నవ్వుల జల్లు - జయదేవ్

వాడు:  పేకాట క్లబ్బుకు వేమన వేషంలో వెళ్తున్నావే?
వీడు :  నా మీద దయతలచి బట్టలు కొనిస్తారు. డబ్బులు కూడా ఇచ్చి పేకాటలో చేర్చుకుంటారు.
వాడు: బాగుంది ప్లాను. పేకాడి డబ్బులు గెలిచి దర్జాగా బయటికొస్తావన్నమాట?
వీడు: దర్జాగా రాను. అన్నీ పోగొట్టుకొని, వేమన గెటప్ లో బయటికొచ్చేస్తాను.

శొంఠి రెడ్డి: నీ పెళ్ళాం కనిపించలేదా? పోలీసు కంప్లైంట్ ఇచ్చావా?
అల్లం రెడ్డి: ఇచ్చాననుకో... ఆమె తిరిగొచ్చి, ఇంటి వ్యవహారం పోలీసు స్టేషన్ దాకా పోనిచ్చావా? అని నన్ను ఉతికి పాతరేస్తుంది. అందుకని ఇవ్వలేదు.

పెళ్ళికూతురు:  ఈ శోభనం జరగడానికి, మా నాన్నకి ఎంత ఖర్చయ్యిందో తెలుసాండి ?
పెళ్లికొడుకు:  మామూలే కదా, ప్రతి పెళ్ళికూతురు తండ్రి భరించాల్సిన ఖర్చులే కదా?
పెళ్ళికూతురు: అవిగాక, నా లవర్ నుండి నన్ను వేరు చేయడానికి, నా అబార్షన్ కీ ఎంత ఖర్చయ్యిందో తెల్సా?

పెళ్ళాం ఫ్రెండ్: మీ ఆయన ఇంచక్కా అరుగు మీద కూర్చుని పేపరును ఎంత శ్రద్ధగా చదువుతారో?
పెళ్ళాం: ఆయన పేపరు చదువుతారనుకున్నావా? మొహానికి అడ్డం పెట్టుకుని వొచ్చే పోయే ఆడంగులకి సైట్ కొడుతుంటారు!

యమకింకరుడు - 104: పాత బస్తీలోంచి రెండు జీవాల్ని మాత్రం పట్రమ్మంటే, మరో నలుగుర్ని కూడా లాక్కోచ్చావేం?
యమకింకరుడు - 107: ఇవాళ పాతబస్తీలో బంద్! అంబులెన్సులను షెడ్స్ లోంచి బయటికి తియ్యలేదు!!

మెరుపుతీగ:  సినిమా షూటింగుల్లో 24 గంటలూ బిజీ అయ్యావు! పాపం, ఇంట్లో నీ మొగుడ్ని చూసుకొనే వాళ్ళెవరూ?
నెరజాణ:  ఆయన కూడా బిజీ ఐపోయారు, మేకప్ కిట్ పట్టుకొని నా వెంట తిరుగుతారు!


జలజ: పెళ్ళయ్యాక నువ్వు నీ మొగుడితో అమెరికా వెళ్ళిపోతావా?
నీరజ: వెళ్ళను. ఇక్కడే నా లవర్ తో వుండిపోతాను(రహస్యంగా చెవిలో చెబుతుంది)

మంత్రి :  ధనాగారం నిండుకొంది. చిల్లిగవ్వ లేదు ప్రభూ !
రాజు: అయితే వెంటనే సొరంగ ద్వారాలు తెరిపించు. 
మంత్రి :  అక్కడ నిధులు దాచారా ప్రభూ?
రాజు: లేదు మనం వెంటనే పారిపోవాలి!!

బ్రహ్మ రాక్షసి -1:  కోడి మాంసం, మేక మాంసం కన్నా నర మాంసం భలే రుచిగా ఉండడానికి ఏం కారణం అన్నా?
బ్రహ్మ రాక్షసి -2: కోళ్ళు, మేకలు తిని నరులు బాగా బలుస్తారు గనక తమ్ముడూ!!

పార్టీ ఫాలోయర్  - A : మీ నాయకుడి వెంట పాదయాత్ర చేసి రాష్ట్రమంతా తిరిగావ్! ఏం  తెల్సుకున్నావ్?
పార్టీ ఫాలోయర్  - B : రోడ్లమ్మట ఎన్ని సారా దుకాణాలున్నాయో పర్ ఫెక్టుగా తెల్సుకున్నాం 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు