29-05-2015 నుండి 04-06-2015 వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి :  ఈవారం మొత్తంమీద  ఆశించిన ఫలితాలను పొందుతారు. నూతన అవకశాలు  అందిపుచ్చుకోవడం కోసం కాస్త శ్రమించాల్సి  రావోచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి వారితో కలిసి కొత్త పనులను చేపడుతారు. ఉద్యోగంలో అధికారులతో సత్సంభందాలు ఉంటారు అలాగే వారితో కలిసి చర్చాసంబంధమైన విషయాల్లో పాలుపంచుకుంటారు. కుటుంబంలో సభ్యులతో మీయొక్క ఆలోచనలను పంచుకొనే క్రమంలొ అనుగుణంగా వ్యవహరించుట మేలు. మాటపట్టింపులకు పోకపోవడం వలన విభేదాలు తగ్గుతాయి. చాలావిషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు  అవకాశం ఉంది. వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుతాయి.               

 


వృషభ రాశి : ఈవారం మొత్తంమీద చిన్న చిన్న విషయాల్లో సర్దుబాటు అవసరం. అవతలివారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం  కలదు. అధికారులతో కలిసి సమయాన్ని గడుపుతారు వారితో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మార్పులకు ఆస్కారం కలదు. నూతన పెట్టుబడులకు సంబంధించి పనులు వేగంగా ముందుకు కదులుతాయి. స్త్రీ / పురుషుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరప్రదేశం నుండి ఒక వార్తను వినే అవకాశం ఉంది.      

 

 


మిథున రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబసభ్యులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నూతన పరిచయాలు ఏర్పడుతాయి వారినుండి లబ్దిని పొందుతారు. సంతానం మూలాన అనుకోని ఖర్చులను పొందుతారు. వ్యాపారసంబంధమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. రాజకీయపరమైన రంగాల్లో ఉన్నవారికి ఊహించని మార్పులకు ఆస్కారం ఉంది. వాహనముల మూలాన లేక అగ్నిసంభందమైన విషయాల వలన ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. గతంలో మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులతో గుర్తింపును పొందుతారు.          

 


కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద అధికారులతో సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాల వలన లబ్దిని పొందుతారు. తోటివారితో సర్దుకుపోకపోతే నూతన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంభసభ్యుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. చిననాటి మిత్రులతో కలిసి సమయాన్ని విందులకు ఇస్తారు వాటిలో పాల్గొంటారు . 

 

సింహ రాశి : ఈవారం మొత్తంమీద తోటివారితో జాగ్రత్తగా సంభందాలు నెరపడం మంచిది లేకపోతే అనవసరమైన మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యం అయిన పూర్తిచేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను అదుపులో ఉంచుకోనుటలో విఫలం అవుతారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకొనుట అలాగే నూతన పెట్టుబడులకు దూరంగా ఉండుట సూచన. మీ ఆలోచనల్లో అలాగే మానసికంగా కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. కుటుంబసభ్యులకు అనుగుణంగా మెలగడం వలన మేలుజరుగుతుంది.           

 

 

    
కన్యా రాశి :  ఈవారం మొత్తంమీద తీసుకొనే నిర్ణయాలు మేకు లబ్దిని కలిగించేవిగా ఉండేవిధంగా జాగ్రత్త పడండి. మిత్రులతో కలిసి పాల్గొనే చర్చలు మీకు ఉపయోగపడుతాయి,అవతలివారి ఆలోచనలను అర్థంచేసుకొనే ప్రయత్నం చేసుకోండి. వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మీయొక్క మాటతీరు మీ అనుకొనే వాళ్ళను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే బద్దకాన్ని వదిలి ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. గృహోపకరణాల వస్తువులను విలువైనవాటిని కొనుగోలుచేసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది.    

    

తులా రాశి : ఈవారం మొత్తంమీద మీ ఆలోచనల్లోనే లోపం ఉంది అని తెలుసుకోవడం వలన మీ పనులు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రద్దలేకపోవడం వలన వాటిని సకాలంలో పూర్తిచేయలేరు. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. రాజకీయరంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు అలాగే పరిచయాలు కలుగుతాయి. చిననాటి మిత్రులు లేదా మీ శ్రేయోభిలాషుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి ముందుగా ఉన్నవాటికి ప్రాధాన్యం ఇవ్వడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో బద్ధకం వీడండి. సర్దుబాటు విధానం కొన్ని కొన్ని విషయాల్లో అవసరం అని గుర్తిస్తారు. విదేశీప్రయాణ అవకాశాలు మెరుగుపడుతాయి. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడిపే అవకాశం ఉంది.             
 

 

 .వృశ్చిక రాశి  :  ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు గాను సమాధానం చెప్పవలసి రావోచ్చును. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. స్త్రీ / పురుష సంబధంమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నూతన సమస్యలు కలుగుతాయి. కుటుంభంలో సంతానం విషయంలో మార్పులు కలుగుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాలు మరింత బలపడే అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి విలువైన సమాచారం పొందుతారు అలాగే ప్రయాణాలు అనుకూలిస్తాయి. శారీరకశ్రమను కలిగి ఉంటారు ముఖ్యంగా భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట సూచన. మార్పులను స్వాగతించుట వలన నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టే అవకాశం లభిస్తుంది.
           

 


ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అనుకోని మార్పులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి, తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. మానసికపరమైన విషయాల్లో స్థైర్యంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో మార్పులకు అవకాశం ఉంది వాటికి అనుగుణంగా మీయొక్క ఆలోచనలు మార్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇస్తారు. మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన విషయల్లో కాస్త ఇబ్బందిని పొందుతారు 


         

మకర రాశి :  ఈవారం మొత్తంమీద పెద్దలతో కలిసి చేసిన ఆలోచనలు కార్యరూపం దాల్చుటకు అవకాశం ఉంది. కుటుంభంలో జీవితభాగస్వామి మూలాన కొత్త విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. తల్లితరుపు బంధువుల ద్వార సహాయం అందుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది అలాగే అధికారుల నుండి ఆశించిన విధంగా మంచి గుర్తింపును పొందుతారు. స్వల్పప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంప్రదాయ పనులలో బాగా రాణిస్తారు కావున ఈ విషయంలో సరైన ప్రయత్నాలు చేయుట మంచిది. సోదరసంబంధమైన విషయాల్లో వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం మూలాన సంతోషాన్ని పొందుతారు వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు.        

   

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టు పనుల విషయంలో తొందరపాటు కూడదు. నలుగురిలో పనిచేసే సమయంలో అందరిని కలుపుకొని వెళ్ళుట మేలు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట అన్నివిధాల మేలు. మీయొక్క మాటతీరు చాలామందికి నచ్చకపోవచ్చును కావున సర్దుబాటు అవసరం. మానసికంగా చిన్న చిన్న విషయల మూలాన అధికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం కలదు. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వడం అనేది సూచన. మిత్రులతో చేయు చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చును. కుటుంభసభ్యుల నుండి సహకారం ఆశిస్తారు మిశ్రమఫలితాలు వస్తాయి.              

  

మీన రాశి : ఈవారం మొత్తంమీద నలుగురికి ఉపయోగ పడే ఆలోచనలు కలిగినను నిదానంగా వ్యవహరించుట సూచన. ఒక పనికి సమయం ఇవ్వడం అనేది ఉత్తమం ఒకేసారి రెండు రకాల పనులను ఆరంభించక పోవడం మేలు. కుటుంభంలో సభ్యులతో కలిసి చర్చలలో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి చేయు పనులు ఒక కొలిక్కి వస్తాయి. ధనమునకు సంభందించిన విషయాల్లో మాత్రం ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మేలు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సోదరుల నుండి సమయానికి సహకారం లభిస్తుంది. మొండినిర్ణయాలు తీసుకొనే అవసరం వచ్చే అవకాశం ఉంది మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి.            

టి. శ్రీకాంత్ 

వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు