పెద్దవాళ్ళలాగా పిల్లలు కూర్చుని కుదురుగా భోంచేయరు...ఏ రెండు పూటలా ఒకే తీరుగా తినడానికి అస్సలు ఇష్టపడరు....వాళ్ళకి తినిపించడం తల్లులకు పూటకో యజ్ఞమే....భోజనం కన్నా చిరుతిళ్ళంటే ఏ పిల్లలకైనా ఇష్టమే. అయితే, బజార్లో దొరికేదేదో తెచ్చి వాళ్ళకి తినిపిస్తే కడుపు నిండడం మాట అటుంచి లేనిపోని అనారోగ్యాల బారిన పడతారు వాళ్ళు. రుచికరంగా ఉంటూనే పౌష్టికతను అందించే చిరుతిళ్ళు ఏం పెడితే బావుంటుందో వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. డా. శ్రీ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు.....