
చక్కగా ఉడికించుకున్న కందిపప్పు లోకి చక్కటి తాలింపు వేసుకుంటే "తాలింపు పప్పు" (దాల్ తడక) రెడీ అవుతుంది.
తాలింపు లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మగ్గనివ్వాలి. ఆ తరవాత టమాట ముక్కలు వేసి నిమ్మరసం వేసుకోవాలి. కందిపప్పు లో ఉప్పు వేసుకుని సరిపోయిందో లేదో ముందే చూసుకోవాలి.
పప్పుని తాలింపులో వేసుకుని కొత్తిమీర చల్లి 'సర్వింగ్ బౌల్' లోకి తీసుకుంటే "తాలింపు పప్పు" రెడీ !!