పద్యం-భావం - సేకర్త : సుప్రీత

వేమన పద్యం

చెప్పులోన రాయి చెవి లోని జోరిగ
కంటి లోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభి రామ వినుర వేమ.


తాత్పర్యం
చెప్పులో రాయి , చేవి లో జోరిగ, కంటి లోని నలుసు , కాలిలోని ముల్లు , ఇంటిలోని తగువు  వల్ల కలిగే బాధ చెప్పుకోలేనిది.

విశ్లేషణ
మనము నడిచేటప్పుడు చెప్పులోన రాయి ఇరుక్కుంటే అది కాలి కి గుచ్చుకొని గాయం చేస్తుంది, ఆ రాయి తీసి అవతల పారేసినా కూడ ఆ బాధ తొందరగా తగ్గదు. అలాగే కంట్లో నలుసు పడితే నలుసు తీసాక కూడ కళ్ళు మండుతాయి, అదేవిధం గా  కాళ్ళలో ముల్లు గుచ్చుకుంటే నొప్పి తో విలవిల్లాడిపోతాము. ఇవన్నీ మన శరిరానికి కలిగించే బాధలు, అలగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఉంటే, కుటుంబం మధ్యలో ఐక్యత లేకపొతే మన మనస్సుకి కలిగే బాధ చెప్పుకోలేనిది. అందుకే ఎప్పుడు కూడా అందరూ కుటుంబం తో సక్యతగా ఉండాలి.

దాశరధీ పద్యం
బొంకని వాడే యొగ్యుడరి బ్రుందము నెత్తిన చోట జివ్వకుం
జంకని వాడె జోదు రభసంబున  ,నర్దికరంబు సాచినం
గొంకని వాడె దాత , మిమ్ము గొల్చి భజించిన వాడె పో నిరా
తంక మనస్కుడెన్నగను  దాశరధీ కరుణాపయోనిధీ.

తాత్పర్యం
ఉత్తముడే సత్యవాది . యుద్దమున జంకని వాడే ధీరుడు , అర్ధిని వెనక్కు పంపనివాడే దాత.మిమ్ము సేవించువాడే మంచి మనస్సు కలవాడు.

విశ్లేషణ
ఎవరైతే ఎప్పుడు నిజమే చెప్తారో వారే సత్యవాది, యుద్దము మొదలైనప్పుడు ఎవరైతే భయపడకుండా దూసుకోని వెళ్ళి వీరోచితంగా పోరడుతాడో అతనే ధీరుడు.ఎవరైనా కష్టం లో ఉండి సహాయం కోసం వచ్చినప్పుడు , కాదనకుండా చెసేవాడే దాత. వీటన్నిటికీ కూడ ఉదాహరణగా రాముడిని చెప్పుకోవచ్చు. రాముడు ఎప్పుడు సత్యమే చెప్తాడు, యుద్దములో ధీరుడు, కష్టం లో ఉన్నవాళ్ళని ఆదుకునే మంచి మనస్సు ఉన్నవాడు. అలంటి రాముడిని సేవించువాడు మంచి మననస్సు కలవాడు అని అర్ధం.

సుమతీ శతకం
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.

తాత్పర్యం
చెరువు నిండా నీరు చేరగానే వేల కొద్దీ కప్పలు అందులో చేరునట్లే, సంపద కలిగినవారీ వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు. 

విశ్లేషణ
చెరువు ఎండిపోయినప్పుడు అందులొ కప్పలు ఉండవు, ఒక్కసారి వానలు పడి చెరువు నిండగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చి కప్పలు అందులో చెరతాయి. అలాగే మనిషి దగ్గిర డబ్బు లేనప్పుడు బంధువులు ఎక్కువగా రారు ఎక్కడ తమని సహాయం చేయమని అడుగుతారో అనే భయం తో, ఒక్కసారి డబ్బు రాగానె తాము లాభం పొందవచ్చని అదే మనిషి దగ్గిరకి డబ్బు కోసం జేరుతారు, అలాంటివారు ఉంటారు వారికి దూరంగా ఉండలానేదే ఈ పద్యం లో న నీతి.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి