గోతెలుగు తొలిరోజులనుంచీ ఈ శీర్షికను ప్రచురిస్తూ ప్రోత్సహించిన మీకు వందనాలు. ఈ సంచిక తో 300 పైగా కాకులు గోతెలుగులో ముద్రణ కావడం జరిగింది. ఈ శీర్షికకు విరామం తీసుకోబడుతోంది. గోతెలుగు అప్రతిహత విజయం కొనసాగాలని ఆకాంక్షిస్తూ .. - సాయిరాం ఆకుండి
వేరెవరో కారు..
కష్టపడేవారిని గుర్తించరెవ్వరు..
విధేయత కలవారికి విలువివ్వరు..
నాణ్యతకోసం పరితపించేవారెవరు?
స్వంతలాభం మానుకునేవారేలేరు!!
మారని బుధ్ధి
ఆవినీతి అంతానికి ఏదీ చిత్తశుధ్ధి?
అయినవాళ్ళు మేసేస్తే ఏమవుద్ది?
అట్టహాసపు కబుర్లు చెబుతే కుదురుద్దా?
అసలంటూ కట్టడిలేకపోతే వీలవుద్దా??
చేసుకున్న పాపానికి!
కులరహిత సమాజానికి..
నాయకులే పెద్ద అడ్డంకి!
ఓటు సీట్ల సమీకరణానికి..
క్యాస్ట్ పాలిటిక్సే అసలైన కీ!!