భూమి నిర్దిష్టమైన కక్ష్యలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగడం వలన పగలు,రాత్రులు ఏర్పడుతున్నవి మరి పగలు,రాత్రిని మనం నిర్వచించగలమా లేదు దానికి ఒక నిర్దిష్టమైన ప్రమాణం పెట్టుకున్నాం వెలుతురు ఉంటే పగలు అని చీకటి ఉంటే రాత్రి అని కదా అదేవిధంగా జ్యోతిషం ఒక ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని కాలాన్ని అదేవిధంగా మానవుల పైన ప్రభావాన్ని తెలుపుతుంది . భూమి యొక్క కాలగమనాన్ని ఆధారంగా చేసుకొని ఋతువులు ఏర్పడుతున్నవి ఆ ఋతువుల వలననే వర్షాలు, చలి, వేడి మనకు కలుగుతన్నవి వీటికి ఒక ఆధారం చెప్పగలమా ఇక్కడ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ఎందుకనగా కొన్ని కొన్ని విషయాలకు సమాధానం ఉండక పోవచ్చును లేదా దానికి మనం ఒక సమాధానాన్ని ఒక ప్రామాణికాన్ని ఏర్పాటుచేసుకోని ఉండవచ్చును దానినే కాలం అంటున్నాం. మరి ఆ కాలం ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండాలి కదా ఉండటం లేదు అంటే కాలానికి సంభందించిన విషయం మనకు తెలియంది ఒకటి ఉందనేది వాస్తవం అదే జ్య్హోతిషం తెలియజేస్తుంది.
నేటి శాస్త్రీయకాలంలో పోటీ పరీక్షల్లో సమాధానం అవును లేదా కాదు అని రాస్తాం లేదా సమాజంలో మంచి లేదా చెడు అదేవిధంగా నిజం లేదా అబద్దం ఉంటవి ఇవి కాకుండా మూడో సమాధానం వ్రాయగలమా ? ప్రకృతిలోని జీవులపైన అదేవిధంగా ప్రక్రుతి పైన కాలం యొక్క ప్రభావం రెండు విధాలుగా ఉంటుంది అదే మంచి లేదా చెడు దానినే జ్యోతిషం శుభ,అశుభం అని తెలియజేస్తుంది. మంచిని కలిగించే కాలాన్ని శుభాకాలం అని చెడును కలిగించే కాలాన్ని అశుభకాలం అని చెప్పవచ్చును. మంచి కాలాన్ని వినియోగించుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. అశుభకాలంలో కాస్త జాగ్రత్తలు పాటించుట లేదా అధికమైన శ్రమ లేదా జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలు జరుగుతుంది ఈ విషయాన్ని తెలియజేసేదే జ్యోతిషం.
మానవుడు సూర్యునిపైన ఆధారపడి తన మనుగడను సాధిస్తున్నాడు సూర్యభగవానుడు ఉదయంచే దిక్కును తూర్పు అని ఆ విధంగా మిగిలన దిక్కులను సూర్యుని ఆధారంగా చేసుకోని తనకు అనుకూలమైన పనులకు దిక్కులను ఆధారంగా చేసుకోండి ముందుకు వెళ్ళుతున్నాడు. కాలాన్ని అలాగే సూర్యున్ని సూర్యగమనాన్ని నక్షత్రాలకు ఆపాదించుట వలన సూర్యమాసాలు. నక్షత్రాలను చెంద్రునికి ఆపాదించుట వలన చంద్రరాశులు ఏర్పడుతున్నవి వీటి అధరం చేసుకొని ఏ కాలంలో వర్షాలు ఏర్పడుతున్నవో ఎప్పుడు ఎండలు అధికంగా ఉంటున్నవో తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యవ సాయం అలాగే వ్యాపారాన్ని చేయగలుగుతున్నాడు. మనం చేసుకొనే ప్రతి పండుగకు కాలానికి అలాగే నక్షత్రాలకు ,జ్యోతిషానికి సంబంధం ఉంది.