జ్యోతిపథం - పులివర్తి కృష్ణమూర్తి

jyotipatam

శివోహం - శివోహం

పాఠకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.

మాఘమాసం ఎంతో మహిమాన్వితమైంది. ఈ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి, శివునికి ఎంతో ప్రియమైన తిథిగా చెబుతారు. శివరాత్రి నాడు ఉపవాసం చేసి మారేడు దళాలతో శివపూజ చేసిన వారికి శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది. ఉపవాసంతో బాటు రాత్రంతా జాగరణ చేయాలి. జాగరణ చేసిన వారికి పాపవిముక్తి, శివానుగ్రహం కలుగుతుంది. కొండల్లో మేరువునూ, గ్రహాలలో సూర్యునీ, నాలుగుకాళ్ళ జంతువుల్లో కపిలగోవునూ, మంత్రాలలో గాయత్రినీ, రసవస్తువుల్లో అమృతాన్నీ, పురుషులలో విష్ణువునూ, స్త్రీలలో అరుంధతినీ, ఉత్తములైనట్లుగా చెప్పడం కద్దు. అలాగే అన్ని వ్రతాల్లోకెల్లా ఉత్తమమైన వ్రతంగా శివరాత్రిని చెబుతారు. సర్వపాపాలను శివరాత్రి వ్రతం ధ్వంసం చేస్తుంది. అందుకు తార్కాణంగా ఒక కథను చెబుతారు. పూర్వం శాకలము అనే నగరంలో అంకిలుడు అనే బోయవాడు వుండేవాడట. వాడు ఒక విధంగా మానవరూపంలో వున్న రాక్షసుడిగానే చెప్పుకోవాలి. ప్రతిరోజూ అడవికి పోయి మృగాలను వేటాడి వాటి మాంసంతో భార్యా పిల్లలను పోషిస్తూ వస్తున్నాడు. నిత్యం వాడికి ఆహారంగా అడవి జంతువుల మాంసమే ఆహారంగా కావాలి. జంతువుల రక్తమంటే వాడికి అతిరుచిగా మంచినీళ్ళ ప్రాయంగా త్రాగేస్తాడట. అలా అలా రోజులు గడచిపోయాయి. ముసలితనం దాపురించింది. మామూలుగానే ఒకరోజు అడవికి వేటకోసం వెళ్ళాడు. అక్కడక్కడా వలలు పన్నాడు.

మృగాలు పడిపోవడానికి గోతులు తవ్వాడు. జంతువుల కోసం కాచుక్కూర్చున్నాడు. పొద్దుపోయింది. ఒక్క మృగం కూడా ఆ దరిదాపులకు రాలేదు. అనుకుంటూ వుండగానే, ఎదురుగా ఒక కుందేలును వెంబడించాడు. అది ఎగురుకుంటూ, గెలుచుకుంటూ పరుగులంకించుకుంది. వెంటపడ్డాడు. దొరకలేదు. పొదల మాటున ఎక్కడో కనబకుండా దాక్కుంది. చీకటి పడిపోయింది. గమనించలేదు అంకిలుడి ఆవిషయాన్ని. ఇక ఏం చేయాలి? ప్రక్కనే వున్న మారేడు చెట్టు నెక్కి కూర్చున్నాడు. అడ్డుగా వున్న కొమ్మలను త్రుంచాడు. ఆకులు గల గలా రాలి క్రిందపడ్డాయి వర్షం లా. ఏదో ఒక జంతువు చెట్టు క్రిందకు రాకపోతుందా చూద్దాం అనుకుంటూ, అందిన ఆకులన్నింటినీ పీకి క్రిందకు వేస్తూ కూర్చున్నాడు. ఆ ఆకులు క్రింద వున్న శివలింగం మీద పడుతున్నాయని అంకిలుడికి ఏ మాత్రమూ తెలియదు. శివడికి మారేడు దళాలతో అభిషేకం చేస్తూనే వున్నాడు. రాత్రం తా అలాగే కూర్చుని మేలుకునే వున్నాడు. అతగాడి చూపంతా చెట్టు కిందనే వుంది. చెట్టు కింద శివ లింగం వుంది. దాని వంకే అతడి చూపంతాను. ఏ జంతువన్నా ఆ శివలింగం వద్దకు వచ్చి పడుకుంటుందేమో ననే ఆశ. తనకు తెలియకుండానే మహదేవునికి బిల్వార్చన గావించాడు.  తెల్లవారింది. చెట్టు దిగాడు. మంచు పడిందేమో తలంతా స్నానం చేసిన విధం గా నీళ్ళు పడ్డాయి. తడిసి ముద్దయిపోయాడు. పగలంతా ఉపవాసం చేసాడు. రాత్రి అంతా జాగారం చేసాడు. పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు. వృద్ధుడు కావడం వలన ఏమాత్రమూ కనురెప్ప వాలచలేదు. అడుగు తీసి అడుగు వేయాలేకపోయాడు. ఎలాగో ఇల్లు చేరుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు చనిపోయాడు. వెంటనే యమ దూతలు వచ్చేశారు. ఇతగాడిని సలసల కాగుతున్న నూనె  కుండలలో వుడికించాలి. మళ్ళతో కొట్టాలి. వీడి నాలుకను రంపం తో ముక్కలుగా కోయాలి. ఇనుప రోకలితో నెత్తిని చితక్కొట్టాలి. వీడు మహా పాపి. అనుకుంటూ అట్టహాసం చేస్తూ ఈడ్చుకు పోవడానికి సంసిద్ధులైనారు. అంతలోనే అక్కడకు ఒక దివ్య విమానం వచ్చి నిలిచింది.

అందులో నుండి తెల్ల విభూతి ధరించిన శరీరాలతో వెలిగిపోతున్న శివ దూతలు దిగారు. వారు యమ దూతలను కాదని అంకిలుణ్ణి తమ విమానం పై ఎక్కించుకున్నారు. యమకింకరులు తామెవరో తెలిపారు. అంకిలుడు యమ పాపి అని అంతా వివరించారు. వీడు షిక్షార్హుడు. వీణ్ణి మాకు అప్పగించండి. మీరు తీసుకుని పోవడం అధర్మం అన్నారు. యమకింకరులు శివదూతలు అడ్డుకున్నారు. వారు యముడికే యముడైన దేవదేవుని ఆజ్ఞ ప్రకారం శివలోకానికి తీసుకువెళతామని చెప్పి, అడ్డుకున్నవారిని చితకబాదారు. యమదూతలు వెళ్ళి యముడికి ఈ విషయం చెప్పగా , యముడు, చిత్రగుప్తుడు జాగ్రత్తగా పరిశీలించి, అంకిలుడు మహా పాపి అని నిర్దారించాడు. మరలా మరోసారి ఇక చేసేదేమీ లేక యముడు చిత్రగుప్తుని వెంట తీసుకుని కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడికి జరిగినదంతా చెప్పాడు. ధర్మ విరుద్ధం గా శివ దూతలు అంకిలుణ్ణి శివ పురికిక్ తెచ్చారని ఫిర్యాదు గావించాడు. అప్పుడు శివుడు చిరుమందహాసం తో యముడికి , అంకిలుడు గావించిన శివరాత్రి వ్రతం గురించి వివరించాడు. నాకు ఎంతో ప్రీతికరమైన మాఘ కృష్ణ చతుర్ది నాడు సూర్యోదయం మొదలు మరునాటి ఉదయకాలం వరకూ పచ్చిమంచినీళ్ళయినా ముట్టకుండా కటిక ఉపవాసం చేసాడు. తెల్లవారేదాకా లింగ స్వరూపిడినైన నన్ను , నాకిష్టమైన మారేడు దళాలతో పూజ గావించాడు. జాగరణా చేసాడు. నా దయకు పాత్రుడైనాడు. అమాయకం గా అతగాడు శివరాత్రి వ్రతాన్ని ఆచరించాడు. దాంతో అతని పాపాలన్నీ భస్మం అయిపోయాయి. తెలిసిగానీ, తెలియక గానీ శివరాత్రి నాడు ఉపవాసం వుండి, నన్ను రాత్రం తా మేల్కొని బిల్వ పత్రాలతో లింగార్చన గావించిన వారు నా దయకు పాత్రులవుతారు. నా వద్దకు చేరుకుంటారు. మీరు కేవలం పాపాలే చూశారు గానీ, చివరి క్షణాల్లో బోయవాడు చేసుకున్న పుణ్యాన్ని గ్రహించలేకపోయారు. అని శంకరుల వారు యముడికి చెప్పగా, చిత్తం అంటూ తిరిగి తమ లోకానికి తిరిగి వెళ్ళిపోయారు.

శివరాత్రి మహిమ అంత గొప్పది మరి. హింసాయుతం గా జీవితమంతా చరించినా, చివరి క్షణాల్లో నైనా , తెలిసో, తెలియకో భగన్నామస్మరణం గావించినా, పూజ జరిపినా, సాయుజ్యం లభించగలదని ఈ బోయవాని కథ ద్వారా తెలుస్తున్నది. మన జీవితం లో, మన శరీరం సదా మన కొశం పాటుపడుతూనే వుంటుంది. నిద్రాహారాలు మానవుడు ముఖ్యం గా భావించి చర్చిస్తున్నాడు. మనం ఆరోజ్యం గా వుండాలంటే మనం తీసుకునే ఆహారం విషయం లో జాగ్రత్తగా వుండాలి. ఏదైనా మితంగానే వుంటే సదా అరేయశ్కరం. కొందరు వైద్యులు వారానికి ఒక్క రోజైనా మన ఉదరానికి విశ్రాంతినివ్వాలంటారు. వంద సంవత్సరాలు జీవిస్తే ఆ నూరు సంవస్తరాలూ, రేయనకా, పగలనకా సదా మనం తినే ఆహారాన్ని మన శరీరం లోని అవయవాలు పనిచేస్తూ వాటిని జీర్ణం గావించి, మలమూత్రాదులను విసర్జించి, మిగిలిన దాన్ని మన రక్తం లో కలిపి, శరీరాన్ని పోషిస్తూ వుంది. వాటిని తప్పనిసరిగా విశ్రాంతి కల్పించి వాటిని కాపాడుకోవల్సిన బాధ్యత వుంది. ఇక అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు. అంట్టూటాం కదా, అందుకే నిద్రపోకుండా వుండేలా శరీరాన్ని తర్ఫీదు గావించాలి. జీవితం లో ప్రతిక్షమూ భగవంతుని స్మరిస్తూ చరించాలి. క్రమం తప్పకుండా పూజలు గావించాలి. చివరి క్షణాల్లోనైనా ఆ పని చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతతను పొందాలి. దైవాన్ని శరణు వేడాలి.

శివుడిని మనం నిశ్చింతంగా పరిశీలించితే మనకు మన జన్మ ధ్న్యతనొందే ఎన్నో జీవన యానం లో పనికొచ్చే  పలు విషయాలు స్పురిస్తాయి. ముసలి ఎద్దును వాహనం చేసుకుని పాములనే పసిడి ఆభరణాలుగా ఢరించి, పేదతనం లోనే పెన్నిధి క్లదని నిరూపించాడు. వంటి నిండా విభూతి పూసుకుని, చర్మంభర ధారీఇ వున్నా కూడా, భొళా శంకరుడైన పార్వతీ దేవి. ఆయన కరుణా మూర్తి. బిక్షమెత్తి ఆది బిక్షకుడైనాడు, దంపతుల గురించి చెప్పాలంటే ఆ ధర్మం గా ఆది దంపతులైన శివపార్వతులబే చెబుతారు. ఏటి కొక్క నాడు శివ శివా అంటే చాలు కోటి జన్మల కొరత తీరుతుంది. ఆయన ప్రేమకు చిహ్నం. పేదలకు ఆత్మ బంధువు. దంపతులకు మార్గదర్షకుడు. తన శరీరం లో సగ భాగాన్ని భార్యకే ఇచ్చివేశాడు. అడవిలో పూలన్నా, ఆకులు అలములన్నా ఆ త్రినేత్రుడికి అత్యంత ఇష్టమే. ఈశ్వరునికి స్వర్ణ కానుక లేమీ అవసరం లేదు. నెత్తిమీద నెలవంకతో గంగను తలమీద పెట్టుకుని, లోకాలను చల్లగా కాపాడే వాడే ఈ నమశ్షివాయ. పంది మాంసం పెట్టిన భక్త కన్నప్ప భక్తినీ మెచ్చుకున్నాడు, పడగ పట్టిన నాగు పామునూ కరుణించాడు, సాలెపురుగుకూ సాయుజ్యమిచ్చిన భొళా శంకరుడాయ. కేవలం భక్తి మాత్రమే ముఖ్యమని ఇటు నరులనూ, వానరులనూ, దేవతలనూ, రాక్షసులను కూడా సమంగా అనుగ్రహించిన మహ దేవుడు శివుడు. ఈశ్వరుని ప్రసన్నం గావించుకోవడానికి యజ్ఞాలు, వ్రతాలు, నోములూ, యాగాలూ, తపాలు, భూరి పూజలూ కోరుకోడు స్వామి, కేవలం మనస్సు పెట్టి ప్రేమగా పిలిస్తే చాలు పలుకుతాడట. ఓం నంశ్శివాయ అంటూ పంచాక్షరీ మత్రాన్ని పఠిస్తే చాలు శివసాయుజ్యాన్ని పొందగలరు.

ఏటికొక్కనాడె శివరాత్రి పర్వంబు

కోటి జన్మలకది కొరత తీర్చు

శివుని నామమొకటి భవపాపములదీర్చు

ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ.

 సర్వేజనా: సుఖినో భవంతు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి