గోతెలుగు వెయ్యవ సంచిక కోసం ఎదురు చూస్తాను.నా శుభాకాంక్షలు, ఆశీస్సులు, గోతెలుగు సంపాదకులకు, నిర్వాహక బృందానికి!
-డా.ఎస్.జయదేవ్ బాబు, కార్టూనిస్ట్
అర్ధవంతమైన అంశాలకి, ఆసక్తికరమైన శీర్షికలకి, అందంగా ఆహ్వానం పలికే అంతర్జాల కుటుంబ వారపత్రిక – ‘గో-తెలుగు.కామ్’..ఈ సచిత్ర, సాహిత్య పత్రిక 100 వ సంచిక విడుదల సందర్భంగా హృదయపూర్వక శుభాభినందనలు...గో-తెలుగు మరింతగా ఆదరణ పొందాలని, మరెన్నేన్నో ఇటువంటి వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆశిస్తూ,
-కోసూరి ఉమాభారతి, డైరెక్టర్, అర్చనా డాన్స్ అకాడెమీ, హ్యూస్టన్, టెక్సాస్
అతి తక్కువ కాలం లో అత్యధిక పాఠకాదరణ పొందిన వెబ్ వార పత్రిక గోతెలుగు.కాం. అందుకు వ్యవస్థాపక-ప్రధాన సంపాదకులు బన్ను గారికి విజయాభినందనలు. వారి సిబ్బందికి నా ఆశీస్సులు . సంపాదకులకుండే నీతి నిజాయితీ పత్రికలో ప్రతిబింబిస్తుంది. ఆ నిజాయితీ గోతెలుగు లో కనిపిస్తోంది. అటు అత్యధిక సర్క్యులేటెడ్ ప్రింట్ మాగజైన్ స్వాతి వార పత్రికలో, ఇటు హైలీ బ్రౌజెడ్ గోతెలుగులో నిరంతరం సీరియల్స్ రాయటం నా అదృష్టం గా భావిస్తున్నాను . సౌమ్యుడు, స్నేహశీలి, మానవతావాది ఐన బన్నుగారి ప్రియ మానస పుత్రిక మరింత ఎత్తుకు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
- సూర్యదేవర రామ్ మోహన్ రావు, రచయిత
కొన్ని సాహిత్యానుబంధాలు మాటలకందవు. ఈ మ్యాగజైన్ అంటే ప్రింట్
మ్యాగజైన్లాగా నాలుగు పేజీలు, కొన్ని రచనలు అన్నట్టుగా కాకుండా క్రొత్త
ఒరవడితో, వినూత్న సాహితీవిన్యాసంతో వెలువడుతున్న గోతెలుగుని ఒక్కసారి
చూస్తే ఇహ వదల్లేని మధురబంధం ఏర్పడుతుందన్నది అక్షరసత్యం.
వింటే భారతం వినాలి
తింటే గారెలు తినాలి
చదివితే గోతెలుగు చదవాలి!
తెలుగువాడి ముక్తాయింపు ఇంతే!ముమ్మాటికీ ఇంతే!!
గోతెలుగు పాఠకుడిగా గర్వించే
ప్రతాప వెంకట సుబ్బారాయుడు ,రచయిత
గోతెలుగు కార్టూనిస్ట్ ల పాలిటి కామధేనువు ...
కదారచయితలకు కల్పవృక్షం ప్రతిభను మోసే ఐరావతం
ఉరకలెత్తించె ఉచ్చైశ్రవం శుక్రవారం' నాటి మహాలక్ష్మిచందం
అందరినీ అలరించే అమృత భాండం
గోతెలుగు ఓ పాలకడలి .... గోతెలుగు ఓ నిండు జాబిలి ..
-దేవగుప్తం శ్రీనివాస చక్రవర్తి, కార్టూనిస్ట్
గోతెలుగు. కామ్ తో మూడు అయిదుల 'అన్నమయ్య పద సేవ' అనుబంధాన్ని ఈ వంద గజ్జెల చప్పుళ్ల వేళ తలచుకొంటూ సహస్ర కింకిణీధ్వనులకోసం ఎదురుచూస్తున్నాను.
తాడేపల్లి పతంజలి, రచయిత
షడ్రుచులకు మా తెలుగు.కామ్,
నమస్తే సార్,
చిన్న మౌస్ క్లిక్ తో సంపూర్ణ వారపత్రికను ఆసాంతం ఉచితంగా అందిస్తూ.. నిర్విరామంగా రెండేళ్ళనుంచీ అలరిస్తున్న గోతెలుగు.. ఇదిగిదిగో తెలుగు అన్నట్లుగా నెట్టింట్లో సందడి చేస్తూ, డిజిటల్ మ్యాగజైన్ అధ్యాయంలో కొత్త ఒరవడికి నాంది పలికి గోతెలుగు టీం లో ప్రతిఒక్కరికీ పేరుపేరునా అభినందనలు.. సాలిడ్ గా ఇరవై కలర్ ఫుల్ కార్టూన్లను అందించడం గోతెలుగు విశిష్టత.. సెంచరీలలో గోతెలుగు రికార్డులు సృష్టించాలని కోరుకుంటూ...
రంగురంగుల బొమ్మలతో బాలకు నీతి
అబినందనలు
క్రికెట్ లో ఒక బాట్స్ మెన్ కి సెంచరీ ఎంత ముఖ్యమో !పత్రికల మనుగడ కి వంద సంచికలు అంతే కీలకం. అంతర్జాల పత్రికలలో ఒక పత్రిక వంద సంచికలు విజయవంతం గా పూర్తి చేసుకోవడం నిజం గా అద్భుతం. ఇలాంటి వంద సంచికలు మరెన్నో వందలు కావాలని కోరుకుంటున్నాను .ఈ వందవ సంచికతోనే నా "రాజాధి రాజా"వంద కార్టూన్స్ పూర్తి చేసుకోవడం సంతోషం గా ఉంది .
---రామ్ శేషు,కార్టూనిస్ట్
ఇది గో తెలుగు డాట్ కాం
వెలుగు తామరల తటాకం
-సరసి, కార్టూనిస్ట్
గో తెలుగు . కాం సంపాదకులకు, నిర్వాహకులకు , మనః పూర్వక నమస్కారములు, ముందుగా అప్రతిహతంగా వందవ సంచికలోకి దూసుకు పోతున్న మన పత్రిక గో తెలుగు. కాంకు అభినందనలు , ఇప్పటివరకు వందకు పైగా నా కార్టూనులు ప్రచురించి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న , సంపాదకులకు ధన్యవాదములు , గోతెలుగు వారు నిర్వహించిన కాప్షన్ లెస్ కార్టూన్ పోటిలో నా కార్టూన్ కి మూడవ బహుమతి ప్రసాదించి నన్ను తట్టి ఇంకా బాగా కార్టూనులు వేయాలనే తపనను నాలో కలిగించి , నాలో ఉత్తేజాన్ని నింపిన మీకు సదా రుణపడి ఉంటాను. మన పత్రిక నిర్విరామంగా,నిర్విఘ్నంగా, నిరంతరాయంగా,అప్రతిహతంగా,కలకాలం,కొనసాగుతూ ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను . జిందాబాద్ గో తెలుగు .కాం
-వి. నాగరాజ్, కార్టూనిస్ట్
వెబ్ మ్యాగజైన్లలో కోత్తదనానికి పెద్ద పీట వేసే గో తెలుగు అంటే చాలా ఇష్టంః మంచి కథలు శీర్షికలు వ్యాసాలు అధ్బుతమైన బోమ్మలతో వచ్చే మన పత్రిక మరింత ప్రగతి పథంలో ముందుకు వేళ్ళాలని ఆశిస్తున్నాను.అన్ని సమయాల్లో మంచి రచనలు పంపి మీ ప్రయత్నానికి తోడు నిలుస్తానని హామీ ఇస్తున్నాను
- నారంశెట్టి ఉమామహేశ్వర రావు, రచయిత
ఇంటర్నెట్ ప్రపంచం లో బాషాభివృద్ధి ..
'గోతెలుగు'తో మన తెలుగు సమృద్ధి
-ఓలేటి శ్రీనివాసభాను, రచయిత
నవ్యత, నాణ్యత, వైవిధ్యాల కలబోత ‘గోతెలుగు’. అంతర్జాల పత్రికల్లో వేగంగా దూసుకుపోతోంది. 100 విశిష్టమైన సంఖ్య. ఓ వ్యక్తి వందేళ్లు జీవించాడన్నా, క్రికెట్లో వందపరుగులు చేశాడన్నా. వంద క్యాచులు పట్టాడన్నా.. ఓ సినిమా వంద రోజులు ఆడిందన్నా అది ఫ్రతిష్ఠాత్మకమైన విషయమే. ఈ విజయోత్సవ శుభవేళ,,
అక్షరాల యాత్రలో అద్భుతాలు సృష్టించేవారికి, నవ్వించే కార్టూన్ల ద్వారా, అలరించే చిత్రాల ద్వారా సృజన చాటేవారికి ముఖ్యంగా అంతర్జాల ప్రపంచంలో జెవ్విస్తున్న నేటి తరాల వారికి ఒక చక్కని వేదికగా గోతెలుగు.కాం పని చేస్తోంది. అవకాశాల ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఇది ఒక మంచి ప్రయత్నంగా భావిస్తున్నాను. కార్టూనిస్టుగా నాకు మీరు ఇచ్చిన అవకాశానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
-సి.ఆర్.రాజు, కార్టూనిస్ట్
అలుపెరుగని పరుగులతో గో.తెలుగు
అందరికీ పంచుతుంది వినోదాల వెలుగు
అందాల తారలతో ముఖచిత్రం
శీర్షికలన్నీ వుంటాయి కడువిచిత్రం
ఆడుతూ పాడుతూ చేరుకుంది నూరవ మైలురాయి
పాఠకుల మదిలో నిజంగా కలికి తురాయి
కథలనూ కార్టూన్లనూ ఎంచుకునే శైలి
ఎడిటర్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి
వారం వారం గోతెలుగు.కాం
ఇంటిల్లిపాదీ చెబుతారు వెల్ కం
చదివేవారంతా అవుతారు టూ కాం.
-వై. శ్రీలత, రచయిత్రి
కార్టూనిస్ట్ లను ఎంతగానో ప్రోత్సహిస్తూ 100 వారంలోకి అడుగిడుతున్న గోతెలుగు.కాం నిజంగా నన్ను లైం లైట్ లో నిలబెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఆశీస్సులు జీవితాంతం కోరుకుంటున్నాను.
-కె. అర్జున్, కార్టూనిస్ట్
ఆంగ్లపదాలకు అనురాగపు తేటతెలుగు అక్షరహారాలను అలంకరించుకుని కమనీయమైన కథలతో, రమణీయమైన ధారావాహికలతో, చిరస్మరణీయమైన శీర్షికలతో వారం వారం అందరినీ అలరించే గో తెలుగు...కోటి సంచికల లక్ష్యాన్ని చేరుకోగలదని కాంక్షిస్తూ...
మీ
రాజేష్ యాళ్ళ, రచయిత
ఎందరో మహానుభావులు...అందరికీ ఆత్మీయాభివందనాలు....స్థలాభావం, సమయాభావం వల్ల ఏ ఆత్మీయుల అభిప్రాయాలు ఇక్కడ మిస్సయినా, అన్యధా భావించక క్రిందనున్న ఫేస్ బుక్ కామెంట్స్ లో దయచేసి కొనసాగించగలరని విజ్ఞప్తి....