యువ - - రవీంద్ర

మీరు... మీ ఇష్టం 



మీరు... మీ ఇష్టాలు. కొత్తగా పరిచయం అయిన ప్రతి ఒక్కరూ మరొకరి గురించి మొదట తెలుసుకునేది వీటి గురించే. స్నేహం చేయాలన్నా, ఏర్పడిన స్నేహాన్ని పెంచుకోవాలన్నా, ప్రేమించాలన్నా, ప్రేమను నిలబెట్టుకోవాలన్నా ఇద్దరి మనుషుల మధ్య వీటి గురించే చర్చ. ఇక యూత్ లో అయితే... చెప్పాల్సిన పనే లేదు. రస్కిన్ బాండ్ అని ప్రఖ్యాత రచయిత అంటాడు- ప్రతి మనిషికి 18 ఏళ్లు వచ్చేసరికి సొంత ఇష్టాలు ఏర్పడతాయంటాడు. ప్రతిభను గుర్తించే స్థాయి కూడా ఏర్పడుతుందట. ఇద్దరూ ఫ్రెండ్స్ హోటల్ కు వెళ్లినా, ఓ గ్రూప్ పార్టీ చేసుకున్నా... నాకు ఇది నచ్చదు. నాకు వేరే కావాలి. ఆ డ్రెస్ బాగా లేదు. నాకు ఈ కలర్ నచ్చుతుంది. ఇలాంటివి ఎన్నో మీ మధ్య వినిపిస్తుంటాయి. ఇష్టం అంటే కేవలం రంగులు, పువ్వులు, తాగే, తినే పదార్థాలే కాదు. మీ జీవితాన్ని నిర్దేశించే అభిప్రాయాలు. మీ లక్ష్యాలను ఏర్పరచే మానసిక స్థితులు. మిమ్మల్ని మరో మనసుకు, మనిషికి దగ్గర చేసే మానవీయ దృశ్యాలు.  అసలు ఇష్టాలు ఎలా ఏర్పడతాయి. మీ ఇష్టాలు పూర్తిగా మీవేనా... లేక మీపైనా ఎవరైనా రుద్దారా.. ఇష్టాలు మరతాయా... లేక అవసరాన్ని బట్టి మార్చుకుంటారా... ఆలోచిస్తేనే అదోలా ఉంటుంది.

 

మీ ఇష్టాలే... మీ ప్రపంచం

 ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొన్ని అయిష్టాలు ఉఁటాయి. ఇవన్నీ తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి, చిన్నప్పటి స్నేహితుల నుంచి, సామాజిక, ఆర్థిక పరిస్థితుల నుంచి ఏర్పడుతాయి. ఇద్దరు లవర్స్ విడిపోయారు. కారణం కనుక్కుంటే... ఆ అమ్మాయివి విపరీతమైన కోర్కెలు, లవర్ అవి తీర్చలేక పోతున్నాడు. అందుకే, బ్రేకప్ అయ్యారు అని తెలిసింది. ఆ అమ్మాయి మాత్రం- నేను లేని కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పడు సిటీలో తోటి ఫ్రెండ్స్ ను చూస్తుంటే వారిలా ఉండాలని, డ్రెస్ చేసుకోవాలని, సినిమాలు, పార్టీలకు వెళ్లాలని... అనిపిస్తుంది. ఇప్పుడు నా ఇష్టాలలో మార్పులు వచ్చాయి అంది. అవును చుట్టూ ఉన్న వాతావరణం మారే సరికి ఇష్టాలు మారాయి.

మీ ఇష్టాలు ఉన్న వాళ్లే మీకు స్నేహితులుగా వస్తారు అని అంటారు మానసిక శాస్త్రవేత్తలు. మీ ఇష్టాలు నచ్చని వారితో ఎక్కవ రోజులు ఫ్రెండ్ షిప్ చేయలేరు కదా మరి. మీరు ఏ దృష్టితో లోకాన్ని చూస్తే అదే దృష్టితో లోకం మీకు కనిపిస్తుందట. అంటే ఇష్టాలు అనేవి సమాజంలోనుంచి పుట్టి, సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. మీ చుట్టూ ఉన్న సమాజం మారినప్పుడల్లా ఇష్టాలు మారే అవకాశం ఉంది. కానీ కొన్ని మారని ఇష్టాలు కూడా ఉంటాయి. అలానే మార్చుకోలేని ఇష్టాలూ ఉంటాయి. అందరికీ కామన్ ఇష్టాలు ఉంటాయి.  మీ ఇష్టమే మీ లక్ష్యం అవ్వాలి          చిన్నప్పుడు  స్కూల్లో మాస్టారు అడుగుతాడు- నీకు ఏమవ్వాలని ఉంది అని. ఒకడు డాక్టరు అంటాడు. మరొకడు ఇంజినీరు అంటాడు. ఇంకొకడు నటుడు అంటాడు. కానీ తెలిసీ తెలియని వయసులో మనలోంచి వచ్చిన ఆ ఇష్టాలు బలపడొచ్చు, బలపడకపోవచ్చు. కానీ మీరు పెరిగే కొద్ది వయసుతో పాటు, మీ మానసిక పరివర్తనతో పాటు మీ ఇష్టాలూ మారతాయి. కానీ మీరు మీ లక్ష్యాన్ని మాత్రం మీ ఇష్ట ప్రకారంగా ఏర్పరచుకోవాలి. మీ నాన్న చెప్పాడని, మీ అమ్మ చెప్పిందని, మీ గురువు చెప్పాడని... ఇంజినీరవ్వొద్దు, కొత్త కంపెనీలో చేరొద్దు. మీకు నచ్చకపోయినా అ అబ్బాయి వెంట తిరగొద్దు. బలవంతంగా మీ ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు. అలా ప్రవర్తిస్తే సర్దుకుపోయే మనస్తత్వం అలవడుతుంది. కొంత కాలానికి మీకు మీరే మిగలరు. అయిష్టత స్థాయి పెరిగి ఓ యంత్రంలా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ప్రతి పనిని మీ ఇష్ట ప్రకారం చేయడానికి ప్రయత్నించండి. తప్పనిసరై వేరే రంగంలో అడుగు పెట్టినా దాన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. ఇష్టంతో చేసే పనిలో ఉండే మజాని అనుభవించండి.  మీ ఇష్టాన్ని బట్టి వేరే ఆల్టర్ నేటివ్ చూసుకోండి. తప్పనిసరైతేనే మిగిలిన వాటిని స్వీకరించండి. మీ కిష్టమైన పనిని పూర్తిచేసినప్పుడు, మీకు ఇష్టమైన అమ్మాయి, లేదా అబ్బాయి ప్రేమను పొందినప్పుడు కలిగే ఆనందం ముందు ఈ ప్రపంచంలో ఏదీ సాటిరాదు. ఓ ప్రముఖ రచయిత అంటాడు- తప్పించుకోలేని స్థితిలో తప్పు చెయ్యాల్సి వస్తే... దాన్ని ఇష్టంతో చెయ్యి. అప్పుడే దాని ఫలితాలు చెడుగా వచ్చినా ఆనందంగా అనుభవిస్తావ్ అంటాడు.

భాధను తీర్చే నేస్తాలు ఇష్టాలు మన నేస్తాలు. జీవితాంతం మనతో ఉండే ఆత్మీయులు. బాధ కలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఉపశమనం కోసం మీ ఇష్టాలను పిలవండి. వాటితో గడపండి. భవ్యాకు చంద్రుడ్ని చూడ్డం అంటే ఇష్టం. మనసు బాగా లేనప్పుడు చంద్రుడ్ని చూస్తూ కూర్చొంటుంది. ఆ చల్లటి వెన్నలను ఆశ్వాదిస్తుంది. ఆ తెల్లటి కిరణాల్లోంచి వచ్చే వెలుగే తన మనసును ఊరడిస్తుందని చెప్తుంది. అలానే కిరణ్ కు పెయింటిగ్స్ వేయడమంటే చాలా ఇష్టం. మనసు కుదురుగా లేకపోతే వెంటనే గదిలోకి వెళ్లి తన భావాలను ఓ పెయింటింగ్ గా మార్చేస్తాడు. అంతే కూల్ అయిపోతాడు. కొందరు మొక్కలు పెంచుతారు. కొందరు అమ్మఒడిలో వదిగిపోతారు. మరికొందరు ఎక్కువగా చదువుతారు. మరికొందరు బాధలోంచే కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు. అంటే కొత్త ఇష్టాన్ని నిర్మించుకుంటారన్నమాట. ఇలా మీ ఇష్టాలకు మించి మిమ్మల్ని ఊరడించేవారు లేరంటే అతిశయోక్తి కాదు. కొందరు లవ్ ఫెయిలయ్యిందని, మార్కులు తక్కువ వచ్చాయని లేదా తన లవర్ ఇంకోవాడితో తిరుగుతుందని, కొత్తగా పెళ్లయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగా లేవని మద్యానికి బానిసలవుతుంటారు. దాంతో ఆరోగ్యాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. కరెక్ట్ కాదు. మీ ఇష్టాలు మీకు తోడుంటాయి. మీ మనసును స్వచ్ఛంగా చేస్తాయి. బాధలో మీ కన్నీటిని తుడిచేవి అవే. మరో మనిషికి దగ్గర చేసేవి అవే. అందుకే మీరు మీ ఇష్టాలతో స్నేహం చేయండి.ఇష్టంతో జీవిద్దాం.

ఓ ప్రేమికుడు రాసిన లేఖలో- నీకోసం మళ్లీ పుట్టడానికి వెేలసార్లైనా మళ్లీ మళ్లీ పుడతాను. ఈ కవితా వాక్యంలో ఆ ప్రేమికుడిలో ఆ అమ్మాయి మీద ఎంత ఇష్టం ఉందో తెలుస్తుంది. చాలామంది- నేనింతే... నా ఇష్టం... నే నిలానే ఉంటాను అంటుంటారు. కానీ మీ ఇష్టాలు మరొకర్ని ఇబ్బంది పెట్టేవిగా ఉండకూడదు. మిమ్మల్ని ఇష్టపడే వారికోసం మీ ఇష్టాల్ని మార్చుకోవడం కూడా ఇష్టమేనట. అలా అని మీ అస్తిత్వాన్ని కోల్పేయే అంతగా మీరు మారిపోకూడదు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఇష్టంతో జీవించాలి. జీవించడంలోని తృప్తిని ఆనందంగా అనుభవించాలి. నెలకు ఒకసారైనా మీరు మీ ఇష్టాల్ని, మీరు ఆత్మీయంగా అనుభవించిన మధుర క్షణాల్ని గుర్తుచేసుకోవాలి. వీలైతే రాసి పెట్టుకోవాలి. వాటిని అప్పుడప్పుడు చదువుకుంటుంటే... రీ ఛార్జ్ అవుతారు. జీవితాన్ని మరింత ఇష్టంత అనుభవిస్తారు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు