శ్రీ గురుబ్యోనమ:
"వైద్యోనారాయణో హరీ" అన్నది గొప్ప నానుడి ఎందుంటే ప్రతిసృష్టి చేయడం అలాగే ఆపదలో ఉన్న వారిని కాపాడటం అనేది కేవలం వైద్యులకే చెల్లుతుంది. నేటికాలంలో వైద్యం తన పరిధులను హద్దులులేని విధంగా ఏర్పాటు చేసుకొంది. ఎంతగా అంటే మానవుని గుండెను సైతం మార్చెంతగా. ఒక పక్క వైద్యం పూరతన పద్దతులను కలుపుకొని వాటికి నూతన వైద్యవిధానాలను కలగలుపుకొని ముందుకు వెళుతుంది. ఈ విధానంలో ముందుగా ఆయుర్వైద్యం,హోమియోవిధానాలు ముఖ్యమైనవి. సరే మరో జ్యోతిషానికి వైద్యానికి ఎమన్నా సంభందం ఉందా ?
ఆయుర్వైద్యులకు జ్యోతిషపరిజ్ఞానం అవసరమా ?
బృహన్నిఘంటు రత్నాకరం అనే ఆయుర్వైద్య గ్రంథంలో దత్తరామపండితుడు ఈ వైద్యం ఏవిధంగా చక్కగా పనిచేస్తుంది అలాగే ఏది ఉత్తమ కాలమో తెలియజేసాడు. ఋతువులను బట్టి వైద్యవిధానం అలాగే ఔషధ అమలు ఉండాలని తెలియజేసాడు. దక్షిణాయనంలో చంద్రుడు ఆమ్లలవణాదులను,ఉత్తరాయణంలో సూర్యుడు తిక్తకటుకాది రసాలు బలంగా పనిచేసేలాచేస్తారు అని తెలియజేసాడు. ఋతువులను బట్టి పత్యాలను తెలిపారు. అదేవిధంగా పూర్వకాలంలో రోగి వచ్చిన సమయాన్ని అలాగే నక్షత్రాన్ని ఆధారంగా చేసుకోని రోగం యొక్క తీవ్రతను గుర్తించడం జరిగింది. జ్యోతిషగ్రంథాలలో ఏ ఏ నక్షత్రాలలో వచ్చిన రోగం ఎన్నెన్ని రోజుల్లో తగ్గుతుందో తెలియజేసారు.
అదేవిధంగా హోమోయో విధానంలో కూడా రోగియొక్క ప్రవర్తనను బట్టి కాలానికి అనుసంధానం చేస్తూ ఏవిధంగా వైద్యం చేయాలో తెలియజేయడం జరిగింది. రెపెర్టరి సూచిక ప్రకారం ఉదయం,మధ్యాహాన్నం,సాయంత్రాల్లో ఏవిధంగా మందులను వాడలో తెలియజేసింది. హోరావిధానం ప్రకారం ఇప్పటికి ఆధునిక వైద్యవిధానంలో కొంతమంది శస్త్రచుకిత్సలను చేసుకొని విజయవంతం చేసుకుంటూన్నారు.