నాట్య భారతీయం - కోసూరి ఉమాభారతి

 

“… ‘కన్య’ లో విషయం ఉంది.... వదిలి పెట్టవద్దు”.. -  C.N.R

పూజ్యులు డాక్టర్ శ్రీ సి. నారాయణ రెడ్డి గారితో దశాబ్దాలగా కళాత్మక అనుబంధం...

నా రచనలకి సైతం స్పూర్తినిచ్చిన ఆయన మాట-పాట, వచనం-కవిత్వం .......

కన్య’ అనే నృత్య నాటికని రచించి,  హ్యూస్టన్ లోని‘శ్రీ మీనాక్షి టెంపుల్’ నిధుల సేకరణకి  ప్రదర్శనలిచ్చాము.

2002 లో,  అదే కాన్సెప్ట్ ని హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో, వంశీ ఇంటర్నేషల్వారి ఆధ్వర్యంలో ప్రదర్శించాము.  గౌరవనీయులు, సి. నారాయణ రెడ్డిగారు ముఖ్య అతిధిగా వచ్చారు.వక్తగా  తెలుగులో  ఆ  కార్యక్రమాన్ని సమర్పించింది నేనైతే,  మొత్తంగా నృత్యం చేసింది మా అమ్మాయి శిల్ప కోసూరి... హైదరబాదులోని  మరికొందరు  యువత పాల్గొన్నారు...

ప్రదర్శన  సమయానికి,  ఉధృతంగా ఉన్న వాతావరణం.   నేను అనుకున్నంత బ్రహ్మాండంగా జరగేలా లేదు అని కార్యక్రమం మొదట్లో  కొద్ది నిరాశ కలిగిన మాట వాస్తవం.

యధావిధిగా ప్రోగ్రాం జరిగింది...

అయితే, నారాయణరెడ్డి గారు మాట్లాడుతూ, “మంచి ఆలోచన  ఉన్న కాన్సెప్ట్ ‘కన్య’.  తెలుగు కన్య అనో, భారతీయ కన్య అనో, మన సాంప్రదాయ  ‘కన్య’  అనో,  పరిమితి  పెట్టకుండా, ప్రపంచంలోని ఏ సంస్కృతికైనా ఆపాదించ గల సమర్ధత ఉన్న సబ్జెక్ట్ ఇది.‘యూనివర్సల్ కాన్సెప్ట్’ గా ముందుకు తీసుకువెళ్ళగల  విశేషం ఉందమ్మా నీ ‘కన్య’కాన్సెప్ట్ లో,” అన్నారు...

ఆయన మాటలు నాకు ఎంతో సంతోషానిచ్చాయి.  కోటి ప్రశంశల  సమానమయ్యాయి...గర్వంగా ఫీల్ అయ్యాను.

ఆయన చేతుల మీదగా నేను ఎన్నో అవార్డులు అందుకున్నాను.  నేను నృత్యం చేసిన ఎన్నో  వేదికల మీద ఆయన ముఖ్య అతిధిగా ప్రశంగించారు.  నా మొదటి ప్రోగ్రాం నుండి,  నా మొట్టమొదటి విదేశ పర్యటన ప్రోగ్రాం వరకు,  లెక్క లేనన్ని ప్రశంశలు, జ్ఞాపికలు ఆయన ఆశీర్వాదంగా అందుకున్నాను. 

రచనలు చేసే దిశగా కూడా నన్ను ప్రభావితం చేసిన వారిలో ప్రముఖులు వారు.  నా నృత్య ప్రదర్శనల సందర్భంగా,  నాగురించి, నా నాట్యం గురించే కాక ఆయన ప్రసంగానికి ఎంచుకునే పదాలు నా కెంతో నచ్చేవి. గ్రీన్ రూం నుండిపెరిగెత్తుకొని వెళ్లి, ఆయన ప్రసంగం వినేదాన్ని. అలా ప్రత్యక్షంగా,పరోక్షంగా కుడా అయన మాటలు, పాటలు, వాక్యాలు, వ్యాఖ్యానాలు నాకెంతో స్పూర్తినిచ్చాయి.

1994 లో నేను హ్యూస్టన్- టెక్సాస్ లో స్థాపించిన ‘అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ’–తరఫున  ‘ఆలయ నాదాలు’ అనే టెలిఫిలిం నిర్మించాము.   నృత్యం, సంస్కృతీ ఇతివృత్తంగా  తయారయిన ఆ చిత్రం యొక్క నిర్వహణ, కొరియాగ్రాఫీ, యు.యెస్.ఎ  దర్శకత్వ  బాధ్యతలు నేనే చేపట్టాను...

అయితే, ఆ ఫిలిం కి టైటిల్ సాంగ్ రాయమని  నారాయణ రెడ్డి గారినే కోరాము... ఓ అద్భుతమైన పాట రచించిచ్చారు ఆయన...

ఆ పాటకి - నేను నా స్టూడెంట్స్ నృత్యం చేయగా శీశైలం లో  చిత్రీకరించాము..........

మబ్బుల ఆలాపనలో మయూరాల భంగిమలు..

తరుణ పవన లాలనలో తరచాపల తరులిమలూ ...

పరికించే కనులుంటేలి, ప్రతి నిత్యం లయ నిలయం...

ఈ జగమే నాట్యమయం,  నటరాజ పాద నీరాజిత నవరసాభినయం......

నాకు స్పూర్తినిచ్చిన  ఆ  మహా  వ్యక్తి,  డా. సి. నారాయణరెడ్డి గారికి అభివందనాలు...

కన్య’ ....(A THEME DANCE CONCERT – CONCEPT& synopsis)

యుగయుగాలుగా స్త్రీని మాతృదేవతగా పూజించుకుంటాము.   ఆమెని ప్రేమ స్వరూపిణి, దివ్య స్వరూపిణి అని ఆరాధిస్తాము. ఆమె అందచందాలని,  పురివిప్పిన నెమలి సోయగాలతో పోల్చడం  పరిపాటే.  ఆమె ప్రకృతికి మరో రూపమనీ అంటాము.  అంటే అందచందాలకి,  ప్రేమకి, భక్తికీ, ముక్తికీ, రక్తికీ అన్నిటికీ స్త్రీనే చెప్పుకుంటాము.  Why is a woman so special? What is the essence of her being?   ఈ ప్రశ్నలకి సమాధానాలు,  ఆసక్తికరమైన ఈ క్రింది కథానికగా  సృజించి,  ‘కన్య ‘ నృత్యనాటికగా రూపొందించడమైంది.

కన్య’ కథాంశం:

అనంతసృష్టికి  కర్త ఐన ఆ బ్రహ్మదేవుడు,  సమస్థకోటి జీవరాసులకి ప్రాణం పోసే ప్రక్రియలో భాగంగా,ముందుగా పురుషుణ్ణి సృష్టించాడట.  తరువాత ‘స్త్రీ‘ ని అంటే ‘కన్య’ ని సృష్టించి, మలచడానికి సంశయించాడట.  పురుషునికిలా భుజబలం, బుద్ధుబలం వంటివి మాత్రమే చాలదు.  భూమిపై మానవుని ఉనికి సవ్యంగా సాగాలంటే – ఓర్పు, సహనం, త్యాగం, లాంటి గుణగణాలు  స్త్రీ లో స్వతహాగానే ఉండడం అవసరం కావున, స్త్రీని  సృష్టించడం కాస్త క్లిష్టమైన పనేనని ఆలోచించి, మహాశివుని, విష్ణుమూర్తిని సంప్రదించాడట..

విషయం తెలిసిన, దేవాదులు, మునీశ్వరులు చివరికి స్వర్గం లోని అప్సరలు కూడా ‘కన్య’ ని సృష్టించే బృహత్తర కార్యక్రమమానికి తమ వంతు సాయం అందించడానికి ఉత్సాహపడ్డారుట.

అయితే,  సృష్టించబడనున్న ‘ఆది కన్య’ కి, మూలదేవతలైన లక్ష్మీ, పార్వతీ, సరస్వతీలదీవెనలతో పాటు ప్రకృతి తల్లి ఆశీస్సులు కూడా  అవసరమని  బ్రహ్మదేవునికి తెలిపారట, మహామహులు. 

ఆ దీవెనల కోసం అప్సరలు నర్తించి దేవతలనిమెప్పించారట.

అలా దేవతల నుండి శక్తిసామర్ధ్యాలని, మనోస్థైర్యాన్ని, విజ్ఞానాన్ని-అప్సరల నుండి అందచందాలని – ప్రకృతి నుండి ఓర్పు సహనాలని, దీవెనలగా పొందగలిగింది బ్రహ్మదేవుని  ‘ఆది కన్య’. కాబట్టి, పుడమిన పుట్టిన ప్రతి కన్య లోనూ తన ఖర్మానుసారంగా అటువంటి గుణగణాలు ఉండాలి, ఉంటాయి అన్నది కథాంశం.ప్రకృతి  ‘ఆదికన్య’ కి అందించిన దీవెనలు-‘Kanya’ as blessed by ‘Nature’(a poem from ‘Kanya’)….

The nature gave ‘Kanya’ the endurance.

The spring gave her the rosy skin,  color of her cheek and lip,

The dawn and dusk filled her eyes with sparkle set in deep tones of misty dark,

The breeze touched her with soft kindness that left her looking like an angel,

The glow of the sun gave her the bewitching smile,

The barren valleys gave her the look of innocence,

The cool of the moon blessed her, so her heart would melt with compassion and love for her kith and kin,

So on and so forth everything in nature made her everything that she is –

‘A perfect vision of beauty’…

కన్య’ - నృత్య నాటికకి వచ్చిన స్పందన, ఆదరణలు మాకు నూతనోత్సాహాన్నిచ్చాయి.

‘మానస పుత్రి’ - అనే మరో నృత్యనాటికను సృజించి ప్రదర్శనలు ఇవ్వడం, రెట్టింపు ఆదరణ పొందదగలగడం కూడా అదృష్టమే.  తమ భవిష్యత్తుకు బంగారు బాటలు  వేసే  ఉన్నత విద్యల  కోసం ఇంటిని, కన్నవారిని   విడిచి వెళ్ళే ఎందరో యువతీ యువకులకి నీరాజనాలు పడుతూ దీవేనలందించే దిశగా సాగే ఈ కథాంశం, నేటి తరం విధ్యార్దినిలకు అంకితం చేయడమైంది.

‘మానసపుత్రి’ నుండి పోయమ్స్:

పసిడితల్లి .....

ఆ నునులేత చెక్కిళ్ళకు

అమ్మముద్దుల తళుకులు తప్ప

తాక లేదు కన్నీటి వెచ్చదనం

 

తప్పటడుగుల వైనాలు దాటి

అంబరమంటే సంబరాల

మయురాల భంగిమల

అప్సరలా నాట్యమాడె నేడు

 

నాటి బోసినోటి కేరింతలు

నేడు చిలిపి నవ్వుల సంగీతాలు

ఉప్పెనలా ఆగని ఆమె పలుకులు

సేదతీర్చె అలిసిన మనసులను

 

చిట్టి పావడకట్టి

చిరు మువ్వలెట్టి

నడయాడినట్టి చిట్టిది

నేడు జలతారు వోణీల

అందాల యువరాణి

 

నీలి కన్నుల మెరుపులు

చిరునవ్వుజోడై   

అద్దాల చెక్కిళ్ళపై     

చిందులాడెనేడు

 

వెతలెరుగని కనుదోయి

తమ్మి రేకుల పోలి

సొగసు చూపులు చిందించె నేడు

  

తరలి పోయె ఆ పసితనం

పొంగై వచ్చె యవ్వనం

పరుగులెట్టేనిక ఆ సోయగం 

 

ఎగిసిపోయె ఆమె ఆశలు

గగనమంటె ఆమె తలపులు

పొరలిపోయె ఆమె కలలు

 

సహకరించి చేయూతనిచ్చి

సంతసించి సంతోషాన్ని పంచి

ఆమెని ఎదగనిచ్చి

హాయిగా వొదగనిద్దాం! 

 

అంటూ ఆ తల్లి శారదాంబ, మానసపై కోటిదీవెనల జల్లు కురిపించింది.  పుడమితల్లికి, ప్రకృతికి, సప్తసముద్రాలకి తన పుత్రిక మానస పర్యటన గురించి తెలియజెప్పింది. తన బిడ్డని కరుణతో చూడమని, అలిసి సోలిసి నపుడు సేద తీర్చమని వారిని వేడుకొంది.  మానస 

నాట్యాలు, నయగారాలు కూడా పరవశంతో తిలకించమని కోరుకొంది.

చిలుక కులుకులకొలికి

(తనయ భూలోకపయనమయిన సమయాన,ప్రకృతికి, సరస్వతీదేవివిన్నపాలు)  

అద్దాల చెక్కిళ్ళ , వయ్యారి నడకల 

లేలేత మునివేళ్ళ సుతి మెత్తని తాకిడిల

ముత్యాలు చిందునట్టిచిరుసిరి నగవుల 

కుశల మడుగుతున్నట్టి కలువ కన్నుల

దేవతలానినుతాకిదయ చూపుతున్నటుల

ఆడిందిపాడిందిచిన్నారిసిరిమల్లి

 

మైమరచి పరుగులెత్తి తచ్చట్లాడకుమా!

అల్లంత దూరాన ఆగి తిలకించుమా!

సొగసు కని  క్షణమైనా ఈర్ష్య పడ బోకుమా!

పసిడి తల్లి అది ప్రేమతో చూడుమా!

 

నింగీ, నేలా, వెండి మబ్బులారా!

నీటి కెరటాల దాగున్న చిరు చేపలారా!

అతి మృదువుగ లాలించి, దయతో దీవించి

నవ్వించి, సేద తీర్చి, స్నేహంగా మీరంతా

ఆ చిన్నారి దారులలో వెలుగులే నింపుమా!

 

ఎంతో హృద్యంగా వేడుకొంది ఆ దేవత.  ఆమెకి తప్పక చేయూత నిస్తామని వారంతా సద్భావనతో సరస్వతీ దేవికి వాగ్దానం కుడా చేసారు.**‘భరతముని భూలోక పర్యటన’ ‘అమెరికాలో అనసూయ’  ‘ఈ జగమే నాట్యమయం’ ‘పెళ్ళి ముచ్చట’ ‘రాగం-తానం-పల్లవి’ ‘గురు-వే-నమః’ ‘దేవిస్తోత్ర మాలిక’ ‘సంభవామి యుగే యుగే’ ‘డ్రీం గర్ల్’ వంటి మరెన్నో నృత్య నాటికలు ‘తానా’ ‘ఆటా’ సభల్లోనూ ప్రదర్శించి ‘ఉత్తమ నృత్య ప్త్రదర్శన’ అవార్డులు, వేలాది ప్రేక్షకుల మన్ననలు పొందాము.

ఇటువంటి రచనలకి, కార్యక్రమాలకి నాకు గొప్ప స్పూర్తినిచ్చింది మా అమ్మాయి – శిల్ప....

తన సొంత ఆసక్తితో నేర్చుకొని, అందంగా నాట్యం చేస్తుంది... శిల్ప నృత్యం  - నా  కళాజీవన ప్రస్థానానికి కొంతకాలంగా ఓ ముఖ్య ప్రేరణ అయిందంటే అతిశయోక్తి కాదు......

*********

మరిన్ని వ్యాసాలు