భూమ్మీద జీవించే జీవజాతులు ఎన్నో ఉన్నాయి అందులో మానవుడు తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఆలోచించే శక్తి అలాగే నిర్మాణం చేయగలిగిన మేధస్సు మానవునికి సొంతం. విచక్షణ అలాగే తోటివారికి సహాయం చేయడం ఇలా చెప్పుకుంటూ పొతే మానవుడు చేయలేంది ఏది లేదు అని చెప్పవచ్చును. మానవుడు నేడు అంతరిక్షంలో తన ఆలోచనలకు అనుగుణంగా ప్రయోగాలను చేస్తున్నాడు అదేవిధంగా అన్వేసిస్తున్నాడు.
మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసింది భారతీయుడా?
మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసింది భారతీయుడా?
ప్లాస్టిక్సర్జరీ కి పితామహుడు మన దేశానికి చెందిన వైద్యుడు " శుశ్రుతుడు " తను క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలుగా తెలుస్తుంది. శుశ్రుతుడు పదునైన రాళ్ళను ఉపయోగించి ఈ సర్జరీని చేసాడు అని తెలుస్తుంది అంటే ప్రపంచంలో మనం విజ్ఞానాన్ని అరువు తెచ్చుకోలేదు అని తెలుస్తుంది కదా . మన గొప్పతనాన్ని మనమే స్మరించుకోకపొతే ఎవరు స్మరిస్తారు చెప్పండి. ఆధునిక వైద్యాన్ని జ్యోతిషం ముందే చెప్పిందా ?
అవును ముందే చెప్పింది నేడు ఆధునిక వైద్యంలో వివిధ విభాగాలు వాటికి స్పెసలిస్ట్ వైద్యులు ఉన్నారు కదా అదేవిధంగా జ్యోతిషంలో ఏ శరీరభాగాలకు రుగ్మతలు వస్తాయో రాశులు తెలియజేస్తాయి. మేషదిగా ఉన్న ద్వాదశరాశులు వాటికి వర్తించే రుగ్మతలను తెలుసుకోవచ్చును. రాశులను మానవుని అవయవాలకు సూచికలుగా బృహజ్జాతకంలో తెలియజేసారు. అవి వరుసగా తెలుసుకుందాం
మేషం .... శిరస్శు
వృషభం ..... ముఖం
మిథునం ...... బాహువులు,మెడ చాతిభాగం
కర్కాటకం ....... హృదయం
సింహం ...... కడుపు ( పైభాగం )
కన్యా ..... నాభిస్థానం,నడుము మరియు ప్రేవులు
తుల ..... కడుపు (క్రింది భాగం )
వృశ్చికం .... బాహ్యజనన అంగాలు
ధనుస్సు ..... తొడలు
మకరం .... మోకాళ్ళు
కుంభం ..... కాళ్ళు
కుంభం ..... కాళ్ళు
మీనం .... పాదాలు
ఈవిధంగా తెలియజేసారు మన ఋషులు అదేవిధంగా ఏ ఏ భావాలు ఏమి తెలియజేస్తాయో ముందు ముందు తెలుసుకుందాం.
ఈవిధంగా తెలియజేసారు మన ఋషులు అదేవిధంగా ఏ ఏ భావాలు ఏమి తెలియజేస్తాయో ముందు ముందు తెలుసుకుందాం.