో సుమతీ" బదులు "మదిలో సుమతీ" అని చదువు కోవాలి! ఈ రోజుల్లో అదే సాధ్యం!!

మొక్కన్న: నేనూ భాగవతానువదీకరణ చేసే వాడినే!
చిక్కన్న:  మరెందుకు చేయలేదు?
మొక్కన్న:  నాకు సంస్కృతం రాదు గనుక !!

సూరన్న: ముక్కుతిమ్మనార్యుడి పలుకులు ముద్దు ముద్దుగా వుంటాయి, ఎందుచేత?
మారన్న: "పారిజాతాపహరణం" లో సత్యభామ అనే ముద్దుగుమ్మను వర్ణించాడులే!!


వెంకప్ప: శ్రీ శ్రీ  అనే కవి ఆడా? మగా?
గంగప్ప : ఆయన గారు "మగా కవి"!
("మగా" అంటే తమిళంలో 'మహా ' అని అర్థం!!)

సోమిరెడ్డి: శ్రీనాథ కవి ఒక పద్యంలో "చిల్లర దేవుళ్ళు" అని రాసారట కదా! ఎవరు వాళ్ళు?
రామిరెడ్డి: ఈనాటి బస్ కండక్టర్లు!!

చంటి నాయుడు: బ్రహ్మరాత బ్రహ్మ మాత్రమే చదవగలడట కదా? ఒకవేళ మరొకడు చదవ గలిగితే?
బంటి నాయుడు: అంటే మనూళ్ళో డాక్టరు రాసే ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాపు వాడు చదివినట్టు. అదేనా నీ ప్రశ్న?

పనిశెట్టి: మీ ఆవిడ భాగవతం వినిపించిందా? గారెలు తినిపించిందా?
గినిశెట్టి: గారెలకి బదులు నాలుగు తన్నులు తినిపించింది.
మనిశెట్టి: ఎందుచేత?
గినిశెట్టి: మధ్యలో నిద్రపోయా!!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు