నవ్వుల జల్లు - జయదేవ్

ఫణి వర్మ : రాజు కొలువులో నువ్వు కవిత పాడితే, సన్మానం చెయ్యక, నిన్ను తిట్టి తగలేసారా? ఏం పాపం ? ఏం కవిత చదివావ్ ?
మణిశర్మ : తిట్టు కవిత !

భర్త శేఖర్ : తాన్ సేన్ గారు గానం చేస్తున్నారట ! రాళ్ళు కరుగుతున్నాయట ! ఆ వింత చూద్దాం పద !
భార్యామణి : వుండండి ... నా రాళ్ల నెక్లెస్ బీరువాలో పెట్టి వస్తాను !!

ద్వార పాలకుడు - 118 : కనకపు సింహాసనమున సునకమును కూర్చో పెట్టారే ?
ద్వార పాలకుడు - 119 : అది రాణి గారి పెంపుడు శునకం. నోర్మూసుకో !!

పెద్ద కింకరుడు : యమధర్ముల వారు అలసి, సొలసి, కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నారేం?
చిన్న కింకరుడు : ఎవరో సతీ సావిత్రి అట ! మూడు చెరువుల నీళ్ళు తాగించిందట !!

కవి పుంగవుడు : శిష్యా ! తాళ పత్రములను సిద్దము చెయ్యి ! రచన మొదలు పెట్టవలయును!
( ఇంతలో )
కవి పత్ని : పొయ్యి లోకి పుల్లలేరుకురమ్మని మీ శిష్యుణ్ణి అడవికి పంపాను !
కవి పుంగవుడు : ఐతే , నువ్వు తాళ పత్రములను సిద్దము చెయ్యి !
కవి పత్ని : అవెక్కడివీ ? పాలు కాచేసాను గా !!

వరూధిని చెలికత్తెల్లోని
మొదటి చెలికత్తె : ఏమిటీ , ఆ మూడవ చెలికత్తె అశ్లీలం పలికిందని, దానికి కఠిన శిక్ష విధించారా? ఏం పలికిందట పాపం ?
రెండవ చెలికత్తె : ప్రవరాఖ్యుడు , కాలికి మాత్రమే లేపనం రాస్తాడా? అని ప్రశ్నించిందట !
మొదటి చెలికత్తె : ఐతే శిక్షార్హురాలే !!


వ్యాకరణ కర్త : ఏం పద్యం రాశావయ్యా ? అన్నీ లఘువులే ! గురువులు కనిపించుట లేదే ?
పద్య రచయిత : నాది ఏకలవ్య పరంపర ! సకల విద్యలు నేనే అభ్యసించాను. నాకు గురువులు లేరు !!

దేవేంద్రుడు : నాకు చత్వారము కలిగినదా? అని సంశయము ఏర్పడినది !!
బృహస్పతి : ఎన్నవ కంటికి ?

చిన్న ఋషి : ఆ ఆశ్రమ స్త్రీ ని చూసి నా మతి చలించినది .... !?
పెద్ద ఋషి : ప్రాయశ్చిత్తముగా, హిమాలయములకేగి తపస్సు చేయుము ... పొమ్ము !
(వెయ్యేండ్ల తరవాత)
పెద్ద ఋషి : తపస్సు ముగిసినదా ? తిరిగి వచ్చితివేమి ?
చిన్న ఋషి : అచ్చట , రంభ ని చూసి నా మతి చలించినది !!

నేపాళ మాంత్రికుడు : నీకు పరకాయ ప్రవేశం చెయ్యటం వచ్చా? చెయ్ .... నాకేం భయం ??
మళయాల మాంత్రికుడు : చచ్చిపోయిన నీ పెళ్ళాం కాయంలో ప్రవేశిస్తాను , జాగ్రత్త !!!

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు