ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారు జోకులు రాయడం విచిత్రంగా అనిపించినా, చదివాక నవ్వని వాడుండని నా అభిప్రాయం! అత్యద్భుతంగా వున్నాయి
---- అభిరామ్, నెల్లూరు
ఆరుద్రగారి గురించి సమగ్రంగా విపులీకరించిన శ్రీ శాస్త్రిగారికి ధన్యవాదాలు. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు కీ..శే. ఆకుండి నారాయణమూర్తిగారి కలెక్షన్లలో "సమగ్ర ఆంధ్ర సాహిత్యం" సంపుటాలు ఉండేవి. చిన్న తనంలో ఆ పుస్తకాలు చదివి అప్రతిభుడనయ్యాను. తెలుగు మహనీయుల గురించి ఉద్దేశించిన మీ శీర్షిక సుశాస్త్రీయం అప్రహతిహతంగా సాగిపోతోంది.. అభినందనలు సర్!
---- సాయిరాం ఆకుండి
కవి అంటే మరో బ్రహ్మే!సందేహం లేదు.కవికుండవలసిన లక్షణాలాను గురించి చక్కగా చెప్పారు.అభినందనలు! 'ఆదిత్య హృదయం' కడు హృద్యం! మనది ప్రజాపక్ష పత్రిక అని ఎలుగెత్తి చాటిచెప్పిన బన్ను గారికి నా అభినందనలు!
---- టీవీయస్.శాస్త్రి
ధన్యవాదములు.. శ్రీ రమణ మహర్షి గారి చరిత్రము ను ప్రచురించుచున్నందుకు.. రచయిత్రి గారికి అభినందనలు. వంశీకి నచ్చిన కథలు - బైరాగి కధ అద్భుతం గా ఉంది.. చదువుతుంటే అచ్చు నావలో ప్రయాణిస్తూ ఉన్నట్టే ఉంది.. అద్భుతమైన కధనం ఆహ్లాదం గా చివరివరకు గోదావరి లాగే ఉరకలేస్తూ విడవకుండా చదివించింది.శ్రీ వంశీ గారు చెప్పినట్టు స్పష్టమైన అవగాహనతో రాసిన కధ ఇది. రచయిత గారికి నా హృదయపూర్వక అభినందనలు. సిరాశ్రీ గారి సమీక్ష బాగుంది. రాయగల శక్తీ ఉన్నా ప్రచారం కల్పించుకోలేకపోతున్నారు. మీరు చెప్పింది నిజమే సర్. మనసా...... తుళ్ళిపడకే శీర్షిక బాగుంది మేడం. చక్కగా వివరించి చెప్పారు.. మీకు అభినందనలు..
---- రాజా రవి శంకర్
సూర్యదేవర గారి అనుబంధాలు సీరియల్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ అద్భుతం
---- రఘుణాచారి
ఆరుద్ర గారిమీద వ్యాసం బ్నిం గారన్నలు కొండని అద్దంలో చూపారు, ఆరుద్ర ఆరోరుద్రుదనటానికి సమగ్ర ఆంధ్ర సాహిత్యం చాలుకదా , అభినందనలు శాస్త్రి.
---- రత్నంయు.వి. ఒంగోలు
సుపర్బ్ జోక్స్..బొమ్మలు కూడా సూపర్..చిల్లరదేవుడు బస్ కండక్టరూ, బ్రహ్మరాత డాక్టరు ప్రిస్క్రిప్షనూ, శ్రీశ్రీ మగాకవీ, అన్నీ సూపర్! చివర్లో వింటే బాగవతం వినాలి అని తెలీక మధ్యలో నిద్రపోయినందుకు గారెలకు బదులు నాలుగు తన్నులు తినడం కొసమెరుపు.
---- జ్యోతిర్మయి మల్లా
ఆరుద్ర గారికి జొహార్లు. ఆయన గూర్చి ఇంతకముందు చదివిన ,మీకు వారితొ గల పరిచయానికి చాల ఆనందిచాను.మీరు ఒక రకంగ అద్రుష్టవంతులు మంచి రచయత,కవి,మంచి మనిషి ని స్వయంగ కలిసినందుకు. మీ సంపుటి చల బాగుంది.మీకు మంచి రచనా శక్తి ఆ "రుద్రుడు" ఇవ్వాలని కొరుకుంటూ.
భాగవతుల సురేష్ కుమార్