శ్రీ గురుభ్యోర్నమః
గ్రహాలు - జ్యోతిషం
గ్రహాలు అంటే గ్రహించే తత్వం కలిగినవి అర్థం. నిర్దిష్టమైన ద్రవ్యరాశిని కలిగి ఒక నిర్దిష్టమైన కక్ష్యలో సూర్యుని చుట్టూ నిరంతరంగా తిరుగుతూ ఉంటాయి. నేటికి ఆధునిక మానవుడు మేధస్సు గ్రహాలను శోదించే పనిలో నిరంతర శోధన కొనసాగుతూనే ఉంది. ఎలాంటి పరికరాలు లేకుండా మన భారతీయలు వేదాలలో అలాగే మంత్రశాస్త్రాల్లో వాటికి ఒక రూపం ఇచ్చారు. ఇక్కడ మనం ఒక్కటి గమనించవచ్చును. శోధన అనే పరశీలన చాలా గొప్పదిగా కనిపిస్తుంది. మన శ్లోకాలను అవహేళన చేయకుండా వాటి గురుంచి తెలుసుకొనే ప్రయత్నం చేస్తే మరింత ఉన్నతమైన ఫలితాలు పొందవచ్చును. మనం ఇంత వరకు భూమి,భుధుడు. కుజుడు, గురుడు , శుక్రుడు , శని అలాగే చంద్రుడు ఇలా వీటి యొక్క విశేషాలు అలాగే జ్యోతిష పరంగా అవి మానవుల పైన ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయో అలాగే వాటికి జ్యోతిషంలో గల ప్రాముఖ్యత తెలుసుకున్నాం. అలాగే నేడు జ్యోతిషం దృష్ట్యా రాహు,కేతువులు సైన్స్ దృష్ట్యా నోడ్స్ వాటి గురుంచి తెలుకుందాం.
రాహు,కేతుగ్రహాలు :-
జ్యోతిషంలో రాహు,కేతువులకు అధికమైన ప్రాముఖ్యత కలదు. రాహు వృశభరాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. వృశ్చికంలో నీచ స్థితిని పొందుతాడు. కేతువు వృశ్చికంలో ఉచ్చస్థితిని పొందుతాడు. వృశభరాశిలో నీచ స్థితిని పొందుతాడు. ఈ రెండు గ్రహాలు కూడా గ్రహాలు కావు. ఈ రెండు గ్రహాలు కూడా చంద్ర,సూర్య గ్రహణాలు ఏర్పడటంలో ప్రముకపాత్రను పోషిస్తున్నాయి. రవిమార్గంలో గ్రహాలు ప్రయాణిస్తాయి. చంద్రుడు భూమి ఉపగ్రహం కావడం వలన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చంద్రుడురవి మార్గాన్ని దక్షిణం నుండి ఉత్తరం వైపు దాటే బిందువును రాహువు అని. ఉత్తరం నుండి దక్షిణం వైపు కదులుతూ రవి మార్గాన్ని కండించే బిందువును కేతువు అంటారు. ఒక పూర్తీ మారుకు వీటికి 18 సంవత్సరాలు పడుతుంది.
జ్యోతిషంలో రాహు,కేతుగ్రహాలు :-
మన పురాణాలలో వీటి గురుంచి ఒక కత ప్రచారంలో ఉంది. దేవదానవులు క్షీరసాగరమధనం చేసిన తర్వాత లభించిన అమృతాన్ని మొదటగా దానవులు చేజిక్కించుకుంటారు. దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా స్త్రీ రూపంలో వచ్చి ఆ అమృతాన్ని అందరికి పంచుతానని చెప్పి మొదటగా దేవతలకు ఇవ్వ ఆరంభించాడు. దానవులు ఈ రహస్యాన్ని గుర్తించలేకపోయారు. రాహువు , కేతువు అనే రాక్షసులు మాత్రం దేవతలతో పాటుగా ఈ అమృతాన్ని తీసుకొనే ప్రయత్నం చేస్తే రవి, చంద్రులు శ్రీ మహావిష్ణువునకు సైగ చేసారు అని వెంటనే విష్ణువు త సుదర్శన చక్రంతో వారిని ఖండిచాడు అని అందుకే ఒకరికి తల, మరొకరికి మొండం ఉండదు. తమను పట్టించిన కారణంగా రాహువు, కేతువులు రవి ,చంద్రులను మింగుతూ ఉంటారు అని అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
రాహువు ఇతరులకు భాధలు కలిగే విధంగా నడుచుకొనుట,దొంగలు ,పర్వతాలు , జూదము, స్మశానాలు,కారాగారాలు,విదేశగమనం మొదలైన వాటికి అధిపతి. అదేవిధంగా అనారోగ్యం విషయంలో ఊపిరితిత్తుల వ్యాధులు,మోకాలినొప్పులు, విషపదార్థాల వలన వచ్చే రోగాలు,మశూచి ని కలుగజేస్తాడు. కేతువు మోక్షకారకుడు,సంకోచం,పిసినారి