కార్టూనిస్టులతో తుంటర్వ్యూలు - ...

ప్రశ్న :  నమస్కారం చక్రవర్తి గారూ...మీ పేరేమిటి?
సమాధానం : మీరు పొరబడ్డారు ... నమస్కారం చక్రవర్తి నా పేరు కాదండీ ... చక్రవర్తి నా పేరు .

ప్రశ్న :  మీరు కార్టూన్లు వేస్తారని రూమరు....నిజమేనా?
సమాధానం : నాకే డౌట్ వచ్చే విషయాలు ... ఇంటర్ వ్యూ లో అడగొద్దని .. ముందే చెప్పాను కదండీ ...!!

ప్రశ్న :  కార్టూన్లు ఎప్పుడు మానేస్తారు?
సమాధానం : భలే మంచి రోజు .... పసందైన రోజు ... చక్రవర్తి కార్టూన్ లు మానే రొజూ ...
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మన్మోహన్ నవ్విన రోజు ... అధిక ధరలు తగ్గిన రోజు ..
రాజకీయం లేని రోజు ... మంచి  తనమె మిగిలేరొజు ..
(అంటె .... అసలు మాననెహే ... అని అర్ధం )


ప్రశ్న :  కార్టూనిస్టుగా ఇప్పటివరకూ మీరు పడిన తిట్లూ-శాపనార్థాలూ..?
సమాధానం : చక్రి -కేళీ లు లో ఏముందీ ..."తొక్క "...?అని కలి కాలం కాక పోతే .. వీడు .. కార్టూనిస్ట్ ఏమిటి చెప్మా .. అని ..  

ప్రశ్న :   ఇసుక వ్యాపారం చేసుకోవచ్చు, ఫోటో స్టుడియో పెట్టుకోవచ్చు, కుదరకపోతే ప్రధాని పదవికి పోటీ చేయవచ్చు, అన్నీ వదిలేసి కార్టూన్లెందుకు వేస్తున్నారు?
సమాధానం : ఇసక వ్యాపారం  తో '' దుమ్ము లేపాలన్నా '' ... ఫోటో స్టూడియో లో ..''డెవలప్ '' కావాలన్నా .. ''ప్రధానము ''   గా పోటీ ఉంటుంది కదండీ .. !! అయినా అవన్నీ ఎంతో కొంత ఎప్పుడైనా లాభం కళ్ళ చూదొచ్చు .. కానీ .. కార్టూనిస్ట్ అయితే .. అలాంటి అవకాశం .. ఏ కోశానా .. లేదని తెలుసుకొని ..

ప్రశ్న :  ఇప్పటిదాకా ఎన్ని లైకులు కొట్టించుకున్నారు, ఎన్ని షేర్లు చేయించుకున్నారు? 
సమాధానం : వచ్చే .. అర కొర ... పారితోషికం తో .. వీటికి డబ్బులు చాలక ... వూరుకున్నానండీ ...

ప్రశ్న :  ఏడ్చినా, నవ్వినా కన్నీళ్ళే వస్తాయి. మీ కార్టూన్లు చూస్తే ఏమొస్తాయి? 
సమాధానం : వేవిళ్ళు ... ట ..!! ( ఒక చూలింత చెప్పింది లెండి )

ప్రశ్న :  గాడిద గుడ్డు మీద ఎప్పుడైనా కార్టూన్లేసారా?
సమాధానం : లేదండీ .... మనిషి  గుడ్డు మీద వేయడమే ..!!

ప్రశ్న :  చైనా-ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు వివాదాలకు మీ కార్టూన్లే కారణమట కదా..?
సమాధానం : అంతర్జాలం లోనే కానీ ... అంతర్జాతీయంగా ... ఇం"ఛైనా" .. "పాకి" ... ఇండియా దాటగలిగే సీన్ .. ఈ శీను(శ్రీనివాస చక్రవర్తి) కార్టూన్ లకి వుందనుకోను .. 

ప్రశ్న :  మీ ఇంటికెవరైనా బంధువులొస్తే మీ కార్టూన్లు దాచేస్తారా?
సమాధానం : ఇంకెక్కడి  బంధువు లండీ బాబూ.. నేను కార్టూన్ లు వేస్తాననే విశయం .. అందరికీ లీక్ అయ్యి  ... అందరూ .. ఎప్పుడో మా ఇంటికి రావడం ... మానేసారు .. !!

ప్రశ్న :  కార్టూన్లేస్తున్నప్పుడు కరెంటు పోయినా, ఇంకయిపోయినా ఏం చేస్తారు?
సమాధానం : అది దేవుడిచ్చిన బ్రేక్ గా భావించి ...  కరెంటు ప్రొబ్లెమ్స్ లో సింక్ అయి పొతూంటాను

ప్రశ్న :  మీ కార్టూన్లు చూసి నవ్వని వారినేం చేస్తారు?
సమాధానం : వారి టేస్ట్ ని .. "బూస్ట్".... చేస్తాను .. !!

ప్రశ్న : కార్టూన్ ఐడియాలెక్కడ కొంటుంటారు?
సమాధానం : మీ మీదొట్టు .. బుర్ర చించు ""కొంటూ'' ... ఆలోచించు"" కొంటూ "".. టానండీ ..!!

ప్రశ్న :  హిట్లర్ కలలోకొచ్చి మీ కార్టూన్లు నిషేధిస్తున్నానని చెప్తే పోలీస్ కంప్లయింట్ ఇస్తారా?
సమాధానం : పోలీస్ కంప్లైంట్ ... ఇచ్చె.. పాలసీ .. కాదండీ నాది ..( ఎందుకంటె .. నాది LIC  పాలసీ )

ప్రశ్న :  మీ కార్టూన్లు మెచ్చి ఏ డైరక్టరైనా తన సినిమాలో హీరోగా చెయ్యమని అడిగితే...?
సమాధానం : మరీ... అమాయక చక్రవర్తి ... బలి చక్రవర్తి.. అయితే  నాట్ ఓ కే .
ఏ .. అలెగ్జాండర్ చక్రవర్తి ...ఇదిగో  ఇలాంటి భేతాళ ప్రశ్నలకు సమాధానాలిచ్చే ... విక్రమార్క చక్రవర్తి అయితే ఓ కే ..!!


ప్రశ్న : కొత్తగా కార్టూన్లు మానెయ్యాలనుకునేవారికి మీరివ్వకూడదనుకునే సలహా?
సమాధానం : "రేపే మానేయాలి" ... అనే బోర్డు రాసి ... రోజూ చూడ ట మే ..

ప్రశ్న :  అప్పట్లో మీరు పుట్టి ఉంటే మొదటి ప్రపంచ యుద్ధాన్ని మీ కార్టూన్లతో ఆపేవారా? 
సమాధానం : జస్ట్ ఆపేయ బోతున్నాను ... ఇంతలో ... మీరు ... ఈ తుంటర్వ్యూ ... అంటూ ... నిద్ర లేపేశారు .!!  

ప్రశ్న : మీరు కార్టూన్లె వెయ్యకపోతే ఏమవుతుంది..?
సమాధానం : యేమవుతుంది .. ??ఈ తుంటర్వ్యూ ... లో మీకు దొరకకుండా పోయేవాడిని .. హాయిగా పాఠకుడిగా ... వేరే వాళ్ళ  తుంటర్వ్యూ  చదువుతూ వుండే  వాడిని ..!!

ప్రశ్న :  మేమడగకుండానే, మా స్టూడియోకి రాకుండా చాలా చిరాగ్గా, చురుగ్గా ఆన్సర్లిచ్చారు. మాకు థాంక్స్ చెపుతారా, లేదా?
సమాధానం : నా లాంటి నొటోరియస్ ... చఛ ... ఫేమస్ ... క్రాక్ టూనిస్ట్ ... మళ్ళీ చఛ ... కార్టూనిస్ట్ .. తుంటర్వ్యూ కి .. నన్ను ఎంపిక చేసిన.. మీ ... అమాయకత్వానికి .. హబ్బా అదేనండీ .. .. ఆత్మీయతకు .. దండనాలు ... సారీ ... సారీ.. దండాలు --వందనాలు కలిపి అలా వచ్చేసింది .. ఏదైతే అది.. !! మరి ఇక వుందాం ..!! Namaste..

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు