
ప్రపంచంలో నీళ్ళు లేకపోతే మనుష్యులు, జంతువులు, చెట్లు ఏమీ ఉండవు. ప్రతీ ప్రాణికి నీళ్ళు కావాలి. అన్నీ తెలిసీ .... మనం మంచి నీరు త్రాగటానికి బద్దకిస్తున్నాము. తగినన్ని నీళ్ళు తాగితేనే మనిషి ఆరోగ్యంగా జీవించగలడు.
ఈ మధ్యనే నేనోటి విన్నాను. రాత్రుళ్ళు మనం పడుకునే పక్కన మంచినీళ్ళు పెట్టుకుని పడుకుంటే "వైద్యుడిని పక్కన పెట్టుకుని పడుకున్నట్టే " అని !!
నీరు త్రాగకుండా మనిషి 3 రోజులే బ్రతకగలడట! రోజుకి 3 లీటర్ల లిక్విడ్స్ తీసుకోవటం అవసరం అని వైద్య శాస్త్రం చెబుతోంది.
ఈ మధ్య ఓ ప్రముఖ వ్యక్తి తెల్లవారు ఝామున మంచి నీళ్ళకోసం కిచెన్ లోకి వెళుతూ ఈ లోపు హార్ట్ ఎటాక్ గురై చనిపోయారు. అదే బెడ్ రూమ్ లో నీళ్ళు వుంటే బ్రతికి ఉండేవారని డాక్టర్లు అన్నారట !!