నాట్యభారతీయం - కోసూరి ఉమాభారతి



తీరం దాటిన సంస్కృతీ – సాంప్రదాయాలు....

లలితకళల ప్రాముఖ్యతకి, వాటి ఉపయోగాలకి  అద్దంపట్టే  వినూత్న ప్రయత్నమే 

‘ఆలయ నాదాలు’ టెలి-ఫిలిం....

... సంస్కృతీ - సాంప్రదాయాలు  తమ  యువత  జీవనవిధానంలో  ప్రతిబింబించాలనే....

*****

సాధారణంగా, సాంప్రదాయమనేది రోజూ వారిగా జరిగే ప్రతి ప్రక్రియ లో ఉంటుంది.
సంస్కృతి అనేది, జీవన శైలి - అలవాట్లల్లో ప్రతిబింబిస్తుంది. సూర్యనమస్కారాల నుండి - భోజన తాంబులాల వరకు, దీపారాధన నుండి - పంక్తి భోజనాల వరకు, అన్నిటా ఎన్నో సాంప్రదాయాలు.        

స్వదేశంలోనే ఉంటే, నిత్యం జరిగే పండుగలు – ఉత్సవాలు – వివాహాలు - షష్టి పూర్తి సంబరాలు  లాంటి ఎన్నో వేడుకల గురించి వివరించి చెప్పే అమ్మమ్మ, నానమ్మలే, పిల్లలకు విలువైన గురువులు.  అందుబాటులో ఎంతో సమాచారం, వివరణ, సంభందిత సాహిత్యం, సందేహ సమాధాన సమన్వయాలు ఉంటాయి.  సంస్కృతి -సాంప్రదాయాల గురించి యువతకి తెలియజేయడానికి,  ప్రత్యేకమైన ప్రయత్నమేమీ చేయనవసరం లేని సహజమైన వాతావరణం అది.

మరైతే,  ఆ  సంస్కృతీ - సాంప్రదాయాలు  తమ  యువత  జీవనవిధానంలో  కూడా  ప్రతిబింబించాలన్న ప్రయత్నంగా, తెలుగు సంఘాలని, వేదికలని స్థాపించుకుంటారు  ప్రవాసాంధ్రులు. కాక, తెలుగు బడి - హెరిటేజ్ క్లాసులు –నిర్వహిస్తారు.  విజ్ఞాన – ఆధ్యాత్మక – సాంస్కృతిక - సాహిత్య  కార్యక్రమాలని చేబడతారు.

పోతే,  లలితకళలనేవి  భారతీయ  సంస్కృతిలోని  ముఖ్యమైన అంశాలే కాబట్టి,  ఆ కళల పట్ల ప్రవాసులకి మక్కువ ఎక్కువే కాబట్టి,  అంతే ఆసక్తి తమ సంతతికి కూడా కలగి, కొనసాగాలని ఆశిస్తారు.

కళల  అభ్యాసన  నుండి,  ఏకాగ్రత -  క్రమశిక్షణలు  పెంపొందుతాయని  భావించే తల్లి తండ్రులు కూడా ఎందరో. అందుకే,  వ్యయ ప్రయాసాలకోర్చి పేరున్న గురువుల వద్ద  పిల్లలికి శిక్షణ ఇప్పిస్తారు.

సంగీతమన్నా, నృత్యమన్నా హుషారుగానే పిల్లలు అభ్యసిస్తారు కూడా.  ప్రవాస  యువతకు  శాస్త్రీయ సంగీత, నృత్యా ల్లో శిక్షణ ఓ మంచి వ్యాపకమే అవుతుంది.  కళనే  వృత్తిగా  చేపట్టే వారు ఇక్కడ  యువతలో అరుదే కావచ్చు.  ఇష్టమయి శ్రద్దగా శిక్షణ  పొందేవారు  మాత్రం  మెండుగా ఉన్నారు.

'అర్చన డాన్సు అకాడెమి’ నుండి మేము నిర్వహించే నృత్య శిక్షణ లో,  ఐదేళ్ళ చిన్నారుల నుండి అన్ని వయస్సుల యువత ఉంటారు.  వారు నేర్చుకునే ఎన్నో అంశాలకు - క్షుణ్ణంగా ప్రతీ పదానికి, ముద్రలకి అర్ధాలు,  నాట్య శాస్త్రము నుండి అవసరమైన వివరణ  కూడా ఇవ్వబడుతుంది.

నృత్య శిక్షణ  పొందేవారు  రామాయణ,  మహాభారతాల  నుండి  ఉత్తేజ  పరిచే  కథలు విని-  విలువైన సమాచారం  అందుకునే అవకాశం ఉంటుంది.  అమ్మమ్మ,  నానమ్మలు  చెప్ప గలిగినంత  కాకపోయినా, కొంతైనా  అటువంటి  అవకాశం ఉపయోగకరమే.

శాస్త్రీయ సంగీత శిక్షణ లో అయితే, కృతులు, కీర్తనలు నేర్చ్గుకుంటారు..భాష, ఉచ్చరణ మెరుగు పడుతుంది. భాషా ప్రావీణ్యత లేకపోయినా, పిల్లలు పాడుతుంటే ముచ్చటగా ఉంటుంది. కొంతమటుకు పాటకి అర్ధాలు కూడా నేర్చుకోవడం, కొసమెరుపే !

కుదురుగా కూర్చోవడం, ఓ గురువు వద్ద భయ భక్తులతో విద్య నభ్యసించడం, అన్నీమంచి సాంప్రదాయాలే !

ఇక శాస్త్రీయ నృత్యం సంగతికి వస్తే, పిల్లలికు ముందుగా ఆకర్షణీయంగా కనిపించేవి, ఆహార్య అలంకారాలు, ఆభరణాలే.  శ్రద్దగా అభ్యసిస్తే, ఈ కళ వల్ల మహా సముద్రమంత ఉపయోగమే. ఈ అభ్యాసన వల్ల క్రమశిక్షణ పెరిగితే, శారీరక వ్యాయామం అంగ సౌష్టవాన్ని పెంపొందిస్తుంది అని నాట్య శాస్త్రమే చెబుతుంది.  నేర్చుకొని ప్రావీణ్యత సాధించవచ్చు.  ప్రదర్సనలిచ్చి పేరు,  ప్రేత్యేకతలు  పొందవచ్చు.  ఇమిడి ఉన్న సాంప్రదాయాలు,    ఆచార వ్యవహారాల  గురించి  తెలుసుకోవచ్చు.

మనస్సుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవే లలిత కళలు. చక్కని పాటకి, అందమైన ఆటకి స్పందించని మనస్సు ఉండదు, ప్రతిస్పందన  లేని మనిషుండడు.  కాబట్టే, కళలు మన జీవితం లో ఒక ముఖ్య మైన భాగం అయ్యాయి.  పిల్లల్లో  క్రమశిక్షణ,  సాంప్రదాయ  విలువలు  ఇనుమడింప  చేయడానికి,  లలితకళలని,  ఓ సాధనంగా  మలుచుకోవచ్చు.  లలితకళలు,  అందమైన   లోగిళ్ళ  ముంగిట  జిలుగుల  తోరణాలే అవ్వవచ్చు.  

                                         ***************************

ప్రవాస భారతీయుల జీవన విధానం లో భారతీయ కళలు – సంస్కృతి – సాంప్రదాయాలకున్న ప్రాముఖ్యత,  వారి యువతపై  వాటి  ప్రభావం  గురించి ప్రస్తావించే టెలి-ఫిలిం, ‘ఆలయనాదాలు’.....  

ప్రాజెక్ట్  తలపెట్టగానే, నా  స్టూడెంట్స్,  వారి  తల్లితండ్రులు  కూడా  ఊహించని  మద్దతునందించారు.  వారిలో కొందరు, టెలి- ఫిలిం లో  ప్రవాసాంధ్ర  యువతగా నటించారు కూడా.  మిగతావారు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

పోతే, అడిగీ అడగ్గానే, NASA  JOHNSON  SPACE  CENTER,  HOUSTON  INTERCONTINENTAL  AIRPORT, GALLERIA  ICE-SKATING మేనేజ్మెంట్ వారు అనుమతినిచ్చి ఎంతగానో సహకరించారు... సగభాగం హ్యూస్టన్లోనే  తీసాము.  అక్కడివరకు  దర్శకత్వ  బాధ్యతలు  నేనే  చేపట్టాను.  అదంతా  ఓ గొప్ప అనుభవం, అనుభూతి...  మిగతా సగభాగం హైదరాబాద్ పరిసరాల్లో, శ్రీశైలం లోనూ చిత్రీకరించాము. 

మొత్తానికి..సినిమా నిర్మాణం అనుభవం – నాకు ఒక కొత్త ప్రపంచమే అనవచ్చు... కష్టమే కూడా.  అందరూ చేయగలిగేది కాదు అని నా అభిప్రాయం. 

‘ఆలయ నాదాలు’

TEMPLE BELLS – TELE-FILM PROJECT –

PRODUCED BY ARCHANA DANCE ACADEMY –HOUSTON TX

&

DIVYETEJA ENTERPRISES - HYDERABAD

1993 - DISTRIBUTED AS TELE-FILM IN U.S.A & TELECAST AS GEMINI SERIAL IN 14 COUNTRIES (INCLUDING U.S & CANADA) 1994

A unique attempt to portray the cross-cultural conflicts among N.R.I s & their youth....
A Film dedicated to propagating Traditional Arts (Dance -Music) 
Concept - Artistic Director - Uma Bharathi
Direction - A.V.. Nag Prasad – Adoni Ramu…

STORY-  VOLETI PARVATHEESAM, LAALITHYA, UMA BHARATHI

LYRICS:  Dr. C. NARAYANA REDDY, TRADITIONAL

MUSIC :  GOPI RADHA

FEATURING - MUKKU RAJU SILPA KOSURI 
MAJOR. A. SATYANARAYANA UMABHARATHI, A.V.N. PRASAD B.ASHOKA RAO SAGARIKA RAO SANGEETA KONDAVETI NISHA BHALLA MADHURI VISWANADHAM POTTI VEERIAH

AYESHA JALEEL LEANA AHMED

&

Youth from U.S and India

      

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు