గ్రహాలు -జ్యోతిషం
గతవారం మనం గ్రహాలు వాటి గమనం అదేవిధంగా వాటిమీద ఉండే వాతావరణం అలాగే జ్యోతిషపరంగా ఆ గ్రహం యొక్క విశిష్టత మొదలైన వాటి గురుంచి తెలుసుకుంటున్నాం. సూర్యుడు,బుధుడు మొదలైన గ్రహాల గురుంచి తెలుసుకున్నాం. సూర్యునికి వేదాలు,శాస్త్రాలు అలాగే నేటి ఆధునిక వైద్యశాస్త్రం అత్యంత ప్రాధాన్యం ఇచ్చాయి. ఆధునిక వైద్యం ప్రకారం మానవునికి డి -విటమిన్ చాలా అవసరం. అనేక పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు రక్తపోటును అదుపులో ఉంచడంలో, ఎముకలలో బలాన్ని పెంచడంలో అదేవిధంగా వెన్నుకు బలాన్ని ఇవ్వడంలో "డి- విటమిన్" చాలా అవసరం అని తెలియజేసారు. ఒకసారి మన పూర్వీకుల విధానం గమనిస్తే ప్రతిరోజు మూడుపూటలా సంధ్యావందనం చేసే వారు దానిమూలాన మానవునకు కావల్సిన విటమిన్ ను పొందేవాళ్ళం. ఇది మన పూర్వీకులలో ఉన్న వైజ్ఞానికత.
శుక్రుడు :-
శుక్రగ్రహం సూర్యునికి రెండవ దూరంలో ఉన్న గ్రహం. శుక్రగ్రహం యొక్క భ్రమణకాలం 243 రోజులు. పరిభ్రమణకాలం 225 రోజులు. శుక్రుడు అత్యంత వేడిని కలిగి ఉన్న గ్రహం. శుక్రగ్రహానికి ఉపగ్రహాలు లేవు. శుక్రగ్రహం అన్నిగ్రహాల వలె కాకుండా భిన్నంగా తనచుట్టూ తానూ ఎడమ నుండి కుడికి తిరుగుతుంది. భూమికి మరియు శుక్రునకు పోలికలు కలవు. శుక్రిని వ్యాసం 7610 మైళ్ళు. భూమిపైన 100 కిలోల బరువు ఉండే వ్యక్తి శుక్రగ్రహం పైన 88 కిలోలు ఉంటాడు. అనగా శుక్రినిలో గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో 88 వంతులు ఉంటుంది. శుక్రుడిని పగటిపూట కూడా చూడవచ్చును. టెలీస్కోప్ సాయంతో పరిశీలిస్తే శుక్రున్ని బాగాపరిశీలించవచ్చును.
జ్యోతిషంలో శుక్రుడు:-
సనాతన సంప్రదాయం ప్రకారం శుక్రుడు బృగుమహర్షి కుమారుడు. రాక్షషులకు గురువు శుక్రుడు అలాగే దేవతల గురువైన బృహస్పతికి ప్రత్యర్థి. మృతసంజీవని విద్య తెలిసినవాడు. గ్రీకుల ప్రకారం శుక్రుడు స్త్రీ దేవత. జ్యోతిషం ప్రకారం కూడా శుక్రుడిని స్త్రీ గ్రహంగానే చెబుతుంది. రోమన్లు శుక్రుడిని వీనస్ అని పిలిచేవారు. ప్రస్థుతం అందరు అలాగే పిలిస్తున్నారు. శుక్రుని వర్ణం తెలుపు. శుక్రుడు స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ కు కారకుడు. కలత్రం,వివాహం,దాంపత్యం ,కన్నులు క్రీడలు మొదలైన వాటికి కారకుడు.
సనాతన సంప్రదాయం ప్రకారం శుక్రుడు బృగుమహర్షి కుమారుడు. రాక్షషులకు గురువు శుక్రుడు అలాగే దేవతల గురువైన బృహస్పతికి ప్రత్యర్థి. మృతసంజీవని విద్య తెలిసినవాడు. గ్రీకుల ప్రకారం శుక్రుడు స్త్రీ దేవత. జ్యోతిషం ప్రకారం కూడా శుక్రుడిని స్త్రీ గ్రహంగానే చెబుతుంది. రోమన్లు శుక్రుడిని వీనస్ అని పిలిచేవారు. ప్రస్థుతం అందరు అలాగే పిలిస్తున్నారు. శుక్రుని వర్ణం తెలుపు. శుక్రుడు స్త్రీలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ కు కారకుడు. కలత్రం,వివాహం,దాంపత్యం ,కన్నులు క్రీడలు మొదలైన వాటికి కారకుడు.
కుజుడు: -
కుజుడిని మార్స్ అని పిలుస్తారు అలాగే ఎర్రగ్రహంగా అభివర్ణిస్తారు. ఈ మధ్యకాలంలోనే మంగళ్ యాన్ అనే పరీక్షను విజయవంతం చేసారు మన భారతీయ పరిశోధకులు. కుజునకు రెండు ఉపగ్రహాలు కలవు. వీటిని పూర్తిస్థాయి ఉపగ్రహాలు అనలేము కాని అవి ఉపగ్రహానికి కావలసిన లక్షణాలు కలిగి ఉన్నవి. చాలామంది కుజుడి గురించి చాలవాదనలను వినిపిస్తారు. మనకంటే ముందే కుజగ్రహం పైన చరిత్ర అలాగే నాగరికత ఉన్నదని. మరికొంతమంది ఈ గ్రహం పైన జీవం ఉంది అని అంటున్నారు. కుజునకు పరిబ్రమణకాలం 24 గంటల 37 నిమిషాలు. కుజుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేకాలం మనకాలమాన ప్రకారం 687 రోజులు. భూమి వాతావరణం అలాగే కుజ వాతావరణం ఒకేలా ఉండటం వలన కూడా రెండింటికి అత్యంతప్రాధాన్యం ఇచ్చారు పరిశోధకులు.
జ్యోతిషంలో కుజుడు :-
కుజుడు భూమి పుత్రుడు అనిప్రాచీన ,ఆధునిక పరిశోధకులు తేల్చిచెప్పారు. కుజ బ్రమణ కాలం అలాగే భూమి బ్రమణ కాలం దాదుపుగా సమానం. కుజుడు శిరస్సు,మెదడు,రక్తం,పురుశినిలో ని బాహ్యజనన అవయవాలు మొదలైన వాటికి అధిపతి. సాహసం,ధైర్యం ,పరాక్రమం ,వాహనముల వలన సంభవించు ప్రమాదాలు మొదలైన వాటికి కారకునిగా చెప్పబడినది. అలాగే కుజుని వలన కలిగే వ్యాధులు గర్భస్రావం, రక్తపోటు,అంటురోగాలు ,స్త్రీలలో రుతుక్రమవ్యవస్థ ,చర్మముపైన దురదులు మొదలైన వాటికి కారకుడు. .
....