నాస్తికత్వం ప్రబలిపోయి నారాయణుని మరచిపోయే ఈ ఆధునిక, సాంకేతిక ఙ్ఞానాభివృధ్ధి చేందిన కాలంలొ దేవుడు ఉన్నాడా? అనే ప్రశ్న సహజంగా స్పురించడని జరుగుతుంది. అలాంటిసందర్భాలలో దైవత్వాన్ని నిరూపిస్తూ ' నేను భగవంతుడ్ని!' అనిచెప్పే ఒక మహానుభావుడు శ్రీసత్యసాయిబాబాగారు మనకు స్పురణకు వస్తారు.పుట్టపర్తి అనే కుగ్రామంలో పుట్టి 160 దేశాలకుపైగా శ్రీ సత్యసాయి బాబాగారు ఒక మహోన్నతమూర్తిగా భావింపబడటం వారి దివ్యత్వానికి ఒకనిదర్శనం. అంతేకాదు సుప్రసిధ్ధ సైన్ టిస్టులు , డాక్టర్లు సెయింట్లు , మానవతావాదులు, మహాత్ములు ,వేదపండితులు, విద్యావేత్తలు సైతం స్వామివారిమీద భక్తినుంచుతున్నారంటే ఏమీటీవింత ? సాయిబాబా గారిని దేవునిగా నమ్మినా నమ్మకపోయినా సాయిబోధలు, సాయిసూచనలు ,సాయిప్రబోధించు మానవతావిలువలు [ సత్య ధర్మశాంతిప్రేమ అహింసలు ] మానవాళికి ఎంతో ఉపయోగ కరమైనవి.వారు స్థాపించిన ఉచిత విద్యాసంస్థలు ఉచిత వైద్య సంస్థలు నీటి సౌకర్యాలు సేవాసంస్థలు చూస్తుంటే ఒక పల్లెటూరి వ్యక్తి, నీసం ఒక్క డిగ్రీ ఐనా పొందని వాడు, ధనములేని మనిషి , ఒక సన్యాసి ,ఇన్నిమహోన్నత మైన కార్యక్రమాలు ఏవిధంగాచేయగలుగుతున్నాడు? అనేప్రశ్న ఉద్భవిస్తే , బాబాచెప్పేసమాధానం ఒక్కటే ' ప్రేమ ' ,- ప్రేమయే నాస్వభావము, శాంతియే నా స్వరూపము,. ధర్మమే నాఆచారము , సత్యమే నా ప్రచారము' అంటారు.ఈ మానవతావిలువలను పోషించగలిగిన నాడు ప్రతివ్యక్తీ భగవంతుడుకాగలడు. అంటారు బాబాగారు.' మీరు దేవుడా ?' అంటే , 'నేను దేవుడ్ని నీవుకూడా దేవుడివే ' - 'my powers are patent , your powers are latent '. అంటూ' దివ్యాత్మ స్వరూపులారా ! పరమాత్మ స్వరూపులారా!' అని సంభోధిస్తూ సభలలో అనర్గళంగా ఉపన్య సిస్తారు.ప్రతి వ్యక్తిలోనూ నిద్రాణమై ఉన్న దివ్య చైతన్యాన్ని రగుల్కొలిపే ' జగద్గురువు శ్రీసత్యసాయిబాబా. " జీవో బ్రహ్మైవ న పరః ' అని సూచించే అద్వైత తత్వాన్ని ఆచరించారు,ప్రచారం చేశారు.సర్వమత సమ్మతమే సత్య సాయిమతము అంటూ -
మతములన్ని చేరి మంచినే బోధించు
తెలిసి మెలగవలయు తెలివితోడ
మతులు మంచివైన మతమేది చెడ్డది?
వినుడుభారతీయ వీరసుతుడ "
-- అని ప్రభోధిస్తూ సర్వమత సమైక్య స్థూపాన్ని పుట్టపర్తిలో ప్రతిస్థాపన చేశారు.
బాబాగారు నవంబరు 23- 1926 సం. లో జన్మించిన దినాన్ని పురస్కరించుకుని రానున్న 23.11-2014 న దేశ విదేశభక్తులందరూ తమతమ ప్రదేశాలలో పుట్టుపడుగ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జేజేలుపలుకుతున్నారు .భగవాన్ శ్రీసత్యసాయిబాబాగరు మహామహిమాన్వితుడు మాత్రమే కాదు సద్వక్త కూడా.అందరికీ అనగా పండిత పామరులకూఅర్ధమయ్యేరీతిలో సులభంగా విశదపరచడంలో ఒకగొప్పదిట్ట. ఉపన్యాసాలు దాదాపు ఐదువేలకుపైగా చెప్పినారు .ఎంతో అర్ధవంతంగా మధ్యమధ్య చిన్న పద్యాలు ,ఆశువుగాచెప్తూ హాస్యాన్ని మిళితంచేస్తూ అనర్గళాంగా సంభాషించేవారు. వారి దివ్యసూక్తులను తలచుకుందాం.
1.ఉన్నది ఒకటే భాష అదే హృదయభాష. - ఉన్నది ఒకటేకులమూ సర్వవ్యాపి. అదేమానవ కులము.-ఉన్నది ఒకటేమతము అదేప్రేమ మతము.ఉన్నది ఒకటే దైవము.అతడు సర్వవ్యాపి.
2. అందరినీప్రేమించు -అందరినీ సేవించు.
3.జీవితము ఒక్కసవాలు-ఎదుర్కో.--
జీవితము ఒక్కక్రీడ--ఆడు.
జీవితము ఒకప్రేమ - పంచుకో.
జీవితము ఒకకల -గ్రహించు.
4. ప్రార్ధనచేసే పెదవులకన్నా సేవలుచేసే చేతులు అతిపవిత్రమైనవి.
5.జనసేవ కనార్ధనసేవ - పరులసేవ పరమాత్మునిసేవ,నరులసేవ నారాయణ సేవ -మానవసేవే మాధవసేవ.
6.సాధన ఎలాఉండాలీ అంటే - హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ -హెడ్ ఇన్ ద ఫారెస్ట్ --నీలో ప్రపంచముండాలి కానీ ప్రపంచంలో నీవు ఉండకూడదు.అనగా సమస్యలతోరణంలో సతమత మైపోతున్నవారికి ఒకచక్కని సలహా.సమస్యను ఎదుర్కొనవలసి వచ్చినపుడు ధైర్యంగా ఉండు.ఐతే అన్నీ బుర్రకుపట్టించుకుని దిగులుపడుతూ నిరాశానిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకోడం బాబా ఏనాడూ హర్షించరు.
7.కోపము పాపమునకు ధూపము.
8.దయగలహృదయమే దైవ మందిరము.
9.నాలుకపై భగవన్నామము- చేతులతో దీనజనసేవ
10.పనియే పరమాత్ముని పూజ. స్వామివారుస్వామివారు చేపట్టిన సేవాకార్యక్రమాలు -బాబావారు కేవలం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వటం మాత్రమేకాదు ఆచరణలోకూడా పెట్టిచూపారు.చిన్నప్పుడే స్కౌట్ క్యాంప్ లోపాల్గొని సేవచేసేవారు . నాలుగు మైళ్ళనుండీ కావడిలో నీళ్ళుతీసుకుని తనకుటుంబానికీ తదితర శక్తిహీనులకు త్రాగు నీటినితెచ్చి ఇస్తూ ఉండేవారు.అదేమిటని తల్లి అడిగితే "నేనున్నది ఆత సేవ కోసమే!"అనేవారుట."మనస్సులోని యోచన మాటలోని సూచన క్రియలోనిఆచరణ ఏకంచేయటమే బాబావ్యక్తిత్వానికి నిదర్శనం . పెద్ద వారైన తర్వాత అనేక విద్యాసంస్థలు స్థాపించి ఉచితంగా బోధన చేసేవిధంగా ఆదేశించారు.అలా అనంతపురంలో స్త్రీల కళాశాల , ప్రశాంతి నిలయంలో[పుట్టపర్తి] పాఠశాల నిర్మించారు.ముస్లింలకు పుట్టపర్తిలో ఒకమసీదు కట్టించారు.ప్రశాంతినిలయంలోనూ బెంగుళూరులోనూ ఉచిత ఉన్నత వైద్యసాలలు[ సూపర్ స్పెషాలిటీ హాస్పెటల్స్ ] కట్రు,టించారు.అంతేకాకుండ నీటివసతి సౌకర్యాలను అనంతపురంలో దాదాపు 800గ్రామాలకు ఏర్పరచా నేటికి కూడా అలాంటికార్యక్రమాలు నిర్విఘ్నంగా సత్యసాయి సంస్థలవారిచే కొనసాగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా అన్నిరాష్ట్రాలలోనూ ,పట్టణాలలోనూ, పల్లెలలోనూఅ సాయిభక్తులంతా కలిసి సేవలు చెస్తూనే ఉన్నారు.దీనజనోధ్ధరణపధకాలు ,గ్రామీణాభివృధ్ధికార్యక్రమాలలాంటివి సాయిబాబా జీవించి ఉన్నపుడు శరీరంచాలించినతర్వాతకూడా ఇలాంటిసేవలు జరూగు తూనే ఉన్నాయి. సత్య , ధర్మ ,శాంతి,ప్రేమ ,అహింస అనే మానవతావిలువలను పెంపొందించుకోమని చిన్నపిల్లలకు బాలవికాస్ అనే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టారు.అవి ఇప్పటికీ పల్లేలనుండి పట్టణాలవరకూ సత్యసాయి సేవాసంస్థలు నిర్వహిస్తూనే ఉన్నాయి. స్వామి తనలో ఉన్న దివ్యత్వానికి నిదర్శనంగా వేలకువేలు లీలౌ, మహిమలు నేటికినీ చూపిస్తూనే ఉన్నారు . దేశవిదేశాలవారుకూడా తమ ప్రేమనే ఆయుధంగా స్వీకరించి 'ప్రేమద్వారా ' ఇతర అవతారమూర్తులవలె సం హరించడంకాకుండా మానవాళిని సంస్కరించడం ప్రధానలక్ష్యంగా ఎంచుకుని వేద పరిరక్షణ ద్వారా భారతీయ సంస్కృతిని పోషిస్తూ ప్రబోధిస్తున్న మహోన్నత వ్యక్తిని అందజేసిన భారతదేశమునకు మానవాళి ఎంతో రుణపడి ఉంది.
జై సాయిరాం.