జ్యోతిష్యం విజ్ఞానం - శ్రీకాంత్

జ్యోతిషం మొత్తం నక్షత్రాలు, గ్రహాల పైన ఆధారపడి ఉన్నటువంటి శాస్త్రం. గ్రహలంటే గ్రహించే తత్వం కలిగినవి అని అర్థం. ప్లానెట్ అంటే ద్రవ్యరాశిని కలిగి ఉండి ఒక నిర్దిష్టమైన కక్ష్యావిధానం కలిగి ఉన్నదని అర్థం. మన పూర్వీకులు గ్రహంయొక్క విధానంపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్నారు. వారు గ్రహాలు భూగోళంలో ఉన్నటువంటి జీవులపైన తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయని గమనించారు. మనం నేడు మనుషుల మనస్తత్వాల్లో అనేక మార్పులు రావడం చూస్తున్నాం. ఇవన్నీకూడా గ్రహాల మూలాన ఏర్పడుతున్నాయని వారు గమించారు. గ్రహాల పైన అనేక పరిశోధనలు జరిపారు. ఆ విషయాలు తెలుసుకోడానికి మనకు గ్రహాల పై కొంత అవగాహన అవసరం. దాని మూలాన వాటి గురుంచి మరింత తెలుసుకొనే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది.

గ్రహాలు - కుటుంబం
సూర్యుడు అతని చుట్టూ తిరిగే గ్రహాలను కలిపి సౌరకుటుంబం అంటారు. ఆధునిక  విజ్ఞానం సూర్యుడిని నిరంతర మండే అగ్నిగోళమని, దానిలో ఎన్నో హైడ్రోజన్లు నిరంతరం విస్పోటనం చెందుతూ ఉంటాయని తెలిపారు. మన పూర్వీకులు సూర్యుడిని గ్రహాలకు రాజుగా అభివర్ణించడం జరిగింది. సూర్య భగవానుడిని ప్రత్యక్ష్య దేవతా స్వరూపంగా భావించారు.  సౌరకుటుంభంలో బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యురేనస్, నేఫ్ట్యున్, ఫ్లుటో మొదలైన గ్రహాలు సూర్యున్ని కేంద్రంగా చేసుకొని తిరుగుతున్నాయి. గ్రహాలు తమ నిర్దిష్టమైన విధానంలో ప్రత్యేక కక్ష్యలో తిరుగుతూ జీవులుపైన ప్రత్యేకమైన దృష్టిని కలిగి ఉన్నాయి. ముందుగా గ్రహాల్లో మొదటిది అలాగే అతి చిన్నదైన బుధుడు గురుంచి తెలుసుకుందాం.

బు ధుడు (మెర్క్యూరీ) :-

గ్రహాల్లో అతి చిన్న గ్రహం అలాగే సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. బుధుని వ్యాసం 4878 మైళ్ళు. చంద్ర,బుధల ఇద్దరికి చాలావరకు దగ్గరి పోలికలు ఉన్నవి. బుధుడు ఒకసారి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేకాలం 88 రోజులు. బుధునకు ఉపగ్రహాలు లేవు. భుదుది పైన ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. దాదాపుగా 770 ఫారన్హీట్ డిగ్రీలు కాని రాత్రివేళల్లో మాత్రం అధికమైన శీతలం ఉంటుంది అని శాస్త్రవేత్తలు తెలియజేసారు.

జ్యోతిషంలో బుధుడు :-
జ్యోతిషంలో బుదుడిని మంచి వ్యాపరవేత్తగా అభివర్ణించారు. భుధుడు మిథున,కన్యారాశులకు అధిపతి. కన్యారాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు అలాగే మీనరాశిలో నీచస్థితిని పొందుతాడు. స్వార్థబుద్దిని కలిగి ఉన్న పండితుడు అని అలాగే కుశాగ్రబుద్దిని కలిగి ఉంటాడు అని జ్యోతిషం తెలియజేస్తుంది. బుద్దికి ప్రతీకగా వ్యవహరిస్తాడు. అలాగే ఆరోగ్యం విషయంలో భుధుడు నరాల వ్యవస్థను ప్రభావితం చేస్తాడు. టేలిఫోనే అలాగే మీడియారంగానికి ప్రతీక బుధుడు. ...

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు