
రాజులు పోయారు
రాజ్యాలూ పోయాయి
వర్ణాలు, వర్గాలై
రాజ్యాలేలుతున్నాయి
కాలం వానైతే
అందరికీ పులకరింపు
వరదై పొంగిందా
నిందల కంపు
భయానికి హేతువు
ఎక్కడో లేదు
మనసు మూలల్లోనే
దానికి పాదు
పువ్వు బతుకు
దినమే కావచ్చు
పరిమళ స్మృతి మాత్రం
చిరకాలం
జెండాలు
రోడ్డున పడ్డాయి
ఎక్కడో ఏదో
తీగ తెగినట్టుంది
కళ్ళు చూపులతో దాడి
కాలం చెట్టు కింద
కన్నెతనం బలి
సాక్ష్యం, కాలం కళ్ళు.